ఈ పోస్ట్ లో నేను రెగ్యులర్ గా వాడే ఆహార పదార్ధాల లిస్ట్ ఇస్తున్నాను. ఆన్లైన్ లో ఉన్నంత వరకు ఇస్తాను. మిగిలినవి ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. మీరు ఈ పోస్ట్ మొత్తం చదివాక నా యూట్యూబ్ కమ్యూనిటీ లోకి వెళ్లి పాత పోస్ట్ లను చూస్తే నేను ఈ కింద ఇచ్చిన ఆహారాలను రోజూ ఎలా వాడతానో మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. అందుకే మర్చిపోకుండా ఒకసారి చూడండి. నేను ఇంట్లో వాడుతున్న వాటిని ఫోటో తీసి కింద ఇమేజ్ slider లో పెట్టాను చూడండి. ఆ slider లో ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది.
బియ్యం మరియు ఇతర ధాన్యాలు
నేను మాములు తెల్ల బియ్యం నెలకు 5 కేజీలు మాత్రమే వాడతాను. మాకు అది సరిపోతుంది. పాలిష్ పట్టని బియ్యం లోకల్ సూపర్ మార్కెట్ లో తీసుకుంటాను. బ్రౌన్ రైస్ 5 కేజీలు వాడతాను. 24 mantra ఆర్గానిక్ బ్రౌన్ రైస్ వాడతాను. ఈ బ్రౌన్ రైస్ ని నేను అన్నానికి వాడతాను ఇంకా దోశ పిండి కోసం కూడా వాడతాను. బాస్మతి రైస్ ఇంతకు ముందు Popular Essntials అనే ఒక బ్రాండ్ వాడేదాన్ని. నేను వాడిన అన్నీ బాస్మతి బ్రాండ్స్ లోకి అది చాలా చాలా బాగుండేది. amazon లో కొన్నాను ఒక 5 సార్లు. ఎందుకో గానీ తర్వాత అది లేదు. ఆ తర్వాత నుండి Kohinoor కానీ Dawat కానీ వాడుతున్నాను. ఒక్కోసారి సూపర్ మార్కెట్ లో లూజ్ గా బ్రౌన్ బాస్మతి బియ్యం దొరుకుతాయి. అవి ఉంటే అవే తెచ్చు కుంటాను. లూజ్ బాస్మతి కొనేటప్పుడు బియ్యం వాసన చూసి కొనుక్కోవాలి.
Naturally yours బ్రాండ్ Black Rice, quinoa వాడతాను. ఆ ఫొటోస్ నేను యూట్యూబ్ కమ్యూనిటీ లో కొన్ని రోజుల క్రితం పెట్టాను మీరు చూడవచ్చు. Black Rice, quinoa అప్పుడప్పుడూ వాడతాను నెలకు 3 సార్లు అలా అంతే. మరీ ఖరీదు ఎక్కువ కదా. పైగా బ్లాక్ రైస్ తిందాము అనుకున్నా అస్సలు ఎక్కువ తినలేము. నేనయితే అరకప్పు అన్నం కూడా తినలేను. కానీ బ్లాక్ రైస్ చాలా ఉత్తమమైన బియ్యం అని Dr.Eric Berg చెప్పారు. దానికి 42.3 మాత్రమే glycemic index ఉంటుంది. అంటే తక్కువ G.I అన్నమాట. అదే వండిన తెల్ల బియ్యానికి అయితే 73 ఉంటుంది. అది చాలా ఎక్కువ అన్నమాట. సాధారణంగా G.I 55 కన్నా తక్కువ ఉన్న వాటిని మంచి కార్బోహైడ్రేట్స్ గా భావించవచ్చు. ఇవి తినడం వెంటనే రక్తం లో చక్కర స్థాయిలు వేగంగా పెరగవు. బ్రౌన్ రైస్ కి 68 G.I ఉంటుంది. బాస్మతి రైస్ G.I 50-58 మధ్యలో ఉంటుంది. అందువల్ల అది కూడా మంచిదే. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిది. అందులో సెలీనియం అనే మినరల్ ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల తెల్ల అన్నం కన్నా బ్రౌన్ రైస్ తీసుకోవడం మంచిది. మిల్లెట్స్ G.I 54 నుండి 68 మధ్యలో ఉంటుంది. అందువల్ల తెల్ల బియ్యం కన్నా ఇవి మంచివి.
quinoa rice లింక్ ఇద్దాము అనుకుంటే నేను వాడుతున్న బ్రాండ్ అమెజాన్ లో కనిపించలేదు. వెతుకుతుంటే ఇది కనిపించింది. 5 కేజీలు 900 rs ఉంది. నేను ఇప్పటి వరకు కొన్నది 1/2 కేజీనే 290 rs ఉంది. Quinoa కి low G.I అంటే 53 మాత్రమే. దీని రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అందువల్ల నేను ఇది ఆర్డర్ చేశాను. నేను 3/4 కప్పు వండితే మాకు ఇద్దరికీ సరిపోతుంది. తిన్నాక చాలా సేపు వరకు హెవీ గా కూడా అనిపిస్తుంది.
మిల్లెట్స్ నేను ఎప్పుడూ మూసాపేట్ లో ఉన్న మెట్రో స్టోర్ లో తీసుకుంటాను. అక్కడ అన్నీ దొరుకుతాయి. Manna బ్రాండ్ మిల్లెట్స్ బాగుంటాయి. Pro Nature brand మిల్లెట్స్ కూడా బాగుంటాయి.
పప్పు ధాన్యాలు అన్ని సూపర్ మర్కెట్స్ లో లూజ్ పప్పులు దొరుకుతాయి కదా. వాటిలో పాలిష్ పట్టని చూడడానికి మెరుస్తున్నట్లు గా కాకుండా డల్ గా ఉన్న కందిపప్పు, మినపప్పు తీసుకోవాలి. పల్లీలు లూజ్ ఓ 10 తీసుకుని నోట్లో వేసుకుని చూడాలి. ఏదైనా పుచ్చు పప్పు నోటికి తగిలినా లేదా పల్లీలు చూడడానికి ఫ్రెష్ గా లేకుండా నూనెగా అంటే పొట్టు కొద్దిగా ఊడిపోయి transparent గా ఉన్నట్లు అక్కడ బూజు పట్టిన పుచ్చు పప్పులు ఉన్నా, ముక్క వాసన వస్తున్నా తీసుకోకూడదు. తినగానే తియ్యగా ఉండి బాగుంటే తీసుకోవచ్చు. నేను అలా బాగో నప్పుడు 24 mantra తీసుకుంటాను.
గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి కూడా 24 Mantra బ్రాండ్ వి బాగుంటాయి. ఇవి కొనేటప్పుడు ఎప్పుడూ expiry డేట్ చూసి కొనుక్కోవాలి. మీరు expiry డేట్ లోపు వాడగలరా లేదా అనవసరంగా మిగిలిపోయి వేస్ట్ అయిపోతుందా చూసి కొనుక్కోవాలి. కొబ్బరి పిండితో కేక్ లు, cookies తయారు చేసుకోవచ్చు. నెట్ కార్బ్స్ చాలా తక్కువగా ఉంటాయి.
నూనెలు
నేను సుమారు 5-6 సంవత్సరాల నుండి ఆలివ్ నూనె వాడుతున్నాను. నేను మొదట్లో Pomace ఆలివ్ ఆయిల్ వాడేదాన్ని. ఎందుకంటే మన ఇండియన్ కుకింగ్ కి అది సరిగ్గా సరిపోతుంది. pomace ఆయిల్ ని extra virgin, virgin ఆలివ్ ఆయిల్స్ లాంటివి ఆలివ్స్ నుండి తీసేశాక మిగిలిన పిప్పి నుండి తయారు చేస్తారు. అయితే మాములుగా ప్రెస్సింగ్ ద్వారా పిప్పి నుండి ఎక్కువ నూనె రాదు కాబట్టి కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా ఆయిల్ తీస్తారు. అందువల్ల అది కొద్దిగా సహజత్వాన్ని కోల్పోతుంది. అయినా మిగిలిన రిఫైన్డ్ నూనెలు వాడేకన్నా రిఫైన్ చేసిన ఆలివ్ pomace ఆయిల్ వాడడం మేలు. నేను ఇప్పుడు ఫిగారో ఆలివ్ నూనె వాడుతున్నాను. ఇది pomace ఆయిల్ కాదు. అలా అని extra virgin, వర్జిన్ కూడా కాదు. extra virgin, వర్జిన్ ఈ రెండు సలాడ్స్ డ్రెస్సింగ్ కి బాగుంటాయి కానీ మనం భారతీయ వంటకాలకు అంతగా బాగోవు. వండే సరికి సగం రుచి మారిపోతుంది. ఇప్పుడు నేను వాడుతున్న Figaro నూనె వేయించడానికి, డీప్ ఫ్రైయింగ్ కి, బేకింగ్ కి అన్నింటికీ పనికొస్తుంది.
coconut ఆయిల్ నేను కీటో డైట్ చేసేటప్పుడు ముందు ఒక 250 ml బాటిల్ కొన్నాను. అతి కష్టం మీద అది వాడాను. తర్వాత ఇంకో 750ml కొన్నాను. అది ఇంకా అలానే ఉంది. వాడలేకపోయాను. మీరు వాడాలి అనుకుంటే వాడొచ్చు. నేను నిర్మల్ బ్రాండ్ వాడాను. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే అనవసరం గా ముందే ఎక్కువ తెచ్చి పెట్టుకోకుండా ముందు ఒక చిన్న బాటిల్ వాడి చూసి పర్లేదు అనుకుంటే మళ్ళీ తెప్పించుకోండి.
అసలు వీలయితే మీ ఇంటికి దగ్గర్లో ఎక్కడైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అప్పటికప్పుడు మీ ముందే తీసి ఇచ్చే షాప్ ఉంటే చూడండి. అలా తెచ్చు కోగలిగితే ఇంకా మంచిది. నేను ఈ మధ్య కట్టె గానుగ నూనెలు వాడడం మొదలు పెట్టాను. అదృష్టం బాగుండి అవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాడగలుగుతున్నాను. చక్కగా ఇప్పుడు కాస్త ఆలివ్ నూనె వాడకం తగ్గించవచ్చు. . ఏదైనా కొనే ముందు ఒకసారి రివ్యూస్ కూడా చూసి కొనండి. కొన్నింటికి 4 స్టార్ట్ రేటింగ్ మాత్రమే ఉన్నా అది damage అయిన packing వల్ల అలా ఇచ్చారు.
పీనట్ బట్టర్, మయోన్నైస్ లేదా సాస్ లాంటివి వాడాలి అనుకుంటే మీరు కొనే ముందు లేబిల్ చూసి కొనుక్కోవాలి. ప్రిజర్వేటివ్స్ , సుగర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ లేని వి చూసి మరీ కొనుక్కోవాలి. చక్కని డైట్ పాటించాలి అనుకునే వారు అలాంటివి వాడకూడదు. unsweetened పీనట్ butter కొనుక్కోవాలి. టమాటో సాస్ లో కూడా సుగర్స్ కలపని డి వాడాలి. నేను ఇప్పుడు అదే వాడుతున్నాను. అంటే నేను సాస్ తినను. ఎప్పుడైనా మా అమ్మాయికి ఇవ్వాలన్నా సుగర్స్ కలపని టమాటో సాస్ ఇస్తాను. వాటి లింక్స్ కింద ఇస్తాను. టమాటో సాస్ ఇప్పుడు చూస్తే అవైలబుల్ గా లేదు. మీరు పైన టమాటో సాస్ లింక్ ను క్లిక్ చేస్తే కనిపిస్తుంది.
నేను వాడుతున్న ఇతర ప్రొడక్ట్స్ లింక్లు కూడా ఇస్తున్నాను చూడండి. అల్ఫాల్ఫా గింజల్ని నానబెట్టి వారం రోజుల పాటు మొలకెత్తిన తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకటి కాదు రెండు కాదు చాల రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో. వాటిని మొలకిత్తించడం కాస్త ఓపికగా చేయాలి. ఇక గుమ్మడి గింజలు కూడా చాలా మంచివి ఆరోగ్యానికి. నిద్ర లేమి సమస్య ఉన్నవారికి అవి చక్కని ఔషధం లా పనిచేస్తాయి. తినడానికి బాగున్నాయి కదా అని ఎంత బడితే అంత తినకూడదు వాటిని 1 tbsp మాత్రమే వాడాలి. నేను కింద రెండు బ్రాండ్స్ లింక్లు ఇచ్చాను కానీ నేను అవి ఎప్పుడూ వాడలేదు. నేను Happilo బ్రాండ్ వాడాను. కానీ ఈ మధ్య కొన్న ప్యాక్ లో గుమ్మడి గింజలు విరిగిపోయినట్లు పొడి లాగా ఉన్నాయి. అందుకే వేరే లింక్స్ ఇచ్చాను. రోజుకొక్క ఆప్రికాట్ తిన్నా చాలు అవి కూడా చాలా మేలు చేస్తాయి. నేను ఎక్కువగా డ్రై ఆప్రికాట్స్ వాడతాను. బట్ పచ్చివి కూడా బాగుంటాయి. డ్రై ఆప్రికాట్స్ ని రాత్రి బాదాం వాల్నట్స్ తో పాటు నానబెట్టుకుని మార్నింగ్ మొదటి మీల్ లో తినొచ్చు.
చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి మంచివి చూడడానికి సబ్జా గింజల్లా ఉన్నా రెండు వేరు వేరు. వాటిలో ఉండే పోషకాలు కూడా వేరు వేరు. 1 tbsp చియా గింజలలో 1 g మాత్రమే net carbs ఉంటాయి. పీచు పదార్ధం ఎక్కువ. intermittent fasting చేసేటప్పుడు మీకు ఫాస్టింగ్ టైం లో ఆకలి అనిపిస్తే 1 tbsp నీళ్లలో వేసుకుని తాగితే కడుపు నిండుగా అనిపిస్తుంది. చాలా సేపటి వరకు ఆకలి ఉండదు. నేను అలానే తాగుతాను. కావాలంటే ఆ నీళ్లలో నిమ్మ రసం కూడా కలుపు కోవచ్చు. సలాడ్స్ లో కూడా చియా గింజల్ని వేసుకోవచ్చు. బరువు తగ్గడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.
ఇక తీపి కోసం. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు దయచేసి పంచదార వాడకండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఈ పోస్ట్ లో. బెల్లం తేలికగా దొరుకుంది ధర అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అది వాడండి. కానీ బెల్లం మంచిది కదా అని మరీ ఎక్కువ వాడితే అనవసరంగా బోల్డెన్ని carbs తీసుకున్నట్లు అవుతుంది. బెల్లం కన్నా కోకోనట్ షుగర్, తాటి బెల్లం మంచివి. వాటికి low G .I ఉంటుంది. ఈ మధ్య కొన్ని స్వీట్ షాప్స్ లో కూడా తాటి బెల్లం, కొబ్బరి బెల్లం అమ్ముతున్నారు కుదిరితే అక్కడ కొనుక్కుంటే మంచిది. ఉప్పు Puro healthy salt బాగుంటుంది. వీలయితే అది వాడండి.
అసలవేమి వద్దు అనుకుంటే చక్కగా మీరు keto sweetener అయిన Erythritol వాడొచ్చు. అందులో కార్బ్స్ ఉండవు calories ఉండవు. మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు టీ ,కాఫీ లాంటివి తీసుకోవాలి అనుకుంటే చక్కగా 1 tbsp వేసుకుని తాగేయొచ్చు. స్టెవియా టాబ్లెట్స్ కూడా వాడను నేను కానీ అవి చాలా చేదుగా అనిపించాయి. తరువాత ట్రై చేద్దామని Erythritol కొన్నాను. బాగుంది. మొన్నీమధ్య stevia liquid drops కూడా కొన్నాను. అది కూడా చాలా బాగుంది. 2 డ్రాప్స్ వేసుకుంటే చాలు తీయగా అయిపోతుంది కాఫీ. వాటి లింక్స్ కింద ఇస్తాను చూడండి. అయితే ఇపుడు నేను వాడుతున్న స్టెవియా అమెజాన్ లో మళ్ళీ కనపడడం లేదు అంటే currently unavailable అని ఉంది.
నేను ఇంతకు ముందు పోస్ట్ Good foods list లో మునగాకు పొడి తెచ్చుకుని కారం పొడి చేసుకుని రోజూ ఒక ముద్ద అన్నం లో ఒక tbsp వేసుకుని తింటే మంచిది అని చెప్పాను కదా. ఆ మునగాకు పొడి కొన్ని స్వీట్ షాప్స్ లో దొరుకుతుంది. లేదంటే కింద లింక్ ఇచ్చాను చూడండి. వీట్ గ్రాస్ జ్యూస్ మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు తాగొచ్చు అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక బీట్ రూట్ పౌడర్ ఇది నేను ఫస్ట్ టైం శరత్ సిటీ మాల్ కొండాపూర్ spar లో చూశాను. కొందాము అని మళ్ళీ ఆగిపోయాను. కల్తీ ఉంటుందేమో అని. బట్ ఈసారి ఈ కింద ఇచ్చిన లింక్ లోది ఇప్పుడు కొనబోతున్నాను. బీట్రూట్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అది ఇంకో పోస్ట్ లో రాస్తాను. ఇప్పటికైతే అది కొని వాడి తర్వాత మీకు చెప్తాను ఎలా ఉందో.
ఇవి ఇప్పటికి నేను ప్రతి రోజూ ఇంట్లో వాడే ఆహారాల లిస్ట్. నాకు మంచిగా అనిపించిన వాటి లిస్ట్ ఇచ్చాను. ఏది కొనుక్కోవాలి అని సందేహము ఉన్నవారికి ఈ పోస్ట్ ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను. ధన్యవాదములు.
Mani Babu says
Mem, i am from Vijayawada, i got love marriage recently my wife is now 3rd month, for healthy baby growing what are the food should be take and what is the oil can i use in cooking.. is olive preferable for pregnant women? Why because I am asking this silly quotations my parents and her parents are not in touch with us..Actually i am little health consious,so I fallow your channel it’s so helpful us..Thankyou
BINDU says
Mani garu..first of all congratulations andi. don’t worry if you don’t have parents support. edo oka roju valle vachestaru mee daggaraku. kanee ippudu mee wife ki andari kanna meere important. meeru adigina question ke thelispotundi meeru thanani baaga chusukuntaru ani. pregnant women olive oil teesukunna emi kaadu. kanee edaina kothaga alavatu chesukovadam ee time lo antha manchidi kaadu. actual gaa ayihe olive oil is really very very good. vaadithe manchide kanee pregnant ladies ki edaina salaha cheppali ante bhayam gaa untundi naaku. Healthy food ante anni vegetables ekkuvaga teesukovali. pregnancy time lo koddiga constipation untundi. anduvalla fibre rich foods teesukovali. teepi ekkuva unde fruits teesukoka povadame manchidi. jamakaya, musk melon, water melon, daanimma laantivi teesukovachu. konthamandi jamakaya thinte jalubu chestundi ani cheptaru. but adi oka myth. jalubu fruits valla raadu virus valla vastundi. organic milk, eggs, organic meat teesukunte manchidi. protien food ekkuva teesukunte baby growth baaguttundi. nuts kuda teesukovali. maree ekkuva sepu kurchokunda…chala nemmadiga walking chestundaali appudappudu. taginantha water taagali. prasanthamga taginantha time nidra povali. appudu chala healthy gaa untaru.
Prasanna says
Hi Bindhu garu , ma parents ki diabetes vundhi vallu every day 2 r 3 times tea and coffee tragutaru sugar lekundha aasalu tragaru ,sugar substitute stevia and erythritol gurinchi vinanu diabetes ki safe ani vinanu , na dought anti ante vallu regular ga tea and coffee lo vadhavacha? one cup tea r coffee ki entha vadhavachu?
BINDU says
HI Prasanna garu. stevia and Erythritol rendu vadochu..Erythritol oka rojuki okaru motham meeda 30 gramulu minchakunda teesukovachu. stevia 2-3 drops vesukunte saripotundi. Erythritol maree ekkuva teesukunte kadupubbaram vastundi. coffeee tea lu maree 3 times ante antha manchidi kaadu.. kaneesam 2 times ki tagginchamanandi. milk kudaa chikkani vi vaadakudadu. palchani palu vaadali.
Srilaxmi says
Hi bindu garu …memu agricultural land kondham ani plan chesukuntunnamu meeru ea document choosukovali okasari raasaru kadha vivaramga adhi naku search chesina kanapadaledhandi …na mail ki pampagalara pls …srilaxmivytla@gmail.com…thank u
Vijay says
Hi Bindu akka. General ga manchi paddhathulu follow avvalanukune vaallaki correct guidance or information easy ga dorakadhu. Mee valla maaku ah guidance dorukuthundhi. Thank you.
Honey eh brand vaadali akka?