Site icon Maatamanti

when and How to take ACV||ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎప్పుడు ఎలా తీసుకోవాలి??

Apple Caidar vinegar

ఆపిల్ సైడర్ వెనిగర్ ఎప్పుడు ఎలా ఎంత తీసుకోవాలి ??

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఉపయోగాలేంటో నేను ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను. ఒకవేళ చదవక పోతే ఇక్కడ చదవండి.

మంచిది కదా అని ఏది పడితే అది వాడకుండా మంచి బ్రాండ్ వాడాలి. raw~ unfiltered , ఆర్గానిక్, unpasteurized మరియు  mother కలిగిన ది వాడాలి. ఇక్కడ mother అంటే ” ఆపిల్ సైడర్ వెనిగర్ లో మరీ క్లియర్/తేటగా కాకుండా లోపల కొద్దిగా పిప్పి లాంటిది ఉంటుంది. బాటిల్ ను ఊపితే అడుగుకు చేరి ఉన్న పిప్పి మొత్తం కదుల్తు కనిపిస్తుంది. ఇలాంటి ది వాడడం వల్ల నేను ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.

ఇది 5 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను BRAGG బ్రాండ్ ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నాను. అయితే

ఎప్పుడు తీసుకోవాలి?? ఉదయాన్నే బ్రష్ చేసుకున్నాక ఖాళీ కడుపుతో ఒకసారి తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్న భోజనానికి 10 నిమిషాల ముందు, రాత్రి భోజనానికి 10 నిమిషాల ముందు తీసుకోవాలి. కానీ రాత్రి ఆలస్యంగా అన్నం తింటున్నట్లయితే మాత్రం తీసుకోకూడదు. లేదా పడుకునే ముందు కూడా తీసుకోకూడదు.  7 గంటల లోపు తీసుకుంటే మంచిది. తినే ముందు తీసుకోవడం వల్ల జీర్ణ రసాలు సరిగ్గా ఉండి ఆహారం త్వరగా అరిగి పోతుంది. ఇంకా మనం తీసుకున్న ఆహారం లోని పోషకాలను శరీరం చక్కగా గ్రహిస్తుంది. మీరు సలాడ్స్ చేసుకుంటుంటే కనుక అందులో కూడా 1 tsp వేసుకోవచ్చు.

ఎంత తీసుకోవాలి?? తీసుకున్న ప్రతిసారీ 2 tsp లు తీసుకోవాలి.

ఎలా తీసుకోవాలి?? ACV ని ఎప్పుడూ నేరుగా తీసుకోకూడదు. 2 tsp ACV ని 250ml నీటిలో కలిపి తాగాలి. ఉట్టిగా తాగితే పళ్ళు మరియు అన్నవాహిక దెబ్బతినే ప్రమాదం ఉంది. ACV నీళ్లలోనే ఒక నిమ్మ కాయ రసం కూడా పిండుకుని తాగొచ్చు.

దీనిని తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా ? దీని వల్ల పళ్ళపై సహజంగా ఉండే enamel కోటింగ్ పోతుంది. అందువల్ల ఖచ్చితంగా నీళ్లతోనే కలిపి తాగాలి. నేరుగా అస్సలు తీసుకోకూడదు. కుదిరితే ఒక స్టీల్ straw కొనుక్కుని దానితో తాగడం మంచిది. లేదా పళ్ళకి అంటకుండా నేరుగా గొంతు లో పోసుకోవడం మంచిది.

నాకు తెలిసిన కొన్ని మంచి ఆపిల్ సైడర్ వెనిగర్ బ్రాండ్లు

Exit mobile version