Schezwan Fried Rice – షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

Schezwan Fried Rice with step by step instructions.English Version.

schezwan fried rice

చక్కటి నోరూరించే చైనీస్ వంటకాలలో షేజ్వాన్ రైస్ కూడా ఒకటి.నిజంగా ఈ వంటకాన్ని చైనీస్ అయినా వండుకుంటారో లేదో తెలీదు కానీ మనవాళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు. కొద్దిగా కారంగా ఉన్నా సరే పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చేసిందే బాగుంటుందనిపిస్తుంది.ఎందుకంటే చైనీస్ వంటకాలను పెద్ద మంట మీద పెట్టి వండుతారు.అలా చేయడం వల్ల పదార్ధానికి చక్కని పొగ వాసన అంటి మంచి రుచిగా మారుతుంది.మనం ఇంట్లో అంత హై ఫ్లేమ్ మీద వండలేము.ఒకవేళ వండాలనుకున్నా ఎక్కడ గిన్నెలు పాడయిపోతాయో అని ఆలోచించాలి.కానీ బయటకి వెళ్లి తినే అవకాశం లేనప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ఈ recipe కి షేజ్వాన్ సాస్ అనేది ముఖ్యమైన పదార్ధం.షేజ్వాన్ సాస్ అన్ని సూపర్ మార్కెట్ లలో చాలా తేలికగా దొరుకుతుంది.ఒకవేళ అది మీ దగ్గరలో అందుబాటులో లేకపోయినా, మీరు ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్న టైం కి అనుకోకుండా అయిపోయినా మీరే స్వయంగా షేజ్వాన్ సాస్ ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

నేను ఈ recipe ని vegetables తో చేశాను.మీరు కావాలంటే కూరగాయలకు బదులుగా గుడ్లు కానీ, ముందే ఉడికించి పెట్టుకున్న బోన్ లెస్ చికెన్ ముక్కలను కానీ వేసి కాసేపు షేజ్వాన్ సాస్ లో  ఫ్రై చేసి తర్వాత అన్నం కూడా వేసి  కలిపి వండుకోవచ్చు.షేజ్వాన్ సాస్ ని మీ రుచి కి తగ్గ మోతాదులో వేసుకోవాలి.ఈ వంటకాన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.ఆరిపోయాక తింటే రుచి అంతగా బాగోదు.ఎంతో రుచికరమైన ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

schezwan fried rice

you may also like

Schezwan Sauce Recipe in Telugu
Chicken Tikka Pulao Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe inTelugu
Mutton Dalcha recipe in Telugu
Onion Murukulu recipe in Telugu
Schezwan Chicken Thighs Recipe in Telugu

Click here for the English Version of the Recipe

Schezwan Fried Rice Recipe
Prep Time
30 mins
Cook Time
15 mins
Total Time
45 mins
 
Course: Main Course
Cuisine: Chinese
Author: బిందు
Ingredients
  • 1 1/2 కప్ ఉడికించిన అన్నం
  • 1 tbsp వెల్లుల్లి సన్నగా తురిమినది
  • 1 tbsp అల్లం సన్నగా తురిమినది
  • ½ కప్పు క్యాబేజీ తురుము
  • 1 క్యారట్ తురుము
  • 1/3 కప్పు ఉల్లి కాడ మొదలు తురుము
  • ¼ కప్పు కొత్తిమీర
  • 4 లేదా 5 tbsp షేజ్వాన్ సాస్
  • 1 tbsp వెనిగర్
  • ½ tsp సోయా సాస్
  • ¼ tsp మిరియాల పొడి
  • ఉప్పు తగినంత
  • 3 tbsp నూనె
Instructions
  1. ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడి చేసి అందులో అల్లం మరియు వెల్లుల్లి తురుము వేసి ఒక నిమిషం వేయించాలి.
  2. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాబేజీ తురుము, క్యారట్ తురుము వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  3. ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, షేజ్వాన్ సాస్ వేసి ఒకసారి కలపాలి.
  4. తర్వాత ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలపాలి.
  5. స్టవ్ ని హై ఫ్లేమ్ లోకి తిప్పి అన్నాన్ని కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.
  6. ఉల్లి కాడల తురుము, కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.

Schezwan Fried Rice Video

[embedyt] https://www.youtube.com/watch?v=yz63KDn4EoA[/embedyt]

 

About Author

బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




error: Content is protected !!