Fish biryani recipe in TELUGU – హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ తయారు చేయడం ఎలా?

Fish Biryani Recipe with step by step instructions. fish biryani recipe

మీకు నచ్చే మరికొన్ని వంటలు

హైదరాబాదీ ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం ఎలా ?
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?
పెప్పర్ చికెన్ తయారు చేయడం ఎలా?
పుట్టగొడుగు బంగాళాదుంప కుర్మా తయారు చేయడం ఎలా?
మునక్కాడ టమాటో కూర

Click here for English version of this Recipe

హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ - Fish biryani recipe
Prep Time
1 hr
Cook Time
1 hr
Total Time
2 hrs
 
Course: Main Course
Cuisine: Andhra, Hyderabadi, Indian
Servings: 4
Author: బిందు
Ingredients
బిర్యానీ మసాలా కొరకు
  • 1 ½ tsp షాజీరా
  • 1 tsp సోంపు
  • 4 రెమ్మలు బిర్యానీ పూలు
  • 1 జాపత్రి
  • ¼ ముక్క జాజికాయ
  • 4 లవంగాలు
  • 4 యాలుకలు
  • 2 దాల్చినచెక్క అంగుళం ముక్కలు
వేయించిన ఉల్లిపాయలు కొరకు
  • 3 మీడియం ఉల్లిపాయలు
  • 1 tsp నూనె వేయించడానికి సరిపడా
మారినేషన్ కొరకు
  • 500 గ్రాములు బోన్ లెస్ ఫిష్
  • 300 గ్రాములు పెరుగు
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 1 tbsp కారం
  • 2 tsp బిర్యానీ మసాలా
  • 2 వేయించిన ఉల్లిపాయలు
  • ½ నిమ్మకాయ
  • 1 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • ¼ కప్పు పుదీనా
  • 2 tbsp నెయ్యి
  • 5 tbsp నూనె కాచినది
బియ్యం ఉడికించుట కొరకు
  • 3 లీటర్ల నీళ్ళు
  • 500 గ్రాములు బాసుమతి బియ్యం నానబెట్టినవి
  • 1 tbsp గరం మసాలా దినుసులు
  • 2 బిర్యానీ ఆకులు
  • ఉప్పు తగినంత
  • 2 tsp నూనె
  • 1 జల్లెడ
బిర్యానీ కొరకు
  • 1 వేయించిన ఉల్లిపాయ ముక్కలు
  • ¼ కప్పు పుదీనా
  • 2 tsp నెయ్యి
  • 1 అల్యూమినియం ఫాయిల్
  • 1 మందపాటి లోతైన గిన్నె
  • 1 పెనం
Instructions
బిర్యానీ మసాలా తయారు చేయుట
  1. ఒక పెనం వేడి చేసి అందులో షాజీరా, సోంపు, బిర్యానీ పూలు, యాలుకలు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి వేసి ఒక నిమిషం పాటు వేపి స్టౌ కట్టేయాలి.
  2. వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలను డీప్ ఫ్రై చేయుట
  1. ఉల్లిపాయల్ని చాలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి.
  2. ఒక చిన్న బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.
  3. నూనె కాగాక, ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి ముదురు గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి.
  4. బాణలిలో నుండి బయటకు తీసే ముందు నునెని గట్టిగా నొక్కేసి ఉల్లిపాయలని పక్కన పెట్టుకోవాలి.
చేప ముక్కలను శుభ్రం చేయుట
  1. చేప ముక్కల్ని బాగా కడిగి, ఒక అయిదు నిమషాల పాటు పసుపు, ఉప్పు వేసిన కలిపిన మజ్జిగలో నానబెట్టాలి.
  2. తర్వాత మజ్జిగలో నుండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
బియ్యం నానబెట్టుట
  1. 500 గ్రాముల బియ్యాన్ని నీళ్ళలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  2. వండబోయే ముందు 2 నుంచి 3 సార్లు కడగాలి.
చేప ముక్కల్ని మారినేట్ చేయుట
  1. ఒక మిక్సింగ్ బౌల్ లోకి చేప ముక్కల్ని తీసుకోవాలి.
  2. అందులో ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, 3 వంతులు వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, 4 నుండి 5 tbsp ల కాచిన నూనె, గిలకొట్టిన పెరుగు వేసి జాగ్రత్తగా కలపి 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
అన్నం వండే విధానం
  1. ఒక గిన్నెలో 2.5 నుండి 3 లీటర్ల నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, గరం మసాలా దినుసులు, పుదీనా వేసి మరిగించాలి.
  2. నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టి కడిగిన బియ్యం వేయాలి.
  3. బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతాయి.
  4. అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
  5. అన్నం ఉడకడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
  6. వెంటనే అన్నంలోని నీళ్ళని వార్చేసుకోవాలి.
ఫిష్ దమ్ బిర్యానీ వండే విధానం
  1. గిన్నెఅడుగున కొద్దిగా నూనె రాయాలి.
  2. నానబెట్టుకున్న చేప ముక్కల్ని వేసి సమానంగా పరవాలి.
  3. పైన సగం ఉడికిన అన్నం వేసి సమానంగా పరచాలి.
  4. మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా ఆకులు, కొద్దిగా నెయ్యి వేసి, అల్యూమినియం ఫాయిల్ తో గిన్నెని మూసేసి, దాని పైన మూత పెట్టాలి.
  5. ఒక పెనాన్ని పొయ్యి వెలిగించి పెట్టుకోవాలి.దాని మీద బిర్యానీ పాత్రను కూడా పెట్టాలి.
  6. హై ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించి తర్వాత సిమ్ లో ఉంచి 7 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
  7. కట్టేసిన వెంటనే మూత తెరవకుండా ఒక 15 నుండి 30 నిమిషాలు వదిలేయాలి.

Fish biryani recipe Video

[embedyt] http://www.youtube.com/watch?v=RLBB0FOM4l4[/embedyt]

About Author

బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




error: Content is protected !!