Paanakam Recipe-బెల్లం పానకం తయారీ విధానం ఎలా

Paanakam Recipe with step by step instructions.English Version.

paanakam recipe

బెల్లం పానకం చాలా ఆరోగ్యకరమైన వేసవి పానీయం.కూల్ డ్రింక్ లు అవీ ఇవీ తాగే బదులు చక్కగా పానకం గానీ, మజ్జిగ గానీ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే కావాల్సినపుడల్లా తీసుకొని ఎంచక్కా తాగేయొచ్చు .రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.పానకాన్ని సాధారణంగా శ్రీరామ నవమి రోజున వడపప్పు తో  పాటు నైవేద్యంగా సమర్పించి తరువాత తీసుకుంటారు.కానీ దీన్ని నవమి రోజునే చేసుకొని తాగాలని కాదు ఎప్పుడైనా చేసుకొని తాగినా మంచిదే.పానకానికి శరీర ఉష్ణోగ్రతను సంతులనం చేసే శక్తి ఉంది.

నా చిన్నప్పుడు నవమి రోజున పానకాన్ని మా నాన్న తయారు చేసేవారు.అది ఎంతో రుచిగా ఉండేది.ఆయనకి ఆమ్లెట్, పానకం చేయడం మాత్రమే వచ్చు.కానీ రెండూ బాగా చేసేవారు.పానకంలో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే బాగుంటుంది.నాలుగు తులసి ఆకులు గానీ, పుదినా ఆకులు గానీ వేసుకుంటే మరీ మంచిది.అదే పానకంలో ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ వేసి కుల్ఫీ మౌల్ద్ లో పోసి ఫ్రిజ్ లో గడ్డ కట్టేవరకు ఉంచి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు.కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ వేసిన ఐస్ లు కొనివ్వడం కన్నా ఇలా చేస్తే మంచిది.మీరు కూడా ఈ పానకాన్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
paanakam recipe

paanakam recipe

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Ulavacharu Recipe in Telugu
Andhra Mango Pickle in Telugu
Pandumirapakaya pachadi in Telugu
Chamagadda Pulusu in Telugu
Onion Murukulu in Telugu

Click here for the English version of the Recipe.

Jaggery & Lemon Juice - బెల్లం పానకం
Prep Time
15 mins
 
Course: Drinks
Cuisine: Andhra, Indian
Servings: 4
Author: బిందు
Ingredients
  • 150 గ్రాములు బెల్లం
  • 1 లీటరు నీళ్ళు
  • 1 tsp యాలుకల పొడి
  • 1 tsp మిరియాల పొడి
  • ½ tsp శొంఠి పొడి
  • ½ సోంపు పొడి
  • 1 నిమ్మకాయ
  • 10 ఐస్ క్యూబ్స్
Instructions
  1. ఒక గిన్నెలో తురిమిన బెల్లం తీసుకోవాలి.
  2. అందులో నీళ్ళు పోసి కరిగేవరకు కలపాలి.
  3. తర్వాత యాలుకల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, సోంపు పొడి, నిమ్మ రసం వేసి కలపాలి.
  4. కలిపిన నీటిని వేరే గిన్నెలోకి వడకట్టాలి.
  5. ఫ్రిజ్ లో కాసేపు ఉంచి చల్లబడ్డాక తాగితే చాలా రుచిగా ఉంటుంది లేదా ఐస్ ముక్కలు వేసి అప్పటికప్పుడు తాగవచ్చు.

paanakam recipe

Paanakam Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=m-1oJn4n_Ts[/embedyt]

 

About Author

బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




error: Content is protected !!