Vegetable Sambar Telugu Recipe with step by step instructions.English Version.

ఏ కూరైనా తినీ తినీ బోర్ కొడుతుందేమో కానీ సాంబారాన్నం ఎప్పటికీ బోర్ కొట్టదు.వేడి వేడి అన్నంలో సాంబార్, కాస్త నెయ్యి వేసుకొని తింటే ప్రాణం ఏటో వెళ్ళిపోతుంది కదండీ!.సాంబార్ మిగిలినా ఫ్రిజ్ లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వేడి చేసుకొని తినొచ్చు.నేనైతే మిగిలిన సాంబార్ లో కాస్త బెల్లం వేసి కాచి మరుసటి రోజు ఉదయం టిఫిన్ లో సైడ్ డిష్ గా వాడతాను.ఇడ్లీ, దోసె, వడ లతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
పప్పు చారు లేదా సాంబారును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తారు.కొందరు కూరగాయలని నీళ్ళల్లో వేరుగా ఉడికించి తర్వాత పప్పులో కలుపుతారు.నేను మొదట్లో రక రకాలుగా ట్రై చేసి చివరికి ఈ పద్ధతికి స్టిక్ అయ్యాను.ఈ విధానంలో చేయడం నాకు తేలికనిపిస్తుంది.ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను.ఫిష్ ఫ్రై లేదా చికెన్ బిర్యానీ చేసిన ప్రతిసారి నేను ఈ సాంబార్ కూడా చేస్తూ ఉంటాను.కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది.కావాలంటే చింతపండు కి బదులు నిమ్మకాయ లేదా మామిడికాయ లను వాడవచ్చు.కానీ నిమ్మకాయ రసం పిండితే ఎక్కువ సేపు నిలవ ఉండదు.తక్కువ పరిమాణంలో చేసుకున్నప్పుడు మాత్రమే నిమ్మకాయ వాడితే మంచిది.మీరు కూడా ఈ టేస్టీ సాంబార్ recipe ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Ulavacharu Recipe in Telugu
 Hyderabadi Mutton Dalcha Recipe in Telugu
 Chamagadda Pulusu Recipe in Telugu
 Potato Fry Recipe in Telugu
 Miriyaala Kodi Vepudu/Pepper Chicken dry Recipe in Telugu
 Tomato Pudina Chutney Recipe in Telugu
Click here for the English Version of the Recipe.

- 1 కప్పు లేదా 200 గ్రాములు కందిపప్పు
- ½ tsp పసుపు
- 1 లీటరు నీళ్ళు
- 15 లేదా 20 గ్రాములు చింతపండు
- 200 ml నీళ్ళు
- 1 పెద్ద ఉల్లిపాయ
- 3 పచ్చిమిరపకాయలు
- 1 క్యారెట్
- 1 మునక్కాడ
- 1 టమాటో
- 200 గ్రాములు సొరకాయ ముక్కలు
- 4 కరివేపాకు రెమ్మలు
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 ఎండుమిరపకాయలు
- ¼ పసుపు
- 1 tsp కారం
- 1 tsp మిరియాల పొడి
- 1 tsp సాంబారు పొడి
- 1 tbsp నెయ్యి
- 3 tbsp నూనె
- ¼ కప్పు కొత్తిమీర
- కందిపప్పు ని రెండు మూడు సార్లు కడిగి ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకోవాలి.
- కందిపప్పు కన్నా 2 సెంటీమీటర్లు ఎక్కువ వచ్చే వరకు నీళ్ళు పోయాలి.
- కుక్కర్ మూత మరియు విజిల్ పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- చింతపండు ని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టాలి.
- తర్వాత రసం పిండి వడకట్టాలి.
- మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి రసం పిండాలి.ఇలా చింతపండు పిప్పి లా మారే వరకు చేయాలి.
- ఉడికిన పప్పుని మెత్తగా చేసి అందులో చింతపండు రసం కూడా పోసి కలపాలి.ఇంకో ముప్పావు లీటరు నీళ్ళు పోసి పక్కన ఉంచుకోవాలి.
- ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి.
- నూనె కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
- తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గే వరకు ఉడికించాలి.
- కూరగాయలు మగ్గాక, పసుపు, కారం వేసి కలిపి పప్పు చింతపండు రసం మిశ్రమాన్ని పోసి ఒక మరుగు వచ్చే వరకు కాయాలి.
- మరగడం మొదలవగానే అందులో మిరియాల పొడి, సాంబార్ పొడి, నెయ్యి వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి.ఉప్పు సరిచూసుకోవాలి.
- కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవాలి.

Vegetable Sambar Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=qwxykuJqQcs[/embedyt]
Leave a Reply