Malai Laddu Telugu Recipe-పనీర్ మలై లడ్డూ తయారీ

Malai Laddu Telugu Recipe with step by step instructions.English Version.

Malai Laddu Telugu Recipe

ఇది చాలా తేలికగా చేసుకో గలిగిన స్వీట్.కొత్తగా వంట మొదలు పెట్టిన వారు కూడా చాలా తేలికగా చేసేయొచ్చు.ఎవరైనా అనుకోని అతిధులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ చేసి పెట్ట వచ్చు.ఒక వేళ స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ లేకపోతే ఫుల్ ఫాట్ మిల్క్ ను సగం అయ్యే వరకు మరిగించి అందులో పంచాదార మరియు గ్రైండ్ చేసిన పనీర్ వేసి కలకండ లా గట్టిగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి.ఎక్స్ట్రా టేస్ట్ కొరకు కాస్త పాల పొడి కూడా వేయవచ్చు.నోరూరించే ఈ స్వీట్ ను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

Malai Laddu Telugu Recipe

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Dry Fruit Bobbatlu Recipe in Telugu
Dry Fruit Laddu Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu

Click here for the English version of this recipe

Malai Laddu Telugu Recipe
Prep Time
10 mins
Cook Time
20 mins
Total Time
30 mins
 
Course: Dessert
Cuisine: Indian
Author: బిందు
Ingredients
  • 200 గ్రాములు పనీర్
  • ½ కప్పు స్వీట్ కండెన్స్ డ్ మిల్క్
  • 2 tbsp నట్స్ తరుగు
  • ¼ tsp ఏలకుల పొడి
  • 1 tbsp నెయ్యి
Instructions
  1. పనీర్ ను గ్రైండర్ లో వేసి మెత్తగా పొడిలా అయ్యే వరకు తిప్పాలి.
  2. పెనంలో పనీర్ వేసి అందులో స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ కూడా వేసి బాగా కలపాలి.
  3. అందులో నెయ్యి, ఏలకుల పొడి వేసి మళ్ళీ కలపాలి.
  4. తర్వాత ఆ మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి.
  5. ఒక్క సారి కలకండ లా అవగానే పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
  6. ఒక 5 నిమిషాలు ఆరాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని నిమ్మకాయ పరిమాణంలో మిశ్రమాన్ని తీసుకొని గుండ్రంగా ఉండల్లా చేసి పైన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ల తరుగు లతో అందంగా గార్నిష్ చేయాలి.

Malai Laddu Telugu Recipe

Malai Laddu Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=5p9ctx-3wUY[/embedyt]

 

About Author

బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




error: Content is protected !!