Print
mamidi allam pachadi telugu recipe

Mamidi Allam Pachadi Telugu Recipe

Course Side Dish
Cuisine Andhra
Prep Time 1 hour
Cook Time 35 minutes
Total Time 1 hour 35 minutes
Author బిందు

Ingredients

పచ్చడి కొరకు

  • 250 లేదా ౩౦౦ గ్రాములు మామిడి అల్లం
  • 150 గ్రాములు చింతపండు
  • 150 గ్రాములు కారం
  • 300 ml నీళ్ళు
  • 150 గ్రాములు బెల్లం తురుము
  • 3 వెల్లుల్లి పాయలు
  • 1 tsp మెంతులు
  • ఉప్పు తగినంత
  • 100 ml వేరుసెనగ నూనె

తాలింపు

  • 250 ml వేరుసెనగ నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp మినప పప్పు
  • 1 tbsp పచ్చి సెనగ పప్పు
  • 6 ఎండుమిరప కాయలు
  • ½ tsp ఇంగువ
  • 1 వెల్లుల్లి పాయ
  • 3 రెమ్మలు కరివేపాకు

Instructions

ముందుగా తయారు చేసుకోవలసినవి

  1. మామిడి అల్లం మీద స్కిన్ తీసేసి ఒకసారి త్వరగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి.
  3. నాలుగు వెల్లుల్లి పాయల్ని తీసుకొని వాటి పై పొట్టు తీయాలి.3 వెల్లుల్లి పాయల రెబ్బల్ని పచ్చడి కోసం ఉంచాలి.
  4. ఇంకొక వెల్లుల్లి పాయ రెబ్బల్ని తాలింపు కోసం పక్కన ఉంచుకోవాలి.
  5. మెంతులను దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  6. చింతపండును 300 ml నీళ్ళలో వేసి పేస్ట్ లా అయ్యే వరకు ఉడికించి పొయ్యి కట్టేసి ఆరనివ్వాలి.

వేయించుట

  1. ఒక పెనంలో 100 ml పల్లీ నూనె పోసి కాగనివ్వాలి.
  2. నూనె వేడెక్కగానే అల్లం ముక్కలను వేసి 3 నుండి 5 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.

గ్రైన్డింగ్

  1. 3 వెల్లుల్లి పాయల రెబ్బల్ని మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఉడికించి పెట్టుకున్న చింతపండును, తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
  3. అదే పేస్ట్ లో వేయించిన అల్లం ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మెంతి పొడి, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.

తాలింపు

  1. అల్లం ముక్కలు వేయించిన పెనంలోనే మళ్ళీ 250 నుండి 300 ml పల్లీ నూనె పోసి కాయాలి.
  2. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప పప్పు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
  3. ½ tsp ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించి పచ్చడిలో వేసి బాగా కలపాలి.
  4. పచ్చడిని శుభ్రమైన పొడి గా ఉన్న జాడీలో కి సర్ది జాగ్రత్తగా నిలవ చేయాలి.