Methi Chicken Telugu Recipe with step by step instructions.English Version.

ఏదైనా కూరలో మెంతి కూర వేస్తే చేదుగా ఉంటుందేమోనని అనుకునేదాన్ని.ఒక సారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కసూరి మచ్చి కర్రీ ని చూశాను.సందేహిస్తూనే ప్లేట్తి లో వేసుకున్నాను.తినగానే విపరీతంగా నచ్చేసింది.ఇక అప్పటి నుండి కసూరి మేతి ని నా వంటలలో అలవాటు చేసుకున్నాను.
ఆ రోజు తర్వాత కాస్త google లో సెర్చ్ చేసి కసూరి మేతి చికెన్ ఎలా చేస్తారో తెలుసుకుని దీన్ని తయారు చేశాను.ఎంత బాగా కుదిరిందంటే చికెన్ పీసెస్ అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగి పోయేలా ఉంది.క్రీమ్ ఇంకా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అచ్చు రెస్టారెంట్ స్టైల్ మేతి చికెన్ లా అనిపించింది.ఈ recipe అన్నం లో కన్నా రోటి, చపాతీ, నాన్ లేదా పుల్కాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.రోటిలతో పాటు ఉల్లిపాయ మరియు టమాటో స్లైసెస్ తో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది.ఈ టేస్టీ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Chicken Shawarma Recipe in Telugu
 Karivepaku Chicken Curry in Telugu
 Mango Chicken Recipe in Telugu
 Natukodi Pulusu Recipe in Telugu
 Chicken Tikka Pulao Recipe in Telugu
 Andhra Chicken Fry Recipe in Telugu
 Pepper Chicken Fry Recipe in Telugu
Click here for the English Version of this Recipe.

- 500 గ్రాములు చికెన్
- ¼ tsp పసుపు
- ఉప్పు తగినంత
- 1 tsp కారం
- 1 tsp ధనియాల పొడి
- ½ tsp మిరియాల పొడి
- 3 లవంగాలు
- 4 ఏలకులు
- 2 దాల్చిన చెక్క అంగుళం పొడవు
- 1/8 ముక్క జాజికాయ
- ½ పువ్వు జాపత్రి
- 2 బిర్యానీ ఆకులు
- 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
- ¼ కప్పు గడ్డ పెరుగు
- 3 మీడియం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
- 3 పచ్చిమిరపకాయలు
- 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
- ¼ tsp పసుపు
- ఉప్పు తగినంత
- 1 tsp కారం
- ¼ కప్పు కసూరి మేతి
- 6 జీడిపప్పులు
- 3 tbsp నూనె
- 20 గ్రాములు బటర్
- ¼ కప్పు క్రీమ్
- ¼ కొత్తిమీర తరుగు
- చికెన్ శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
- అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద, గడ్డ పెరుగు వేసి బాగా కలపాలి.
- ఈ చికెన్ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
- 6 జీడిపప్పు లను 20 నిమిషాల పాటు నానబెట్టి తరవాత కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి.
- దీని కోసం నేను ప్యాకెట్ మీద ఇవ్వబడిన సూచనలు పాటించాను.
- ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు మరిగించి పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
- అందులో కాస్త ఉప్పు, కసూరి మేతి వేసి 2 నుండి 3 నిమిషాల పాటు నాననివ్వాలి.
- తర్వాత నీళ్ళు వంపేసి మేతి ని పక్కన పెట్టుకోవాలి.
- ఒక బాణలిలో నూనె మరియు బటర్ వేసి కరికే వరకు ఆగాలి.
- ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- కొద్దిగా పసుపు, కారం వేసి కలపాలి.
- తర్వాత మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం హీట్ లో 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
- ముప్పావు వంతు ఉడికాక జీడిపప్పు పేస్ట్, కసూరి మేతి, క్రీమ్ లను వేసి బాగా కలపాలి.
- ఒక కప్పు నీళ్ళు పోసి ఒక సారి కలిపి మూత పెట్టి సన్నటి సెగ మీద కూర చిక్కబడే వరకు ఉడికించాలి.
- చివరిగా కొత్తిమీర తరుగు వేసి కూర దించేసుకోవాలి.

Methi Chicken Telugu Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=sd95q-qrByM[/embedyt]
Leave a Reply