Naatukodi Pulusu Recipe with step by step instructions.English Version
చిన్నప్పుడు వేసవి సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్లినపుడల్లా మాకు కోడి పులుసు చేసిపెట్టడానికి మా మేనమామలు ఇంట్లో పెంచుకునే కోడిని పట్టుకొని, వాళ్ళే కోసేవారు.మా పెద్ద అత్త నాటుకోడి పులుసు చాలా ఆద్భుతంగా వండేది.కానీ ఆవిడ మాత్రం అసలు మాంసాహారం ముట్టుకోదు.కనీసం రుచి కూడా చూడకుండా అంత బాగా ఎలా వండేదా అని ఆశ్చర్యపోయేదాన్ని.ఇప్పుడున్నట్లుగా అప్పుడు చికెన్ షాపులు అవీ ఉండేవి కాదు.వారానికోసారి ఊరి చివర మేక మాంసం, నాటుకోడి మాంసం అమ్మేవారు.రేపు అమ్ముతారనగా ఇవాళ ఊరంతా డప్పు కొట్టి చాటింపు వేసేవారు.కావలసిన వాళ్ళు వెళ్లి తెచ్చుకునేవారు.
నాటుకోడి మాంసం మామూలు ఫారం కోడి మాంసం లా కాకుండా గట్టిగా ఉంటుంది.అందుకే కొంచెం ఎక్కువ సేపు నానబెట్టాలి.రెండు నుండి మూడు గంటల సేపు నానబెడితే సరిపోతుంది.మాకు బాగా జలుబు చేసినపుడు మా అమ్మ ఈ కూర వండేవారు.కాస్త కారం ఎక్కువగా వేసి వండేవారు.తినగానే అంతే ఇక వెంటనే ముక్కు కారిపోయేది.నాటుకోడి మాంసంలో మాంసం కన్నా ఎక్కువ బోన్స్ ఉంటాయి.అందుకే నేను కాస్త పులుసు ఎక్కువగా ఉండేటట్లుగా వండుతాను.
ఈ నాటుకోడి కూరని వేడి వేడి అన్నంతో గానీ, రోటీలతో గానీ, రాగి సంకటితో గానీ తింటే చాల రుచిగా ఉంటుంది.రాగి సంకటి ఇంకా నాటుకోడి పులుసు చక్కటి కాంబినేషన్.ఇది ఒక రాయలసీమ వంటకం.ఇప్పుడు దాదాపు అన్ని హోటళ్ళలో ఇది మెనూ లో ఉంటుంది.రాగి సంకటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.మీరు కూడా ఎంతో రుచికరమైన ఈ నాటుకోడి పులుసు తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటకాలు
Chicken Tikka Pulao Recipe in Telugu
Chicken Liver Fry in Telugu
Andhra Pepper Chicken Recipe in Telugu
Gongura Chicken recipe in Telugu
Fish Biryani recipe in Telugu
For the English version of this recipe Click here
- 500 గ్రాములు నాటుకోడి మాంసం
- ¼ పసుపు
- 1 tsp ఉప్పు
- 1 tsp కారం
- 1 tsp ధనియాల పొడి
- ½ నిమ్మకాయ
- 1 tbsp ధనియాలు
- 2 దాల్చినచెక్కలు
- 4 లవంగాలు
- 1 tsp గసగసాలు
- 1 tsp కొబ్బరి పొడి
- 2 మీడియం ఉల్లిపాయల తరుగు
- 3 పచ్చిమిరపకాయలు
- 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
- 2 రెమ్మలు కరివేపాకు
- ¼ పసుపు
- ఉప్పు తగినంత
- 1 ½ కారం
- 5 tbsp నూనె
- 500 ml నీళ్ళు
- ¼ కప్పు కొత్తిమీర తరుగు
-
చికెన్ ముక్కల్ని ఒకటి రెండు సార్లు కడగాలి.
-
పసుపు వేసిన మజ్జిగలో ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి.
-
ముక్కల్ని ఇంకోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.
-
శుభ్రం చేసిన చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, సగం నిమ్మకాయ వేసి బాగా కలిపి రెండు గంటల పాటు నానబెట్టాలి.
-
ఒక చిన్న పెనంలో ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చేవరకు సన్నని సెగ మీద వేయించాలి.
-
అదే పెనంలో గసగసాలు, కొబ్బరి పొడి కుడా వేసి గసగసాలు చిటపటలాడేవరకు వేయించాలి.
-
తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
-
ఒక ప్రెషర్ పాన్ లో 5 tbsp ల నూనె వేసి వేడిచేయాలి.
-
అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి.
-
పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
-
తర్వాత నానబెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి.
-
మూత తెరిచి, చికెన్ మసాలా వేసి కలిపి, సుమారుగా అరలీటరు నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
-
అవిరంతా పోయేవరకు అలాగే వదిలేసి, తర్వాత మూత తెరిచి కొత్తిమీర తరుగు వేయాలి.
Naatukodi Pulusu Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=dLKOowGhPas[/embedyt]
vijay says
very nice and looks easy to prepare
BINDU says
Thank you….
Keerthi Varma says
Recipe turned out great. Tried today.
BINDU says
Thank you for your kind feedback…