Mamidi Allam Pachadi Telugu Recipe with step by step instructions.English Version.

మామిడి అల్లం శీతాకాలం లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.సాధారణ అల్లం లా ఘాటుగా కాకుండా పచ్చి మామిడికాయ వాసనతో ఉంటుంది.చేదు కూడా ఎక్కువ ఉండదు.దీనిని ఆయుర్వేదం లో దగ్గు మాన్పించడానికి, గాయాలు తగ్గించడానికి, అజీర్తికి కూడా ఉపయోగిస్తారు.
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిన పచ్చడిని చాలా ఇష్టంగా తినేదాన్ని.వేడి అన్నం లో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.కమ్మని మా అమ్మమ్మ చేతి ముద్దలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.
అల్లం సహజంగా చేదుగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడిలో ఆ చేదును తగ్గించడానికి బెల్లాన్ని ఉపయోగిస్తారు.కారాన్ని బాలన్స్ చేయడానికి చింతపండు వేస్తారు.కొన్ని ప్రాంతాలలో అల్లం పచ్చడిలో బెల్లం వేయరు.తెలంగాణా ప్రాంతంలో వేయరు.ఆంధ్రా వారు తప్పక ఉపయోగిస్తారు.చిన్నప్పటి నుండి అదే అలవాటు కాబట్టి నాకు ఆంధ్రా అల్లం పచ్చడి అంటేనే ఇష్టం.ఏది ఏమైనా ఎవరి టేస్ట్ వారిది.ఈ అల్లం పచ్చడి అన్నంలోనే కాకుండా అన్ని రకాల టిఫిన్ తో కలిపి సర్వ్ చేయవచ్చు.ఈ రుచికరమైన పచ్చడిని మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Cauliflower Pickle Recipe in Telugu
 Andhra Mango Pickle Recipe in Telugu
 Mushroom Pickle Recipe in Telugu
 Pandu Mirapakaya Pachadi Recipe in Telugu
 Tomato Pudina Chutney Recipe in Telugu
Click here for the English Version of the Recipe.

- 250 లేదా ౩౦౦ గ్రాములు మామిడి అల్లం
 - 150 గ్రాములు చింతపండు
 - 150 గ్రాములు కారం
 - 300 ml నీళ్ళు
 - 150 గ్రాములు బెల్లం తురుము
 - 3 వెల్లుల్లి పాయలు
 - 1 tsp మెంతులు
 - ఉప్పు తగినంత
 - 100 ml వేరుసెనగ నూనె
 
- 250 ml వేరుసెనగ నూనె
 - 1 tbsp ఆవాలు
 - 1 tbsp జీలకర్ర
 - 1 tbsp మినప పప్పు
 - 1 tbsp పచ్చి సెనగ పప్పు
 - 6 ఎండుమిరప కాయలు
 - ½ tsp ఇంగువ
 - 1 వెల్లుల్లి పాయ
 - 3 రెమ్మలు కరివేపాకు
 
- మామిడి అల్లం మీద స్కిన్ తీసేసి ఒకసారి త్వరగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 - బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి.
 - నాలుగు వెల్లుల్లి పాయల్ని తీసుకొని వాటి పై పొట్టు తీయాలి.3 వెల్లుల్లి పాయల రెబ్బల్ని పచ్చడి కోసం ఉంచాలి.
 - ఇంకొక వెల్లుల్లి పాయ రెబ్బల్ని తాలింపు కోసం పక్కన ఉంచుకోవాలి.
 - మెంతులను దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
 - చింతపండును 300 ml నీళ్ళలో వేసి పేస్ట్ లా అయ్యే వరకు ఉడికించి పొయ్యి కట్టేసి ఆరనివ్వాలి.
 
- ఒక పెనంలో 100 ml పల్లీ నూనె పోసి కాగనివ్వాలి.
 - నూనె వేడెక్కగానే అల్లం ముక్కలను వేసి 3 నుండి 5 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
 
- 3 వెల్లుల్లి పాయల రెబ్బల్ని మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 - ఉడికించి పెట్టుకున్న చింతపండును, తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
 - అదే పేస్ట్ లో వేయించిన అల్లం ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మెంతి పొడి, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.
 
- అల్లం ముక్కలు వేయించిన పెనంలోనే మళ్ళీ 250 నుండి 300 ml పల్లీ నూనె పోసి కాయాలి.
 - నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప పప్పు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
 - ½ tsp ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించి పచ్చడిలో వేసి బాగా కలపాలి.
 - పచ్చడిని శుభ్రమైన పొడి గా ఉన్న జాడీలో కి సర్ది జాగ్రత్తగా నిలవ చేయాలి.
 

Mamidi Allam Pachadi Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=qVSPa0ZSRjM[/embedyt]
Leave a Reply