• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Maatamanti

  • Home
  • Kaburlu
  • Stories
  • Cinema
  • Recipes
  • Health&Fitness
  • Beauty&Fashion
  • Relationships
  • Blogging
  • About Me
  • Home&Garden

కీటో డైట్ ఛార్ట్ తెలుగులో – Keto Diet Chart in Telugu

August 14, 2019 By బిందు 6 Comments

కీటో డైట్ ఛార్ట్ ఇవ్వమని నా యూట్యూబ్ స్నేహితులు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఈమెయిల్ చేశాను. కానీ పోను పోను అడిగే వారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల అందరికి పర్సనల్ గా మెయిల్ పెట్టలేకపోతున్నాను. అందుకే……. గా  సిలబస్ ఏదో  గీడ  ఖతం చేస్తే అయిపోతది కదా అనుకుంటున్నా 😉😜. పక్కన వాక్యం అస్సలు అర్ధం కాలేదా ఎక్కువ ఆలోచించకండి.. రాసేటప్పుడు మధ్యలో బోర్ అనిపిస్తే అలా అర్ధం పర్ధం లేకుండా రాస్తుంటా….. మీరు అస్సలు పట్టించుకోవద్దు సరేనా… 😉😜

కీటో డైట్ చార్ట్ తీసుకునే ముందు అసలు కీటో డైట్ లో తీసుకోదగిన పదార్ధాలు , తీసుకోకూడని పదార్ధాలు ఏంటో  కూడా తెలుసుకోవాలి కదా!.  అందుకే క్రింద ఓ గీత గీసిన కద గా లింక్ ను జర క్లిక్ చేస్తే గా ముచ్చటేందో తెలుసుకోవచ్చు.

ఇప్పటి దాకా కుంభాలు కుంభాలు తిని ఉంటాము కదా ఒక్కసారే ఫుడ్ తగ్గించాలంటే కాస్త కష్టం. అందుకే ముందు 3 meal per డే తో స్టార్ట్ చేస్తే బెటర్. 3 రోజులు అవ్వగానే సగం జీవితం సంక నాకినట్లనిపిస్తుంది. వీకెండ్ లో తినే వాటిని వీకంతా తినాల్సి వస్తే  వీక్ గా అనిపిస్తుంది. కొద్దిగా లైట్ గా విరక్తి 😔😔కూడా వస్తుంది. ఎందుకిలా అనిపిస్తుందా అని బాగా ఆలోచిస్తూ 🤔🤔 2 meal కి జారిపోతారు ఆ తర్వాత రెండు రోజులకు అసలేమీ ఆలోచించకుండానే 1 meal కి దిగజారిపోతారు 😆😆😆. అప్పుడు ……..అనుకోకుండా ఒక రోజు  ఓ 2 కేజీలు తగ్గుతారు. రెండు నంబర్లు తగ్గగానే మళ్ళీ జీవితం పైన ఆశలు చిగురించి🌿 ఒక్క రోజులోనే  పెద్ద పెద్ద చెట్లవుతాయి 🌳. ఆ శభాష్!ఏం పర్లేదు మళ్ళీ కుమ్మేద్దాం అనుకుంటారు. 3 meal తింటారు .కానీ రెండు రోజులకే  పెరిగిన మీటర్ రీడింగ్ చూసి గాబరా పడి పోతారు. తర్వాత మళ్ళీ 2 meal  ఆ తర్వాత 1 meal. దీనినే జీవిత చక్రం అంటారు. ఈ చక్రాన్ని అర్ధం చేసుకున్నవారే …….గుండ్రంగా చక్రం లా కాకుండా సన్నగా కర్రలా మారతారు. ఇదే ఈ బిందానంద స్వామిజీ ప్రబోధ 😜😜  అబ్బా! ఏమీ అర్ధం కాలేదు కదా … కింద దీని తాత్పర్యం ఉంది చదవండి.

ఏమీ లేదండి చాలా సింపుల్

మొదటి 1 weak 3 meal per డే చేయండి.

వారం తర్వాత  మెల్లిగా 2 meal కి తగ్గించండి. ఓ 3 రోజులు 2 meal పాటించండి.

4 వ రోజు 1 meal కి తగ్గించండి. ఇలా ఓ 2 రోజులు పాటించండి.

తర్వాత రెండు రోజులు liquid డైట్ పాటించండి.

రెండు రోజుల లిక్విడ్ డైట్ తర్వాత మళ్ళీ 1 meal 2 రోజులు తీసుకోండి.(సడన్ గా 3 meal తీసుకోకండి).

ఆ తర్వాత 2 డేస్ 2 meal చేయండి.  మళ్ళీ 1 meal then లిక్విడ్ డైట్.

ఇలా తగ్గిస్తూ, మానేస్తూ, పెంచుతూ మళ్ళీ  తగ్గిస్తూ, మానేస్తూ, పెంచుతూ ఉండాలి.

నేను పైన చెప్పిన చక్రానికి అర్ధం ఇదే. ఇంతకూ మీకు అర్ధం అయినట్లా? కానట్లా ? ఏదో ఒకటి చెప్పండి. సర్లే, దీన్నే ఇంకాస్త simplify చేసి కింద ఒక పట్టిక రూపంలో ఇస్తాను చూడండి.

3 meal per డే diet (for Non-vegetarians)

ఉదయం బ్రష్ చేసుకోగానే  తీసుకోదగినవి

  1. 2 tsp ల ఆపిల్ సైడర్ వెనిగర్ గ్లాస్ నీటితో కలిపి తాగాలి.
  2. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండుకుని తాగాలి.
  3. చేయగలిగితే 1 లీటర్ వెచ్చని నీటిని కూర్చుని మెల్లిగా తాగేయాలి.

పైన చెప్పిన మూడింటిలో ఏదో ఒకటి మాత్రం తప్పక పాటించాలి.

తర్వాత అరగంటకు

  1. ఒక కప్పు బ్లాక్ కాఫీ కానీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ, క్రీమ్ కాఫీ కానీ తీసుకోవచ్చు. తీపి లేకుండా తాగలేకపోతే అమెజాన్ లో keto sweetener ఆర్డర్ చేసి తెప్పించుకోండి. Ketofy బ్రాండ్ అయితే బెటర్.
  2. ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

ఇవన్నీ ఖచ్చితంగా తాగాలని రూలేమీ లేదు అలవాటు ఉంటేనే. కానీ గ్రీన్ టీ లో యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి తీసుకుంటే చాలా మంచిది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకుంటే ఎంత బటర్ వేసుకున్నారో లెక్క చూసుకోండి. దాన్ని ఒక రోజు తీసుకోవాల్సిన మొత్తం ఫ్యాట్ లో నుండి తీసేసి ఇక మిగిలిన మీల్స్ లో మిగిలినది adjust చేసుకోవాలి.

ఇక తర్వాత మీ ఫస్ట్ meal లేదా breakfast తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కుదిరితే కాఫీ టైమ్ కి 1st meal కి మధ్య ఉన్న గ్యాప్ లో ఒక అరగంట లైట్ excercises చేయండి. లేకపోతే మెల్లగా నడవండి కాసేపు.

తర్వాత మొదటి meal తీసుకోండి. మొదటి meal లో తీసుకోదగిన ఆహారాలు.(ఉదయం 8 గంటకు మంచిది)

  1. 2 లేదా 3 ఉడికించిన గుడ్లు. లేదా scrambled ఎగ్స్ తినవచ్చు. ఒకవేళ మీరు 90 grams per డే fat తీసుకుంటున్నట్లయితే 30 grams  బటర్ గానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ వేసుకుని చేసుకోవాలి. ఉడికించిన గుడ్లయితే నూనెలో వేయించుకోవచ్చు. లేదా ఇంట్లో తయారు చేసిన మాయోన్నిస్ 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన గుడ్ల మీద పెట్టుకుని తినవచ్చు. 2 tbsp mayonnaise = సుమారు 30 గ్రాములు. అందువల్ల మీరు ఏదైనా ఒక meal లో 2 tbsp ల మాయోన్నిస్ పెట్టుకుంటే దాదాపు ఒక meal  కి కావాల్సిన ఫ్యాట్  వచ్చేసినట్లే.
  2. 1 cup veg సలాడ్ కూడా తీసుకోవాలి.

ఒకవేళ మీరు 2 meal  చేస్తున్నారు అనుకోండి దీన్నే మీ ఫస్ట్ మీల్ గా తీసుకోవచ్చు. 1st  మీల్ అయిన వెంటనే multi విటమిన్ టాబ్లెట్ వేసుకోండి.

రెండవ meal  లో తీసుకోదగిన ఆహారం(మధ్యాహ్నం 1 గంటకు తింటే బెటర్)

మీకు ఈ మీల్ లో సుమారుగా 30 గ్రాముల ప్రోటీన్, 30 గ్రాముల కొవ్వు అవసరం ఉంటుంది.

ఇప్పుడు ఈ మీల్ లో మీకు 30 గ్రాముల ప్రోటీన్ అందాలి అంటే

      1. 100-150 గ్రాములు గ్రిల్ల్డ్ చికెన్ కానీ చికెన్ తందూరీ కానీ, మటన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, prawns ఫ్రై కానీ తీసుకోవాలి.
      2. చికెన్ అయితే 100 గ్రాములు తీసుకుంటే చాలు.
      3. మటన్ అయితే 120 గ్రాములు చాలు.
      4. ఫిష్ అయితే 150 గ్రాములు తినాలి.
      5. రొయ్యలు అయితే 120 గ్రాములు సరిపోతుంది.
      6. ఆ సమయానికి చికెన్, మటన్ లాంటివేమీ ఇంట్లో లేకపోతే 1st meal లో తిన్నట్లుగానే ఎగ్స్ తీసుకోవచ్చు. 30 గ్రాముల ప్రోటీన్ కోసం మీరు 3-4 eggs తీసుకోవాల్సి ఉంటుంది.
      7. లేదా పనీర్ 100 గ్రాములు తీసుకోవచ్చు. కానీ 50 గ్రాములకన్నా ఎక్కువ తినలేము. అసలు కొద్దిగా తినేసరికే కడుపు నిండిపోయి నట్లు అనిపిస్తుంది. 50 గ్రాముల లో తగినంత ప్రోటీన్ లభించదు. అందుకే ఛీజ్ కూడా వేసుకుని తినాలి. 100 గ్రాముల చీజ్ లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

      ఇప్పుడు ప్రోటీన్ ఎంత తీసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలిసింది కదా.

ఇక 1 మీల్ కి 30 గ్రాముల ఫ్యాట్ అందాలి అంటే

కొబ్బరి నూనె ఎంత తాగాలి అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఇది V R K డైట్ కాదు. keto diet. ఏదో ఒకటి మాత్రమే పాటించండి. 10 రకాల వీడియోలు చూసి 15 రకాల ప్రయోగాలు చేయొద్దు.

      1. ఆలివ్ ఆయిల్ అయితే మీరు 30 గ్రాములు తీసుకుంటే 30 గ్రాములు కొవ్వు అందుతుంది.
      2. edible కోకోనట్ ఆయిల్ 30 గ్రాములు తీసుకుంటే 30 గ్రాములు కొవ్వు అందుతుంది.
      3. బట్టర్/వెన్న 2 1/2 tbsp లేదా 35 గ్రాములు తీసుకుంటే 30 గ్రాములు అందుతుంది.
      4. నెయ్యి 35 గ్రాములు తీసుకుంటే 30 గ్రాములు ఫ్యాట్ అందుతుంది.
      5. mayonnaise 40 గ్రాములు తీసుకుంటే 30 గ్రాములు అందుతుంది.
      6. 100 గ్రాములు avocado తీసుకుంటే 15 గ్రాములు ఫ్యాట్ ఉంటుంది.

      ఇప్పుడు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? కొవ్వు ఎంత తీసుకోవాలి తెలిసింది కదా. ఈ రెండింటి తో పాటు ఆహారంలో dietary fiber ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. పైన ఇచ్చిన ఆహారాలన్నింటిలో చూస్తే ఒక్క avocado లో తప్ప ఇంక దేనిలోనూ పీచు పదార్ధం/dietary fiber ఉండదు. పీచు పదార్ధం తీసుకోక పోవడం వల్ల మలబద్దకం/constipation తో ఇబ్బంది పడతారు. అందుకే ఆహారంలో పీచు పదార్ధం ఉండేలా చూసుకోవాలి.

రోజు మొత్తంలో 25 నుండి 30 గ్రాములు ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అంటే 1 మీల్ లో సుమారు 10 గ్రాములన్నా dietary ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.అలా ఉండాలి అంటే మీరు ఒక మీల్ కి 3 నుండి 4 కప్పుల వెజిటేబుల్ సలాడ్ తినాల్సి ఉంటుంది. చికెన్ మటన్ లాంటివి తినమంటే తింటారు కానీ అన్ని కప్పుల కూరగాయలు తినమంటే మాత్రం గొంతు మింగుడు పడదు. కదా …. ?  అప్పుడేం చెయ్యాలంటే. వెజ్ సలాడ్ ఒక మీల్ కి 4 కప్పుల బదులు  2 కప్పులు తీసుకోండి. chia seeds మీకు తెలిసే ఉంటుంది. 28 గ్రాముల chia seeds లో 10 గ్రాముల పీచు పదార్ధం ఉంటుంది. ఒక 5 గ్రాములు ఎటూ కూరగాయల నుండి వస్తుంది కాబట్టి మిగిలిన 5 గ్రాములు కోసం 15 గ్రాములు చియా సీడ్స్ ను నీళ్లలో నానబెట్టుకుని ఆ నీళ్లు తాగితే సరిపోతుంది.

పచ్చి కూరగాయలతో సలాడ్ తినలేక వండిన కూరలు తినాలనుకుంటారు. కూరగాయలను వండితే సగం పోషకాలు పోతాయి. ఫైబర్ కూడా నశిస్తుంది. అందుకే నా సలహా అయితే ఇక ఈ డైట్ పాటించినన్ని రోజులు మన మామూలు  కూరలు మర్చిపోతే మంచిది. బ్రోకలీ, కాలీఫ్లవర్ లాంటివి మాత్రం వండుకుని తినాలి. ఉల్లిపాయ, టమాటో ఎంత తక్కువ తింటే అంత మంచిది. దొండకాయ, బెండకాయ, గోరు చిక్కుడు, ముల్లంగి లాంటివి మాత్రం పచ్చిగా తినలేరు కాబట్టి కాస్త వేయించుకుని తినవచ్చు.

ఇప్పటికి మీకు ఏమేమి తినాలో ఎలా తినాలో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పైన చెప్పిన పదార్ధాలన్నింటిలో స్థూల పోషకాలు అంటే macro  nutrients ఎక్కువగా ఉన్నాయి.  micro nutrients అంటే సూక్ష్మ పోషకాలు కూడా కొద్ది కొద్దిగా  ఉంటాయి. ఒక్క పొటాషియం తప్ప మిగిలినవన్నీ దాదాపు సగం అందినట్లే. మరి మిగిలిన micro nutrients కోసం ఏమి చేయాలి. నేను చేసిన keto కారం పొడి 2 tbsp లు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంకా ఇవి కాకుండా 2 tbsp లు pumpkin seeds కానీ, 7 నుండి 10 walnuts కానీ తినవచ్చు, గోధుమ గడ్డి రసం లాంటివి తీసుకుంటే సరిపోతుంది.

3 వ మీల్ కూడా 2nd మీల్ లానే చేయండి. ఇప్పుడు 3 మీల్ per ఎలా చేయాలో తెలిసింది కదా.

2 meal per డే diet ఎలా చేయాలో చూద్దాం.

పైన చెప్పిన 3 మీల్ లో లాగానే ఉదయం నిమ్మరసం, ఆపిల్ సిడర్ వినేగార్ లాంటివి same.

తర్వాత 8 గంటలకు తీసుకోవాలి అని చెప్పిన 1st మీల్ ను ( ఆహారం కూడా అలానే ) మీరు ఇక్కడ సుమారు 10.30 లేదా 11 గంటల సమయంలో తీసుకోవాలి.

మొదటి మీల్ లో ఫ్యాట్ 35 గ్రాములు తీసుకోండి.

ప్రోటీన్ 35 గ్రాములు ఉండేలా చూసుకోండి

దీనికోసం చికెన్ అయితే 120g , మటన్  అయితే 150g , ఫిష్ అయితే 175 g, prawns అయితే 150g , గుడ్లయితే 4, పనీర్ అయితే 50 g తీసుకోవాలి.

ఇక 2 వ మీల్ ను పైన చెప్పిన 2nd మీల్ లాగానే తీసుకోవాలి అది కూడా సాయంత్రం 6.30 నుండి 7 గంటల లోపు.

రెండవ మీల్ లో కూడా పైన మొదటి మీల్ లో చెప్పినట్లుగానే తీసుకోవాలి.

ఇక ఆ తర్వాత ఏమి తినకూడదు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 10.30 వరకు ఏమి తినకూడదు.

అంటే ఇది Keto + IF అన్నమాట. ఇలా పాటిస్తేనే త్వరగా తగ్గుతారు.

1 meal per డే diet ఎలా చేయాలి ?

పైన చెప్పిన 3 మీల్ లో లాగానే ఉదయం నిమ్మరసం, ఆపిల్ సిడర్ వినేగార్ లాంటివి బ్రష్ చేసుకోగానే same అలానే చేయాలి.

తర్వాత అరగంటకు కాఫీ టీ అలవాటు ఉన్నవారు పైన నేను చెప్పినట్లుగా బ్లాక్ కాఫీ కానీ టీ గ్రీన్ టీ కానీ తీసుకోవచ్చు.

మీరు చేసేది రోజు మొత్తం లో ఒకటే మీల్ కాబట్టి తినే టైమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు బాగా ఆక్టివ్ గా ఉండే hours లో తీసుకుంటే మంచిది. అంటే సుమారు మధ్యాహ్నం 1.30 నుండి 2 గంటల లోపు. నేను పైన 3 మీల్/డే  లో చెప్పిన 2 వ మీల్ ని తీసుకోవాలి.

ఈ 1 మీల్ లో ఫ్యాట్ 40 నుండి 45 గ్రాములు ఉండేలా చూసుకోవాలి.

ప్రోటీన్ అయితే 65 గ్రాములు తీసుకోవాలి.దీని కోసం మీరు చికెన్ అయితే 200 g , మటన్ అయితే 240g , ఫిష్ అయితే 250 నుండి 300g, ప్రాన్స్ అయితే 240g, పనీర్ అయితే 75 g తీసుకోవాలి ఆ ఒక్క మీల్ లో. లేదా 4-5 ఉడికించిన ఎగ్స్ కూడా తినొచ్చు. వాటి మీద తగినంత ఇంట్లో తయారు చేసుకున్న మాయోన్నిస్ వేసుకుని తింటే సరిపోతుంది.

ఇక ఫైబర్ కోసం 2 కప్పులు వెజ్ సలాడ్ తీసుకోవాలి.

ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం లెమన్ జ్యూస్ తో లేదా ACV తో మీ డే ని స్టార్ట్ చేయాలి.

ఒకవేళ మీకు రాత్రి సమయంలో ఆకలి అనిపించింది అనుకోండి పల్చటి నీళ్ల లాంటి మజ్జిగ తీసుకోవచ్చు. ఒక కీర దోసకాయ తినవచ్చు. వీటిలో calories దాదాపు చాలా negligible గా ఉంటాయి. carbs ఇంకా ప్రోటీన్ కూడా ఆల్మోస్ట్ నిల్.ఫ్యాట్  అసలు ఉండదు. సో మన బాడీ వీటిని అరిగించటానికి పెద్ద కష్టపడనవసరం లేదు. అసలివి దాదాపు నీళ్లతో సమానం. కీరా లో కొద్దిగా విటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల మీకు రాత్రి సమయంలో ఆకలి అనిపిస్తే ఒక కీర దోసకాయ తినవచ్చు ఇంకా ఒక గ్లాస్ పల్చటి నీళ్లలాంటి మజ్జిగ తీసుకోవచ్చు. ఆ మజ్జిగలో కొద్దిగా అంటే  1 tbsp chia seeds కూడా వేసుకోవచ్చు.

ఇప్పుడు 3 మీల్ లో ఏమి తినాలి, 2 మీల్ అయితే ఎలా adjust చేసుకోవాలి, 1 మీల్ అయితే ఎలా తినాలి తెలిసింది కదా. పైన నేను చెప్పిన ఆహారమే కాకుండా మీకు బోర్ అనిపించినప్పుడు కొద్దిగా వేరే ఫుడ్ ట్రై చేయవచ్చు. అమెజాన్ లో ketofy బ్రాండ్ keto flour దొరుకుతుంది. ఆ కీటో పిండి ఒక పావు కప్పు తీసుకుని అందులో కొద్దిగా కీటో  sweetener, రెండు గుడ్లు వేసుకుని బాగా కలిపి పాన్ కేక్స్ లాంటివి చేసుకోవచ్చు.

ఇక ఉల్లిపాయలు ఎంత కుదిరితే అంత తక్కువ వాడండి. కొంతమంది కూరలు ఏమి వండుకోవాలి. ఎలా వండుకోవాలి అని అడుగుతున్నారు. బట్ నన్నడిగితే అసలు మన మామూలు కూరలు కొన్ని రోజులు మర్చిపోతే మంచిది. అందులో మళ్ళీ ఉల్లిపాయలు లాంటివి వేసుకోవాల్సి వస్తుంది. దాని బదులు వెజ్ సలాడ్ చేసుకోవడమే మంచిది. cauliflower, బ్రోకలీ, గోరు చిక్కుడు లాంటివైతే కొద్దిగా నీళ్లలో ఉడికించి ఉల్లిపాయల్లాంటివి లేకుండా నూనెలో వేయించుకుని పైన కొద్దిగా చీజ్ వేసుకుని తింటే సరిపోతుంది. ఇందాక నేను చెప్పిన కీటో  ఫ్లోర్ లో కొద్దిగా coconut ఫ్లోర్ (కొబ్బరి పిండి ఇది కూడా అమెజాన్ లో దొరుకుతుంది), బటర్, గుడ్లు, పీనట్ బట్టర్(హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ ఇంకా షుగర్ లేనిది ) వేసుకుని చపాతీ పిండిలా కలిపి కుకీస్ కూడా చేసుకోవచ్చు.

నేను ఇందులో మొత్తం అర్ధం అయేలా  చెప్పను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా తర్వాత ఏమైనా గుర్తుకు వస్తే మళ్ళీ యాడ్ చేస్తాను. ఇప్పటికైతే ఈ పోస్ట్ ని ఒకటికి రెండు సార్లు బాగా చదివి అర్ధం చేసుకుని డైట్ ప్లాన్ చేసుకోండి.

Disclaimer : పైన ఇవ్వబడిన వ్యాసం కేవలం నా వ్యక్తిగత అనుభవం నుండి నేను తెలుసుకున్న విషయాలనుండి సేకరించినవి. వేరొకరి తో పోల్చినప్పుడు కొద్దిగా బేధం కనిపించ వచ్చు. ఏ డైట్ అయినా మరీ ఖచ్చితత్వంతో చెప్పడం చాలా కష్టం. పైగా అందరికీ అన్ని డైట్ లు ఒకేలా పనిచేయక పోవచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కిడ్నీ సమస్యలు, గాల్ bladder  వంటి సమస్యలతో బాధ పడేవారు దయచేసి ఈ డైట్ ను పాటించకండి. ఏ డైట్ అయినా పాటించే ముందు దయచేసి డాక్టర్ సలహా తప్పక తీసుకోవాలి. ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వైద్యానికి సంబంధించిన సలహా మాత్రం కాదు.

Filed Under: Health&Fitness, Ketogenic Diet, Weight Management

About బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Previous Post: « కీటో డైట్ ను ఎలా ప్రారంభించాలి?How to start Keto Diet?
Next Post: About Intermittent Fasting Telugu-ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? »

Reader Interactions

Click on the Image to Know about me

Comments

  1. prasanth says

    October 1, 2019 at 12:09 pm

    Thank you Bindu gaaru for the information on blogs and youtube channels. My question is..

    How to clean vegetables as they are sprayed with pesticides? should i clean with any salt before eating then in salads?

    Please clarify, thank you.

    Reply
  2. Chaturya says

    May 19, 2020 at 12:16 pm

    Meat measurement before cooking or after cooking?

    Reply
    • BINDU says

      May 20, 2020 at 8:22 am

      weigh it after cooker and take

      Reply
      • Nani says

        November 3, 2021 at 3:54 am

        Mam suger kito diet plan annapurneswararaod@gmail.com

        Reply
  3. Swathi says

    September 3, 2020 at 1:36 am

    Thank you, this is very helpful. what can I take during Liquid diet ?

    Reply
  4. SANKAR MURTHY says

    April 9, 2021 at 10:04 am

    KETO DIET IS A DANGEROUS DIET, MADAM. DUE TO THIS,RECENTLY MISHTI MUKHERJEE, A BENGALI ACTRESS DIED AT VERY YOUNG AGE. AS AN ACTRESS, SHE MAY BE HAVING SOME MEDICAL HELP ETC. EVEN THEN SHE DIED.

    I THINK IT IS NOT ADVISABLE TO ANY.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




Primary Sidebar

Categories

  • Beauty&Fashion (2)
    • Skin (1)
  • Blogging (2)
  • Cinema (4)
    • telugu movie reviews (3)
  • Farming (2)
  • Health&Fitness (16)
    • Weight Management (12)
      • Ketogenic Diet (2)
  • Home&Garden (4)
    • cookware (1)
    • Household Product Reviews (1)
    • Kitchen Gadgets (1)
  • Kaburlu (12)
  • Kids Recipes (5)
  • Kitchen (1)
  • lip care (1)
  • Millet Recipes (1)
  • Recipes (106)
    • Bakes (2)
    • Biryanis (7)
    • Breakfast Recipes (12)
      • Bonda Recipes (1)
      • Breakfast Chutneys (1)
      • Dosa Recipes (1)
      • Poori Recipes (2)
    • Chicken Recipes (19)
    • Chinese Food (1)
    • Chutneys (3)
    • Drinks (3)
    • Egg Recipes (4)
    • Festival Recipes (9)
      • Sankranthi Recipes (1)
      • Varalakshmi Vratham Recipes (5)
    • Fish Recipes (3)
    • Fry Recipes (4)
    • Healthy Recipes (4)
    • Masala&Spice Powders (3)
    • Mushroom Recipes (2)
    • Mutton Recipes (2)
    • Paneer Recipes (5)
    • Pickles (5)
    • Prawns Recipes (3)
    • Rice Recipes (13)
      • Non Veg Rice Recipes (3)
      • Veg Rice Recipes (2)
    • Sambar&Rasam (3)
    • Snacks&Appetizers (19)
    • Soups (1)
    • Starters (1)
    • Street Food (8)
    • Sweets&Desserts (15)
    • Vada Recipes (3)
    • Veg curries (9)
  • Relationships (1)
    • Parenting (1)
  • Stories (5)
    • Book Reviews (3)
  • story (1)
  • Summer Recipes (1)
  • Uncategorized (5)

Copyright © 2023 · Foodie Pro Theme On Genesis Framework · WordPress · Log in