• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Maatamanti

  • Home
  • Kaburlu
  • Stories
  • Cinema
  • Recipes
  • Health&Fitness
  • Beauty&Fashion
  • Relationships
  • Blogging
  • About Me
  • Home&Garden

Beautiful Pink Lips – అందమైన మెరిసే గులాబీ పెదవుల కోసం చిట్కాలు

April 28, 2017 By బిందు 1 Comment

Amazing Tips for the Beautiful pink Lips.

beautiful pink lips

నల్లని పొడిబారిన పెదవులు మెరిసే ముఖం అందాన్ని పాడుచేస్తాయి.పెదవులు నల్లగా మారడానికి అనేక కారణాలుంటాయి.

  • అనేక రకాల కాస్మోటిక్స్ వాడకం వల్ల
  • తరచుగా లిప్ స్టిక్ వాడడం వల్ల
  • పిగ్మెంటేషన్ వల్ల
  • కొన్ని రకాల మందుల వాడకం వల్ల
  • స్మోకింగ్ వల్ల
  • కెఫీన్ ఉత్పత్తులు అధికంగా వాడడం వల్ల
  • డీ హైడ్రేషన్ వల్ల

కారణం ఏదైనా కానీ, కొద్దిపాటి ప్రయత్నంతో నల్లని పెదవులను మెరిసేలా మార్చుకోవచ్చు.దీనికోసం ముందుగా మీరు పాటించవలసిన నియమాలు:

  • సాధ్యమైనంత వరకు కాస్మోటిక్స్ జోలికి పోకూడదు.
  • అవసరమైనప్పుడు మాత్రమే లిప్ స్టిక్ మరియు లిప్ గ్లోస్ లాంటివి వాడాలి.
  • తీవ్రమైన ఎండలో ఉండవలసి వచ్చినప్పుడు సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడకుండా జాగ్రత్త వహించాలి.
  • కొన్ని రకాల యాంటిబయాటిక్స్ వాడినప్పుడు కూడా పెదవులు నల్లబడే అవకాశం ఉంది.వాడడం ఆపిన కొన్ని రోజులకు మళ్ళీ మాములుగా అవుతాయి.
  • స్మోకింగ్ అలవాటు ఉన్నవారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని చిట్కాలు ప్రయోగించినా ఫలితం శూన్యం.కాబట్టి ఆ అలవాటును మానుకోవడం మంచిది.
  • అదేపనిగా లెఖ్ఖలేనన్ని సార్లు కాఫీలు, టీ లు, కూల్ డ్రింక్ లు తాగడం వల్ల కూడా నల్లబడతాయి.కాబట్టి రోజులో మొత్తం 2 సార్లు మాత్రమే కాఫీ గానీ, టీ గానీ తీసుకోవాలి.ఇక కూల్ డ్రింక్ ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
  • అన్నింటికన్నా ముఖ్యమైనది నీళ్ళు.రోజుకి కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్ళయినా త్రాగాలి.

చిట్కా 1

beautiful pink lips

  1. ఒక కట్ట తాజా కొత్తిమీరను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
  2. తర్వాత దానిని వడకట్టి పిప్పిని వేరు చేయాలి.
  3. వడకట్టగా వచ్చిన రసంలో కొద్దిగా గ్లిసరిన్,  కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఒక చిన్న డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోండి.
  4. రోజుకు రెండు సార్లు, ఉదయం స్నానానికి వెళ్లేముందు 15 నిమిషాలు మరియు రాత్రి పడుకునే 15 నిమిషాల ముందు రాసుకోవాలి.
  5. ఇలా 10 నుండి 15 రోజుల పాటు పాటించాలి.

చిట్కా 2

beautiful pink lips

 

    1. ఒక కప్పు గులాబీ రెక్కలను 2 నిమిషాల వరకు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడగాలి.
    2. తర్వాత వాటిని పేస్టులా చేసి అందులో 1 tsp పచ్చి పాలు, 1 tsp తేనె వేసి కలపాలి.
    3. ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించి ఆరిపోయేవరకు ఉంచి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.

beautiful pink lips

చిట్కా 3

beautiful pink lips

  1. 1 tbsp పంచదారను 1 tsp  తేనెతో కలిపి టూత్ బ్రష్ తో పెదవులపైన సున్నితంగా కొద్ది నిమిషాల పాటు మర్దన చెయ్యాలి.
  2. ఇలా చేయడం వల్ల పెదవులపై కల మృత చర్మ కణాలు తొలగిపోయి పెదవులు సున్నితంగా అవుతాయి.
  3. పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది కనుక పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.అందుకే వెంటనే పెదవులకు నెయ్యి గానీ, కొద్దిగా ఆలివ్ ఆయిల్ గానీ పూసి మర్దనా చెయ్యాలి.
  4. ఇలా చేయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా ఉండి చక్కగా అందంగా మెరుస్తూ ఉంటాయి.

చిట్కా 4

  1. ఇది అన్నింటికన్నా సులువైన చిట్కా.
  2. సిట్రస్ గుణం కలిగిన పండ్ల రసాన్ని పెదవుల మీద రుద్ది ఎండిపోయే వరకు ఉంచి కడిగేసుకోవాలి.
  3. వీటిలో అన్నింటికన్నా తేలిగ్గా దొరికేది నిమ్మకాయ.రసం తీసేసిన నిమ్మకాయ తొక్కని వేసి పెదవుల మీద రుద్దినా పర్వాలేదు.

beautiful pink lips

చిట్కా 5

  1. పైన ఇచ్చిన టిప్స్ అన్నింటిని కనీసం 15 నుండి నెల రోజుల వరకు పాటించాలి.ఒక రెండు రోజులు పాటించి ఏ మార్పు కనపడలేదని మానేయకూడదు.
  2. ఒక వేళ వీటిలో ఏ చిట్కా పనిచేయలేదంటే మీరు మీ దగ్గరలో ఉన్న dermetologist ని సంప్రదించండి.

Watch the video below for the Beautiful Pink Lips

[embedyt] https://www.youtube.com/watch?v=b2-B1Hc8zJg[/embedyt]

 

Filed Under: Beauty&Fashion, lip care

About బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Previous Post: « Muskmelon Ice Pops-ఖర్బుజా తో పుల్ల ఐస్ తయారు చేయడం ఎలా?
Next Post: Mutton Dalcha Telugu Recipe-హైదరాబాదీ మటన్ దాల్చా తయారీ »

Reader Interactions

Click on the Image to Know about me

Comments

  1. Bhavani says

    January 28, 2022 at 6:56 pm

    Hi bindhu garu,
    Hyderabad Mery city outside untunaru ani ghalusu, me farm lo kuragayalu konukovali anta ela contact avali

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




Primary Sidebar

Categories

  • Beauty&Fashion (2)
    • Skin (1)
  • Blogging (2)
  • Cinema (4)
    • telugu movie reviews (3)
  • Farming (2)
  • Health&Fitness (16)
    • Weight Management (12)
      • Ketogenic Diet (2)
  • Home&Garden (4)
    • cookware (1)
    • Household Product Reviews (1)
    • Kitchen Gadgets (1)
  • Kaburlu (12)
  • Kids Recipes (5)
  • Kitchen (1)
  • lip care (1)
  • Millet Recipes (1)
  • Recipes (106)
    • Bakes (2)
    • Biryanis (7)
    • Breakfast Recipes (12)
      • Bonda Recipes (1)
      • Breakfast Chutneys (1)
      • Dosa Recipes (1)
      • Poori Recipes (2)
    • Chicken Recipes (19)
    • Chinese Food (1)
    • Chutneys (3)
    • Drinks (3)
    • Egg Recipes (4)
    • Festival Recipes (9)
      • Sankranthi Recipes (1)
      • Varalakshmi Vratham Recipes (5)
    • Fish Recipes (3)
    • Fry Recipes (4)
    • Healthy Recipes (4)
    • Masala&Spice Powders (3)
    • Mushroom Recipes (2)
    • Mutton Recipes (2)
    • Paneer Recipes (5)
    • Pickles (5)
    • Prawns Recipes (3)
    • Rice Recipes (13)
      • Non Veg Rice Recipes (3)
      • Veg Rice Recipes (2)
    • Sambar&Rasam (3)
    • Snacks&Appetizers (19)
    • Soups (1)
    • Starters (1)
    • Street Food (8)
    • Sweets&Desserts (15)
    • Vada Recipes (3)
    • Veg curries (9)
  • Relationships (1)
    • Parenting (1)
  • Stories (5)
    • Book Reviews (3)
  • story (1)
  • Summer Recipes (1)
  • Uncategorized (5)

Copyright © 2023 · Foodie Pro Theme On Genesis Framework · WordPress · Log in