నా గురించి నేను చేసే పని గురించి:
నా పేరు హిమ బిందు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. రోజూ ఏదో ఒక్క కొత్త విషయం నేర్చుకోనిదే నాకు నిద్ర పట్టదు. ఏదైనా చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే అది జరిగే వరకు నేను ఎవరినీ పట్టించుకోను, నిద్రపోను. నేను ఏదైనా చేయలేదు అంటే అది చేయాలని నేనింకా అనుకోలేదని అర్ధం. కొద్దిగా సినిమా డైలాగ్ లా ఉన్నా అది మాత్రం నిజం. నా చివరి శ్వాస వరకు విద్యార్ధిని గా ఉండాలనేదే నా ఆశ. మనం ఏదైనా ఉపయోగపడే కొత్త విషయం తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది అని నేనెప్పుడు నమ్ముతాను.
నేను పెళ్లయినాకే మాస్టర్స్ డిగ్రీ చేశాను. అప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో ఉండి మా పాపని చూసుకునే వారు. నా రెండవ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక మా అమ్మగారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. అది నేనస్సలు తట్టుకోలేక పోయాను. ఒక్కసారే నాకేమి చేయాలో అర్ధం కాలేదు. లైఫ్ అంతా చాలా శూన్యం గా అనిపించింది. అమ్మనే గుర్తు చేసుకుంటూ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లాను. రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చేదాన్ని. చాలా లావయిపోయాను. ఆ డిప్రెషన్ లో నుండి బయట పడడానికే ఎప్పుడూ ఏదో కోర్స్ లో జాయిన్ అవడం, మా అమ్మాయి school కి వెళ్ళిన సమయం లో వెళ్లి నేర్చుకోవడం చేస్తుండే దాన్ని. కానీ ఉద్యోగం చేసే ఉద్దేశ్యం మాత్రం లేదు. ఇది నేను మా అయన కలిసి తీసుకున్న నిర్ణయం. మా పాప school నుండి ఇంటికి వచ్చే సరికి మా ఇద్దరిలో ఎవరో ఒకరం కచ్చితంగా ఇంట్లో ఉండాలి. డబ్బు సంపాదించక పోయినా పర్వాలేదు కానీ తనని మాత్రం జీవితంలో ఎప్పుడూ క్రష్ లో, డే కేర్ సెంటర్స్ లో, ట్యూషన్ లో, హాస్టల్ లో కానీ వేయకూడదని అనుకున్నాము.
ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే నేను, మా హస్బెండ్ ఇంకా మా అమ్మాయి. చిన్న ఫ్యామిలీ. మా ఆయన సచిన్ వీక్ డేస్ లో software Engineer గా పనిచేస్తారు వారాంతాల్లో వ్యవసాయం చేస్తారు. మా అమ్మాయి సహస్ర(హనీ) ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. నేను చేసే ప్రతీ పనిలో వారిద్దరూ నాకెంతో సహాయంగా ఉంటారు. నా అతి కోపాన్ని, అసహనాన్ని, నా పిచ్చి ని సహించి నా పనికి విలువిచ్చి నా మానాన నన్ను వదిలేస్తుంటారు. రోజు ఉదయం 5.30 గంటలకు లేస్తాను మళ్ళీ రాత్రి 1 లేదా 2 గంటలకు పడుకుంటాను. మా అమ్మాయి 7.30 కు school కి వెళ్ళడంతో ఇక నా పనులు ముగించుకొని 8.30 గంటల కంతా నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. అవసరమైతే మధ్యాహ్నం ఓ గంటన్నర పడుకుంటాను. అంటే నేను రోజూ సుమారు 16 నుండి 18 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి. రెండు వెబ్ సైట్ లు foodvedam.com & maatamanti.com , youtube ఛానెల్స్ foodvedam & B like Bindu ఇంకా మా అమ్మాయి చదువు, ఇంటి పని చూసుకోవాలి. website లు చూసుకోవడం లేదా బ్లాగింగ్ చేయడం చాలా చాలా కష్టం. ఒక వెబ్ సైట్ ని 5 గురి నుండి సుమారు 20 మంది సభ్యుల దాకా మైంటైన్ చేస్తుంటారు. అందులో ఒక్కరే మెయింటైన్ చేయాలంటే మరీ కష్టం.
ఎప్పుడు ఎవరిని నాకిది నేర్పించమని అడగలేదు. ఇంకొకరి మీద ఆధార పడడం అంటే నాకు చాలా చిరాకు(ఒక్క మా ఆయన మీద తప్ప 😜). వెబ్ ఆర్టికల్స్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతగా వారి యాడ్స్ ని క్లిక్ చేసి నాకవసరమైనవి షాపింగ్ కార్ట్ లో యాడ్ చేసుకుంటాను. youtube లో అయితే వారి వీడియోస్ చూసే టప్పుడు యాడ్స్ వస్తే స్కిప్ చేయకుండా చూస్తాను. దీని వల్ల వారికి కొంత డబ్బు వస్తుంది. వారు నాకవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆమాత్రం కూడా చేయకపోతే ఎలా?
వెబ్ సైట్స్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏమి చేయాలో ఎలా చేయాలో కొద్దిగా కాదు కదా ఒక్క ముక్క కూడా ఐడియా లేదు. కంటెంట్ రాయడం వచ్చు కానీ వెబ్ సైట్ తయారు చేయడం రాదు. బయట అడిగితే నాకు కావాల్సిన Functionality కి 2 1/2 లక్షలు అడిగారు. నేను డబ్బు సంపాదించక పోయినా పర్వాలేదు కానీ వృధా మాత్రం చేయ కూడదని ఎలా అయినా నేనే స్వంతంగా తయారు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. రాత్రిళ్ళు నిద్ర పోకుండా గంటలు గంటలు వాటి గురించి చదివి wordpress గురించి తెలుసుకున్నాను.తక్కువ ఖర్చుతో మొదలు పెట్టాను. మొదట్లో చాలా చాలా కష్టపడ్డాను. మొదట్లో ఒకసారి అయితే వెబ్ సైట్ బ్యాక్ అప్ చేసుకోక పోవడం వల్ల బ్యాక్ ఎండ్ లో plugins misconfiguration వల్ల సైట్ మొత్తం ఎగిరి పోయింది.ఆ రోజు రాత్రంతా కూర్చుని ఏడ్చాను. మా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో మళ్ళీ పని మొదలు పెట్టాను. గూగుల్ cached పేజెస్ సహాయంతో మళ్ళీ కంటెంట్ అంతా create చేసుకున్నాను. దీని తర్వాత బ్యాక్ అప్ చేసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు.
ఇదంతా విడమర్చి ఇంతగా నా గురించి చెప్పానంటే, ఈ నాలుగేళ్ళలో వీటిని ఈ స్థితికి తీసుకు రావడానికి నేనెంతో శ్రమ పడ్డాను. ఒక వెబ్ సైట్ గానీ youtube చానెల్ కానీ స్టార్ట్ ఎవైరనా స్టార్ట్ చేయ వచ్చు.కానీ వాటిని మైంటైన్ చేయడం చాలా చాలా కష్టం. పైగా కేవలం డబ్బు కోసమే అయితే మాత్రం వేరే దారి చూసుకోవడం మంచిది. ఎందుకంటే మొదలు పెట్టిన వెంటనే అసలు డబ్బు రాదు. డబ్బు గురించి ఆలోచించకుండా నిరంతరం అలుపు లేకుండా శ్రమిస్తూనే ఉండాలి.ఇవాళ మొదలు పెట్టగానే రేపు డబ్బులు రావాలనుకునే వారు అసలు వీటి గురించి ఆలోచించక పోవడమే మంచిది.
వీటన్నింటి కంటే ముందు దాదాపు సంవత్సరంన్నర్ర GROUP-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. కానీ సాధించలేకపోయాను. అది అంత తేలిక కాదని నాకు తెలుసు. ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలీదు. అసలు నేను దాని గురించే ఆలోచించ లేదు. నాకు కావలిసింది ఖాళీగా ఉండకుండా ఉండడం మాత్రమే. చేసే పని నా ప్రయత్న లోపం లేకుండా నిబద్ధతతో చేయడమే నాకు తెలుసు. అంతకు ముందు బయట కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో .Net Framework కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అని వెంటనే గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. మా ఆయన, మా అమ్మాయి, మా నాన్న తప్ప చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. చదవగానే నీకేదో ఉద్యోగం వచ్చేసినట్లు అనే భావంతో. కానీ వాళ్ళని చూసి నేను మనసులో నవ్వుకునేదాన్ని. విద్యార్జన కేవలం ధనార్జన కోసం కాదు జ్ఞానార్జన కోసమని పాపం వాళ్లకు తెలీదు కదా. చదివిన చదువుతో డబ్బు సంపాదించ లేకపోతే అసలా చదువే వృధా అనే దురభిప్రాయం ఈ సమాజంలో చాలా మందికి ఉంది.
చదువును డబ్బుతో తూకం వేయడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కానీ నా ప్రిపరషన్ అయ్యే సరికి నేను, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ లో చాలా తెలుసుకున్నాను. ఎకానమీ మాత్రం లో నేను చాలా చాలా వీక్. మా అమ్మాయికి ఏది కావాలంటే అది హ్యాపీ గా నేనే చెప్తాను.తనకి ఇంతవరకు ట్యూషన్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అసలు నేను చదివేటప్పుడే మా అమ్మాయి కూడా నాతో పాటు అవన్నీ చాలా మటుకు నేర్చేసుకుంది. ఇంత పెద్ద explanation నన్ను చూసి నవ్వుకున్న వాళ్లకి నేను ఇవ్వలేదు. మూర్ఖులని మార్చే ఉద్దేశ్యం నాకు లేదు.
నాకు అంత్యంత ఇష్టమైనవి
నేనంటే నాకు చాలా ఇష్టం. ఏకాంతంగా ఉండడం అంటే ఇష్టం. ఏకాంతంలో ప్రశాంతత ఉంటుంది. మనతో మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, తర్కించుకోవచ్చు, మనల్ని మనం సరిచేసుకోవచ్చు. జ్ఞానం సంపాదించవచ్చు. మనతో మనం స్నేహం చేయవచ్చు. మన గురించి మనం బాగా తెలుసుకోవచ్చు. ఇదేదో పిచ్చి మాటల్లా ఉన్నా నిజంగా నిజం. ఇది అర్ధం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది చాలా అందంగా అనిపిస్తుంది. ఎవరైనా నన్ను “ఎప్పుడు ఒక్కదానివే ఉంటావు బోర్ కొట్టదా నీకు?” అంటే నవ్వి ఊరుకుంటాను. ఎలా చెప్పాలి వాళ్లకి ఇంకొకరి వల్ల కలిగే ఆనందం వారితోనే వెళ్ళిపోతుందని. వాళ్ళ వలన కలిగిన దుఃఖం వాళ్ళు వెళ్ళిపోయినా పోదని.
నాకు నాతో పాటు పల్లెటూర్లు, అటవీ ప్రాంతాలు, అందమైన ప్రకృతి, చెట్లు, కుక్కలు, ఆవులు, గేదెలు, వ్యవసాయం. నా ఏకాంతంలో ఇవి ఇప్పుడు ఉంటాయి. వీటిలో ఏది కనిపించినా నన్ను నేను మర్చిపోతాను.
ఆహారం లో అయితే అరటి ఆకులో వడ్డించిన ఆంధ్రా భోజనం, మా అమ్మ కలిపిచ్చే కమ్మని కాఫీ(ఇప్పుడు లేదు 🙁 ), చాకొలెట్లు( మా అమ్మయి దగ్గర లాక్కొని తినేవి ఇంకా బాగుంటాయి 🙂 ), మా ఆయన నాకు ప్రేమతో తినిపించే పప్పన్నం.
టీవీ లో అయితే పాత బ్లాక్ & వైట్ తెలుగు సినిమాలు అంటే చచ్చేంత పిచ్చి. మా ఆయనకీ, మా అమ్మాయికి కూడా అలవాటు చేశాను. డోరేమాన్, షిన్ చాన్, టామ్&జెర్రీ, పింక్ పాంథర్, మోటు పత్లు కార్టూన్స్, ఇంకా ఇంగ్లీష్ మూవీ చానల్స్ అంటే ఇష్టం.
ఎప్పుడూ చిలిపిగా ఉంటూ అల్లరి పనులు చేయడం అంటే నాకిష్టం. మా అమ్మాయి రాస్తుంటే తన చేయి కదిలించడం, నీళ్లు తాగుతుంటే నీళ్లు ముఖం మీద పడేలా గ్లాస్ ను కొట్టడం, నీళ్లు తాగి మా అమ్మాయి మీద మా ఆయన మీద ఊయడం లాంటి పిచ్చి పనులు. మా హనీ ని నేనే గిచ్చి తనే నన్ను గిచ్చిందని సచిన్ కి అబద్దం చెప్పడం. ఆటల్లో తొండి చేయడం నాకిష్టం. ఏదో ఒక నోటికొచ్చిన అబద్దం చెప్పి హనీని మా ఆయనతో తిట్టించడం భలే ఉంటుంది. నా చాకోలెట్లు ముందే గబ గబా తినేసి దొంగతనంగా మా హనీ చాకోలెట్లు కూడా తినడం బాగుంటుంది. మా అమ్మాయి హోమ్ వర్క్ diary లో సైన్ చేయమంటే రోజుకోలా చేస్తాను. టీచర్ మా అమ్మాయే సైన్ చేసిందనే అనుమానంతో దాన్ని పనిష్ చేయాలని. మొదట రెండు మూడు సార్లు అనుమానించినా ఇక టీచర్స్ కి కూడా తెలిసిపోయి నేను ఎంత ఛండాలంగా పెట్టినా ఏమి అనేవారు కాదు.
నాకు అస్సలు ఇష్టం లేనివి
పక్కింటి వాళ్ళతో ఎదవ సోది మాట్లాడడం. నేను ఎవరింటికీ వెళ్ళను. వాళ్ళ పర్సనల్ విషయాల్లో అసలు జోక్యం చేసుకోను. అతి చొరవ తీసుకోను. నా హద్దుల్లో నేను ఉంటాను. ఒకవేళ తప్పని పరిస్తితులలో మొహమాటానికి ఏదైనా వినాల్సి వస్తే విని వెంటనే వదిలేస్తాను. 5 నిమిషాలకు మించి ఎవరైనా ఏదైనా నాకు ఇష్టం లేని విషయాలు మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది పడతాను. 3 వ వ్యక్తి గురించి మాట్లాడితే వినడం నాకిష్టం లేదు. అసలు నాకలాంటివి వినే టైమే ఉండదు. చాలా చాలా చిరాకు నాకు. మా అమ్మ నాకు అలా ఉండడం అలవాటు చేశారు. తను కూడా టిపికల్ హౌస్ వైఫ్ లా ఒకరి మీద ఒకరికి చెప్పడం లాంటివి చేసేవారు కాదు.
మేక్ అప్ చేసుకోవడం అంటే ఇష్టం లేదు. అసలు ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలీదు. నేనెప్పుడూ దాని జోలికి పోలేదు.beauty parlors కి వెళ్ళను.నా హెయిర్ కట్ కి కూడా మా ఆయన వెళ్ళే మెన్స్ సెలూన్ కి వెళ్తాను. అద్దం ముందు అర నిమిషం నిలుచున్నా టైమ్ వేస్ట్ అనిపిస్తుంది నాకు.
భారీగా నగలు వేసుకోవడం, దుస్తులు ధరించడం ఇష్టం ఉండదు. ఒక్క మా ఆయన తయారవమని అడిగితే తయారవుతాను తప్ప ఇంకెవరు ఏమి అనుకున్నా అసలు పట్టించుకోను. పొడవాటి జుట్టు ఇంకా పూలు తలలో పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. అవి అందంగా చెట్టు మీదే ఉంటే ఎంతో బాగుంటాయి.
హ్యాండ్ బాగ్ తగిలించుకోవడం ఇష్టం లేదు. ఒక వేళ బలవంతగా తగిలించుకున్నా కచ్చితంగా ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోయి వస్తాను.
టీవీ సీరియల్స్, వాటిలో పాత్ర దారులు ప్రదర్శించే అతి క్రూరమైన హావ భావాలు చూస్తే నాకు పరమ కంపరం. ఈ మధ్య చవకబారు ద్వందార్దపు డైలాగులతో కూడిన కొన్ని ప్రోగ్రాములు వస్తున్నాయి. అవంటే ఇంకా అసహ్యం. మా ఇంట్లో అలాంటివి పూర్తిగా నిషిద్దం.
ఫోన్ వాడడం, ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడడం నాకు విపరీతమైన allergy. అసలు నేను ఎవ్వరికీ ఫోన్ చేయను. ఈ విషయంలో నావాళ్లందరికీ థాంక్స్ చెప్పాల్సిందే. నన్ను అర్ధం చేసుకుంటారు. నా ఫోన్ లో ఫీడ్ అయిన నంబర్స్ నాకు తెలిసిన నంబర్స్ వస్తేనే కాల్ అటెండ్ చేస్తాను. అప్పుడప్పుడు మా తమ్ముడికి తప్ప ఎవరికీ కాల్ చేయను. facebook లాంటివి వాడను. అది ఓపెన్ చేసి 2 సంవత్సరాలవుతోంది.
నా భయాలు ఫోబియాలు
కాలింగ్ బెల్ శబ్దం, సెల్ ఫోన్ శబ్దం, గుర్ఖా విజిల్, సినిమా హాల్ లో సౌండ్స్ అస్సలు పడదు. కొద్దిసేపు వినగానే చెమటలు పట్టేస్తాయి. గుండె దడ దడా కొట్టుకుంటుంది. దీనినే ఫోనో ఫోబియా అంటారు. అందుకే మా ఇంట్లో కాలింగ్ బెల్ ఉండదు. నా ఫోన్ దాదాపు మ్యూట్ లోనే ఉంటుంది. సినిమా కి వెళ్లడం అరుదు. thank god గూర్ఖాలు ఇప్పుడు లేరు.
క్యూ లో నిల్చోవాలంటే భయం. అందుకే రద్దీగా ఉండే గుడికి వెళ్ళలేను. పబ్లిక్ transport యూస్ చేయలేను. ప్రయాణాలంటే భయం ఆక్సిడెంట్ అవుతుందేమోనని.. చావంటే భయం లేదు కానీ అలా చావడం మాత్రం ఇష్టం లేదు. బయట ఎవరైనా ఇంట్లో కానీ షాపింగ్ మాల్స్ లో కానీ టాయిలెట్స్ వాడాలంటే ఇంకా భయం.
అతి శుభ్రం. నన్ను ఎవరైనా ముట్టుకుంటే భయం. మా అమ్మాయిని కూడా ముట్టుకోనివ్వను. స్కూల్ లో విపరీతంగా ఆడుకుని వస్తుంది కదా క్రిములు ఉంటాయేమోనని భయం. ఎవరింటికీ వెళ్ళడానికి వేరే ఊరు వెళ్ళడానికి ఇష్టపడను. అక్కడ నాకు నచ్చినట్లు శుభ్రంగా ఉండదని నా భయం. నా రోజులో కనీసం రెండు గంటలైనా ఇంటిని శుభ్రం చేయడానికి కేటాయిస్తాను. సమస్య ఏంటంటే శుభ్రంగా ఉన్నా శుభ్రం చేస్తాను. బాగా అలసిపోతాను. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు గోడల మీద చేతులు పెట్టినా, సోఫాలో కాళ్ళు పెట్టినా ఇష్టం ఉండదు. గోడల మీద మరకలు పడతాయేమోనని భయం. మరకలు, గీతలు ఉన్న గోడల్ని చూడలేను. వాళ్ళ కాళ్లకు ఉన్న క్రిములు అన్నీ సోఫాలో పాకుతూ ఉంటాయేమోనని టెన్షన్ పడతాను. మా అమ్మ, నాన్న, మా ఆయన, మా అమ్మాయి హనీ, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంతి మాత్రమే నాలా అతి శుభ్రంగా గా ఉంటారని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్లకు కూడా నాలానే అతి శుభ్రం జబ్బు ఉండడం వల్ల వాళ్ళు నా టీమ్ లో ఉంటారు. మిగిలిన అందరు ఏలియన్స్ నాకు😜.
కానీ ఎందుకో ఇంత అతి శుభ్రం జబ్బు ఉన్నా వీధి కుక్కల్ని మాత్రం బాగా ముద్దు చేస్తాను. అవి ఎంత మురికిగా ఉన్నా ముట్టుకుంటాను. ఒక్కోసారి ముట్టుకున్న వెంటనే చేయి కడుక్కునే అవకాశం లేదు అని తెలిసి నప్పుడు దూరం నుండే ముద్దు చేస్తాను. మా అమ్మాయికి ఎంత కోపమో. నీకు నాకన్నా ఆ కుక్కలే ఎక్కువా అంటుంది.పేద ముసలి వారు రోడ్ మీద కనిపిస్తే వారు ఎంత మురికిగా ఉన్నా పట్టించుకోను. ఆ రెండు సందర్భాలలో నా అతి శుభ్రాన్ని కష్టమైనా వదిలేస్తాను.
నా గురించి చాలా ఎక్కువ రాశాను కదూ! ఇంత అవసరమా అంటే అవసరమే. మీరు సరిగ్గా అర్ధం చేసుకుంటే మొత్తం కాకపోయినా ఎంతో కొంత సందేశం దాగి ఉంది. ఎప్పుడు ఎదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలని, ఖాళీగా ఉండకూడదని, ఎవరి మీద ఆధారపడకూడదని, మనల్ని మనం ప్రేమించుకోవాలని, ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లలాగానే ఉండాలని, Hmm వీటిన్నింటికి మించి బాగా శుభ్రంగా ఉండాలని సందేశం ఉంది. అవునా? కాదా ?😜🤗😊😊😘
Jashwitha says
Hi Bindu …sorry about your mother. Ma daddy chanipoyinapudu na paristhithi kuda milane…na second baby vachaka koddiga recover ayyanu. Anyway mi website and youtube channel gurinchi ayithe miru detailed ga cheppevidanam baguntundi. weight loss vi prasthutham mind lo pettukunnanu.start cheyali. Inka miru chala topics mida knowledge gain chesukunnanu annaru …adi kuda impart cheyandi..like sharing the books you read or any websites that you follow. Thank you do much.
BINDU says
Oh Jashwitha… sorry to hear about your father. I can understand your pain. meeru anukunna weight twaralone reach avvalani korukuntunnanu. naaku kooda chaala vishayaalu andariki upayoga padevi share cheyaalni undi. but time maatram assalu saripovatledu. rojuki 48 hours untey baagundunu anipistundi. asaalu nights anevi lekapothe inkaa baagunnu anipistundi. But I hope I could do that in the future.
Uma says
Hello Mrs Bindu…i saw your YouTube videos.where is your farm. The area and your house is very nice. ………Uma
Laxmi says
Hai Akka
Without ur permission I cld u akka.meru cheppevi oka guider la untai andukani annanu.evn I did my maters and I was worked for 4years a company.i have a son. He is premature.l left my job, taking care of him.Actually Naku Edo cheyali. xcpt house holding.andaru job join avvu antunaru.but ala cheste baby ni care cheyalem ani openin.but Edo okatki cheyali na interests enti ani analysis chesina taliyatle lengthy msg anukokunda nak sug evvara
Thank u Bindu garu
Ravi says
mothaniki mi OCD ni kid ki kuda teppincharu 🙂 mother feel inavi kids kuda feel avtharu . i saw many examples.
Jashwitha says
Thanks for the reply Bindu. Nenu IF start chesanu but rice thinakunda undaleka pothunna. IF lo rice thinacha?
Kiranmai says
Hi Bindu garu. Happy to know about you because chala vishayallo nannu nenu chuskunatlu undi …
BINDU says
Hi Kiranmai garu…Thank you andi mee viluvaina time ni kasepu naa blog chadavadaaniki spend chesinanduku. ayithe maniddaram okate batch annamaata
Nagarenuka says
Just I came to know abt you started following you ..aani websites chusanu …wt a genuinity Andi really inspired with each and every aspect …really very lovely very happy by seeing lyk u in present generation …just go on wt you desire madam..enduko telidu mi blogs mi videosanni 3days nundi continue ga chudalanpisthundi…just inspired
BINDU says
Namaste andi Renuka garu. meeru mee samayanni kontha naaku ketayinchinanduku dhanyavadamulu. Thank you so much for commenting here
కిరణ్ says
బిందు గారు,
మీరు ఈ వెబ్ సైట్ ని మోనటైజ్ చేయొచ్చు కదా. కొన్ని హై సీపీసీ కీవర్డ్స్ కి ఫస్ట్ పేజిలో ర్యాంక్ అయ్యింది మీ వెబ్ సైట్.
BINDU says
ee website ni already monetize chesanu andi.. and affiliations kudaa unnayi.
Venkat Sangu says
Farming to recipes with Video shooting, editing, web hosting, maintenance & blogging. Oh my god(very few time i do believe & remember him).
Your kitchen Video-2 received on WA from my friend, then explored your channel & came to know about your website
I completely read the “ABOUT ME” section. Could not resist to reply for it.
Very limited people with this much spectrum(i mean with this much knowledge & implementation).
You are just like how i want to be except the extra cleanliness :-).
By he way what is the budget of your kitchen cupboards?
BINDU says
Hi Venkat Garu. Thank you so much andi.
Bindu says
Bindu garu u r so inspired to me, of course to all woman. “Be like bindu” is apt for u. All the best
BINDU says
Thank you so much Bindu garu…
Preethi says
Never commented on any post before. I found myself in you. Mottham chadivaka, na gurinche nenu chaduvkunna feeling vacchindhi. Wish you all good in life. Godbless!
BINDU says
Hi Preethi garu Thank you so so much for commenting here andi and thank you so much for your wishes also
Aparna says
Hi Bindu garu Megurinchi chaduvutumte chala interesting ga vundi. Naku dry skin ki oil skin ki different chepara na skin type Anto naku teledu
BINDU says
Hi Aparna garu. Thank you so much andi. oily skin antey eppudu jiddugaa untundi face. dry skin antey skin smooth gaa undadu. glow kuda undadu. probably meedi normal skin ayi undavachu. anduke meeku dry&oil skin teliledu. aa renditlo edi unna evaru cheppakundaney manakey thelisipothundi.
Mamatha says
Hi Bindu garu,
You and your lifestyle is very inspiring. Visited your b like bindu today for the first time and spent 4 hours looking at ur videos. Didnt realise its midnight 1 o clock. How did i miss u all these years..!! I love farming but miss it badly as i am in UK. So i try to grow indian vegetables and that makes me happy. You are very down to earth and your conversations are so natural as if you are talking to your family. I really like that. Subscribed and looking forward to more videos. So glad i found you today.
BINDU says
Hi Mamatha garu. Thank you so much for visiting my blog and for commenting here andi . It means a lot to me.
Sai K Nagavelli says
Hi Bindu Garu,
My name is Sai. I came across one of your videos in YouTube while I was searching for something. The thumbnail was “Maa polam-Maa illu”.
I’ve read each and every word in the “About Me” page. Normally I do not care to reply or comment on any content published over the internet. But this time I was’nt able to control myself.
“Inkokari valla kaligina aanandam vaalathone vellipothundi, kaani vaalla valana kaligina dukkham, vaallu vellipoina manalni vidichi velladu”. This line definitely deserves a praise. A beautiful one-liner life-lesson/moral which everyone needs to know.
I believe in the quote “Cleanliness is a state of purity, clarity and precision”. I often get teased by my friends saying that I have an OCD problem, but I just say to myself “It is what it is..”
I liked almost all the points that you’ve expressed in this page except the sad part about your mom.
There is no other pain that could cause more grief than losing one’s own mom. I’m glad that you were able to come out of it.
I wish you good luck in posting more interesting videos on your YouTube channel. I’ve subscribed for it already.
I felt like you really stand as a very good real life example for a line that I’ve read somewhere. It says, “A good-woman is like a circle, she has the ability to create, nurture, protect and transform”.
Nevertheless, I felt like a small negative vibe abut this situation:
“Meeru ekkuva ga phone mute lo pedtharu ani raasinru kada. Unknown numbers nundi calls osthe receive cheskoru ani annaru. Kaani cheppalem, edaina emergency lo meetho meeku telsina vaalle edo reason valla, vaalla personal mobile switch off avvadamo lekapothe inkedo reason valla mimmalni reach avvalekapoyi unna situation lo, meetho urgent ga maatladali ankunevaallu, vere number nundi mundu message pampi nenu phalaana ani cheppe time kooda vaallaki lenappudu, miku vere number nundi call chesthe, appudu meeru receive cheskokapothe etla? Problem avvadaa?” Please think about it.
India lo manam intlo undi baitiki velthe, eppudu, evariki, ekkada em ibbandi osthundo assal expect cheyalem ani naa feeling.
Take care, Bindu Garu.
Stay safe.
Warm Regards,
Sai K Nagavelli.
BINDU says
Namaste Sai garu. First, Thank you so so much for spending your valuable time and writing here. it really means a lot to me. and thank you so much for subscribing to my channel. inka phone vishayam antaara meeru cheppindi nijame andi naa husband and daughter kuda idey worry avutuntaaru. ika aa baadha bharinchalekey naa chethiki oka apple watch tagilincharu. phone mute lo unna naa chetiki unna watch vibrate ayithe chusukuntanu ani. so purthiga kakapoyina sagam problem solve ayindi. ika anni phones lift cheydam practice cheyali..ha haa haa. Thank you once again andi.
Anusha says
Bindu garu <3
chaala baa anpinchindhi mee blog ni chadhuvaka.konni vishayllo mimlani inspiration ga theeskovali. your enthusiasm n tiredlessness super aslu. mee polam videos chusthe chala hardwork chesthu aa hardwork ne aswadisthunaru ..
Anuradha says
Very good bindu ..nice hardwork..thank you for inspiring me
Radhika says
Hi Bindu garu, Good to know about you, truly inspiring, have been watching your YouTube videos on keto diet, all of your videos are amazing. God bless you.
BINDU says
Thank you so much Radhika garu
Siva dharani says
Hi bindu gaaaru ….meee gurinchi foodvedam and maatamanti lo chadivanu ….I m so proud of you …n ..nee you tube channel B like bindu …is also toooo good n informative
BINDU says
Hi Dharani garu. Thank you so much andi.
Sabitha says
Nice, bagundi me lifestyle telusukovatam ,koncham naku similar ga anpinchindi
BINDU says
Thank you so much Sabitha garu.:)
Sridevi says
Bindu garu, asalu emi talent andi meedhi.. all rounder andi meeru..motham mee introduction chadivaanu.. chakkati telugu..navarasaalu nenu chadivanu mee ee page lo…mother gurinchi vachinappudu badha and tears in my eyes too, papa chocolates school dairy lo chilipithanam, Sachin gaari pappu annam lo Prema .. phone and calling bell ring lo bhayam inkaa ennenno..abba oka beautiful in&out and inspirational person andi meeru.. last but not least andi.. vidyarjana dhanaarjana kosam kaadhu gnanaarjana kosam annaru wow.. praasa andi..entha kaalaaniki oka chakkati nativity vunna writeup ni chadivanu Sorry for writing few things in English,, chala sepiu try chesanu exact words telugu lo raadhamu ani but Raavadam ledhu.. keep up the good work andi.. be happy stay happy and make all happy. I know u will. Mee abhimaani .
BINDU says
Thank you sooooooo much andi Sridevi garu. mee viluvaina time lo kontha theesukuni prematho comment raasinanduku. 🙂
Sitaramashastry says
జీవితం అంతా విద్యా ర్తిగా వుండాలి అనే మీ కోరిక చాలా నచ్చింది. నాకు గూడా అదే వుద్దేశ్యం వున్న ప్పటికి జ్ఞాపకశక్తి లోపించడం వల్ల చదివినవి గుర్తుండడము లేదు.శతమానంభవతి పోస్ట్
BINDU says
నమస్కారం అండి. మీకు ధన్యవాదములు. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుందనే భయంతోనే నేను ఎప్పుడు నా మెదడుకు వ్యాయామం చేయిస్తాను. పద వినోదం, సుడోకు పజిల్స్, రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం, కొత్త భాష నేర్చుకోవడం లాంటివి చేస్తుంటాను అండి.
Priyanka Gowada says
Hello Bundu gaaru..
ilaa open ga comment pettadam ide modatisari. 1st Vismai food ki mail chesanu but not in open. I heard ur name from Teja gaaru 1st. Then started watching food vedam den BLB. Glad to know about you.
Kaani wonder entante nannu nenu addam lo chusinattu ananu kaanii 70% matram pakka. Chadivi, 7yrs job chesi kevalam ante kevalam babu kosam resign chesi, thanaki anni nene nerpinchalani edokati nerchukuntu, vyasalu raasthu, maa babu chocolates enni sarlu thini ledani cheppedanno .. etc etc chaalaa excite feel ayyanu mee gurinchi chaduvuthu..
Meeru anna oka maata varaala ”inkokari valla kalige aanandam vaarithone vellipothundi”
Annattu mee antha shubram kaadu kaani naaku annitiki oka Geetha untundi hahaha ekkada nundi theesinadi akkade pettali ledaa aa roju intlo vallaki , walls meeda hands anedi naaku bhayam ekkada marakalu undipothayo ani..
Enno share cheyalani, meeelaa inkaa edo cheyalani chaalaa undi. But naaku inko 1yr papà so edii avadam ledu. Time management kosam try chesthunnanu prasthutham..
Naa manasulo maatani ilaa share chesukovadaniki avakasam ichhina mee MAATAMANTHI ki
Priyanka Gowada says
Sorry andi *Bindu
Typo error after post chusanu
Kshaminchagalaru
New language learn try cheyandi. Nenu adi chaalaa always learning kinda consider chesukuntanu. Naaku thelisi meeru cheathundi untaremo..
BINDU says
Oh..it’s okay andi. parledu. intha chinnadanike naa. haa andi nenu already French nerchukuntunnaa. 29 countries lo official language kadaa ani. maa ammayi 3rd language French andi. thana books chusi tanatho paatu nerchesukuntunna. and chala koddiga Spanish kuda try chestunna.
BINDU says
HI Priyanka garu. first I’m really sorry andi..intha late ga reply ichinanduku. and really thank you so much andi..mee valuable time lo naaku comment rayadam kosam use chesinanduku. meeru cheppedi vinte achu maniddari manstatvam oka lanee undi. inka konni rojulu wait cheyandi parledu. ippudu pillalatho undadame anandam. meeku etu experience undi kabatti inko 2 years tarvatha meeku nchindi cheyochu andi. Thank yo so much dear 🙂
Radhika anne says
Bindu garu same miru nenu okatey nitness no friends no calls pakainti vala sodhi esttam vundadhu
BINDU says
HI Radhika garu. oh avuna andi.. 🙂 alaa untey chala happy gaa untundi life
Raju says
Hello mamm
Ram babu says
Very nice video amma god bless you
BINDU says
Thank you so much andi
Deepa says
For to listen it would be silly but exactly your feelings and mine is 90% are equal I got u know after red your about. Rest 10% I like cleanliness( i clean bathroom, wash besin daily) but not as like you offcourse I understand ur problem. Before I was like to be alone, and i never felt bore but after baby born, I realized that we have to speak with all.( what to do society taught to us).
U said iam running my website with some people means, u have an office or they are doing as WAH.
And u really worked hard, so u now u become so rich. Hope all your dream comes true.
BINDU says
it’s really nice to know that we both think alike. and I don’t avoid the neighbors. I love them. I just try to avoid unnecessary conversations. i’m not running my websites with some people. I’m running them alone without any help. that’s why I have to work a lot for them. I hope that day would come soon. so I can hire few people and reduce my work burden.
P.Tejasvey says
Hiii madam , an inspiring story learned lot of things from you thanking you for giving such a valuable suggestion. First time seeing you blog and I have watched your YouTube videos …. Truly became a big fan of you
BINDU says
HI andi Thank you so much 🙂
Manasa says
Hello Bindu,
Nenu e roju me blog lo me gurunchi chadivanu, It is so inspiring.
Thanks
Manasa
BINDU says
HI Manasa garu…Thank you for visiting my Blog 🙂
Bindhu pothina says
Hi bindhu garu b like bindhu lo chala videos chusanu..chala chala nachay me neatness me home tour kitchen ke pitche fan nenu.eroju me maatamanti.com chusanu
..I’m very very very happy
Anusha dasineni says
Book review chadivena tarawatha .me grunchi chadivenu sister.what a inspiration you are ,just kudos to your work.ma akka ki 19 years lo marriage ayyindhi ,thanu graduate kani int lo ne undavalisi vachindhi thanki me grunchi cheppanu nenu.
BINDU says
Thank you so much, dear… I was 21 years old when I was married….nijamgaa appudu naaku kuda assalu emi telidu…I struggled a lot.
R Bhavya Sri says
Hello Bindu garu ,……Me life lo ippativaraku jarigina sanghatanalu, me anubhavalu ,me istalu,ayistalu ,me aasayalu, mukhyamga me jeevanasaili gurinchi intha takkuva matallo chala ardhavanthamga vrasaru.
Naku edaina vishayam telekapoyina ,ardhamkakapoyina youtube and google lo search chesi telsukuntanu. Valla nunchi prathi sari edaina nerchukunnappudu kruthagnathaga atleast manchi comment ayna pettali anpistundi.
Kani enduko teledu kani nenu social media lo introvert la vyavaharisthanu .Nacchina videos or articles meda oka positive comment pettatalanna kuda chala bhayam.Reason teledu
Kani me blog chadivina tarvata mimmalni elagaina abhinandhinchalani na dhairyamantha koodadheesukuni ee comment pedtunna.
Enni kastalu vacchina ,evaru helana chesina, mana manasuki nacchina Pani ni cheyali danni sadinchali annadi me nundi eroju nenu nerchukunnanu.Tq so much.
Naku ma mother ante chala istam.She encourages me a lot. Naku nameeda unna nammakam kanna ma mother ke na meeda nammakam ekkuva. Ma mother kuda melane chala positive ga untaru.
Naku kuda phone call ante bhayam. Evarikanna call chesi matladalanna or call lift cheyyali annakuda chala bhayamestadi(otherthan my parents and husband).
All the best dear Bindu garu. Stay safe and healthy.♥️♥️
BINDU says
Hi Bhavya garu. ayithe meeru kudaa same naaku lane annamaata.. 🙂 :). meeku bhayam unnaa first time naaku comment pettinanduku..andulonu opikaga meeru elaa feel avutunnaro cheppinanduku dhanyavadamulu….Thank you sooooo much dear 🙂
Prasanna says
you and your life style is very inspring, naku teliyadhu andi inni years memalanu ela miss ayano . entha bag cheparo me gurinchi me istalu , ayistalu, bhayalu,asayalu …..very nice andi.
Joshnavi says
Hi Bindu Garu, I just loved everything about you. Naku meru evaro kuda thelidu andi, random ga youtube me farming video suggest cheste nenu ma husband started watching your videos. Honest ga aa farming gurinchi inka telsukundam ani me gurinchi search chesi first thing I did is knowing about you. True meru correct chepparu person grnchi telsukokunda
Edo vaalu blogging chestunaru kada ani blind ga follow avvalem. Your personality is a total inspiration. Honestly Nenu na life lo enta time waste chestunanu, though able enough to learn. While going through your intro aa sudden flash wow !! How badly am I leading my life ana feeling ochindi, hopefully ippdu aina koncham aina budhi techkuni I will start working on myself. Thank you so much. All the best& Good luck andi. I will keep following your videos (I would like know more about farming ela enti anedi and enta investment kavali and all if it is okay with you to share the details)
BINDU says
Hello andi… ippudu meeru elaa anukunnaro “how badly I’m leading my life” ani okappudu nenu kudaa same alane anukuni realize ayyanu andi….that changed my life like anything. Thank you so much for your wishes andi.farming gurinchi kudaa anee detailed gaa cheppadaaniki try chestanu naa videos lo.
Honey says
Mee YouTube channels follow avuta gani, website yeppudu chudledu.
Monnaa ee madya lo, intermittent fasting, balanced food gurinchi raasina vi chusaka
Subscribe cheyyali anukunna.
Early morning mobile use cheykudadu anukunta. But mee videos chustunna yeppudaina Mrng time lo.
Meeroka motivator & mentor. Yendukante Na studies lo 1 yr gap vachindi. Ee time lo meelanti vallu time value Cheppadam ante, meeru nijam ga special naku.
Miru nijam ga Mentor naku.
BINDU says
Thank you so much Rumini garu 🙂
Prasanth says
Hi Bindu, you have created nice blogs and great videos. Keep doing more.
If you like short stories, please read my fiction story.
http://praskypen.blogspot.com/2017/02/blinking-moon.html
Thanks
Prasanth
Usha says
Hi bindhu garu
I’m ur new subscriber.
K. Sujatha says
Hi, sister I am your new YouTube subscriber maximum nannu nenu malli chadivinatlu undi andi Kani nenu matram mee videos kosam and maatamanti wait chestuntanu l like to listen and read your instructions those are helpful for everyone I feel that you are like my own sister but I don’t have sister thank you
BINDU says
HI maa Thank you so much maa nannu nee sister laa bhavistunnanduku 🙂
psv rao says
blog start cheyadam gurinchi vivaramgaa utem rayagalaru
Mythreyei says
Hi Hima Bindu garu… Mee name meeda inka inka ishtam gouravam perigipoyindi.. Meeru polam konadaniki padina srama kashtam antha intha kadu… Life is not a bed of roses ani chala perfect ga explain chesaru…
Ipudu about me chaduvutunapudu madhyalo kallalo baaga neellu tirigayi… Malli na edupu ni kuda mee maatale tudichesayi
Manasantha baaga kadilinchinatu undi me gurinchi chadivaka..
Prathi lady ki meeru chala inspiration chi prathi manasunna manishiki..
Mee self confidence, mee niranthara gnana daaham, mee hard work ive meeku aabharanaalu..
Meeku compliment iche antha danni kadu nenu asalu.. Aaradhistu undadame na vanthu inka
Meeru anukunavanni cheyadaniki inka chilipi ga undadaniki aa bhagavanthudu meeku sampoorna aarogyam ivvalani manaspoorthi ga korukuntuna.
Mee varu, me ammayi entho adrushtavanthulu.
BINDU says
Thank you so much dear Mythreyei garu.. meeru intha abhimanamtho raasina ee comment ki anandam tho naa kallu chemarchayi… mee andari premani pondagaluguthunna naa janma dhanyam… Thank you so much for your wishes andi 🙂
Seetharamesh says
Hi bindhu garu mee polam gurinchi story mottam chadivanandi..nijamga u couple r grate…appude finish ayyinda annattu undi…mee polam ante Naku chala istam…maa husband kuda chupinchanu mee video…maa kids kuda chustharu appudappudu…..mee papa chala lucky….god bless u n ur family
Lalitha says
Hi Bindugaru, oka YouTube video chusi me article chadivi me gurinchi purthiga chadivaka meru chala chala baga nacharu. Me thinking n nadi okkala undatem valana kuda kavachu. Naku kuda Video editing ante pichi. Me next videos or articles lo video editing website blogging gurinchi kuda please cheppandi bindugaru
Bhargavi says
Hi Bindu garu,
Nenu regular ga mi videos chustanu ,chala unique ga anipistayi .Mi videos chudataniki main reason Enti ante memu kuda ma retirement life ni mi lage plan cheyali anukunam appude mi Polam lo ellu video naku kanipinchindi appat nuchi anni videos chudatam modalu petta.konni similarities unnay memu kuda love marriage cheskunam,Inka roju coffee tagutu life gurinchi matladukuntam appudu vachinde e Polam alochana kani memu aite ma sonta urilo me settle avvala ani alochana.Maku pelli ayyi 4 years aindi menu exact ga future lo cheyali anukunnade miru eppdu chestunaru.
Lalitha says
Bindu me gurinchi chaduvutunte na gurinchi nenu okkasari alochinchinattu anipinchindi. Naku kuda Video editing ante chala ishtem. Kani nerchukolekapoyanu. Adobe lo video ela edit cheyalo Meku telsina articles ytvideos suggest cheyandi please
Kavitha says
Hi, Bhindu garu, lost tome i post you one comment,but it is not there in comment box,it’s ok,i will get positive energy while watching your videos,iam a mother of two kids,i am thyroid patient,after my second baby i have gain weight upto 20 kgs more right now iam 82 kgs,my second baby is 5yrs old,i saw your weght loss videos,please suggest me how to loss weight,
Asha says
Hello bindu gaaru
Chala baaga rasaru. I really like you and your YouTube channel.
Meeru chadivina pusthakalani maaku kooda suggest cheyalani korithunnam
Books meedha seperate video cheyandi
Thank you
Padmaja Kolluru says
Bindu, I watched some of your videos really became fan of you. I know you do not like to talk on phone and waste time, but i really want to talk to you personally. I want to become friend of you like prashanti :-).
If you do not mind please share your phone number to my email.
Pavani says
Hi Bindu akka,
I am very impressed after reading this blog. no words akka.
e blog saripotundi mimmalni ardam chesukovadaniki. Love you lot akka. naku oka chance vaste meetho selfie digalani undi.
All the best Bindi akka.
Sankar Murthy says
I am jealous about Sachin that he got a wife with such a wide variety qualities – hard-work, mischievous, kind-at-heart, eager-to-learn AND it seems you provide good tasty food to your family (FOR WHICH I AM NOT LUCKY ENOUGH, so I AM PREPARING MY FOOD ON MY OWN). In a week, 3-4 days I take natural food – moong / chana sprouts, carrots (pieces), beetroots (pieces), pachi kobbari (pieces), pomegranate, badam (soaked), walnuts (soaked), tarbooz & kharbooz seeds (soaked), kishmish (washed), dates {ALL MIXED}. In a week, 3-4 days I take food cooked in ithadi utensils (no cooker, even for pappu kura, pappu etc.). I use sendha namak/salt (no TATA iodised salt).
I dont repent about not getting good food from my wife. I am thinking that it made me self-reliant. My wife cooks food for herself and my daughter (some times it is good / tasty, mostly it is tasteless)
Srini says
I came here to get in touch with the folks that have posted incredible videos on YouTube about farming.
But this comment caught my eye so I’m sorry, I have to respond to this. My mom used to say Bartha ante bharinche vaadu. Apologies for my poor tenglish. No one including your wife is responsible for making good food for you. You seem to be doing everything right, can you try doing all those things you are doing by yourself with your wife and for your kid. Just my 2 cents.
srinivas says
Hi Bindu garu,
Mee videos anni chustunnau .Mee xplanation chala bavuntundi.Mee video lo office table chusanu. chala bavundi.ekkada konnaru and price chepppa galara. plz.
Thanks,
Srinivas
BINDU says
Hello andi…Thank you so much… adhi nenu Ikea lo theesukunnanu andi.. height adjustable option kudaa undi andulo
Geetha says
Hi Bindu garu, one day lo mee you tube videos chala chusanu Nd mee blogs chadivanu. You are really an inspiration to us. Inni thoughts meelo ela vastay andi. Memu manasulo anukuntam kani cheyyalem. But meeru implement chestunnanduku Mee ideas anni chala happy ga undi. Okkasaina meet ayye chance dorikite bagundu anipistondi. Thanks again. Keep up the good work. All the best
chitti says
aka, mi polam ekada vundi, i mean vooru peru, address
purna says
please do the interview with kobbarithota sitaramaiah Garu(00919849292910)Rajahmundry, to get more details that may be useful to you. He is doing organic farming at the age of 87 years alone. Recently Suman TV did an interview with him( available in youtube channel)
Keerthi says
Hi Bindu garu,
I have been watching your youtube channel since some months.. i have not watched all your videos, but watched a few.. i have watched mostly your farming videos since i have intrest in farming..
Today i had watched few of your farming videos and also two of womens day videos..
for soo long, i have been feeling that my character has been changing because of other peoples behaviour in my life and thats what exactly you spoke about and also about good personality devolopment.. after watching those two videos i thought i should change my self and be a better person.. i liked your thoughts and your way of thinking.. i knew you have webpages but never opened them.. but today i felt like i wanted to know more about you and opened this page..
i watch many videos but never written a comment.. but today after watching your videos and after reading about you.. i wanted to change my self before expecting others to change.. i have never taken education seriously except to earn money..
after watching your womens day videos, i felt like i have wasted 30years of my life.. i always want to change my self and become a better person but keep on post poning and blame others.. i never utilised the time i had..
Today, i am feeling that my thoughts should change.. i am wanting to be better person, i want to utilise my time, i want to learn from beggining, starting from basics of 1st class..
Your words are truely inspiring and you have great personality.. i wanted you to know that you are doing great work, you made me to think.. please continue what you are doing.. i wish you all the success and keep on inspiring many more people..
I have written very lengthy comment.. sorry.. i wanted to write more but felt like its too much for now
Rajesh says
such an inspirational journey. thanks for sharing.
krishnaveni kapu says
Hi Bindu garu,
Mee matamanthi chala natchindhi naaku ..
Few months back choosedanni mee YouTube videos .. malla sudden ga endhuko gurthu watchaaru .. yeah mee kitchen tour kosam.. vethika mee channel .. Then I came across this website also … Nice knowing you again in detail.. mee mom lagane maa amma kooda sodi kaburlaki dhooram .. i admire that quality of her .. innaalla life lo maa amma natho vere person gurinchi matlaadatam inthavaraku vinaledhu… Adi ardham kaani fools lyt anukondi … keep up your good work and thanks for inspiring like minded people… Take care …