Maatamanti

Ulavacharu-ఇంట్లోనే ఉలవచారు తాయారు చేసుకోవడం ఎలా?

Ulavacharu recipe in Telugu with step by step instructions.English Version.

“ఆంధ్ర మరియు హైదరాబాదులో ఉలవచారు అంటే తెలియని వారుండరు” అంటే అతిశయోక్తి కాదు.దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే.ఇది దాదాపుగా అన్ని స్వీట్ షాపుల్లో సులభంగా లభిస్తుంది.

ఆంధ్ర సైడ్ పల్లెటూర్లలో  ఉండే వారికి ఇది రోజు వారి వంటకాలలో ఒక భాగంగా ఉంటుంది.ఉలవలని పశుగ్రాసంగా వాడతారు.అందుకోసం వాటిని కొన్ని గంటల పాటు కట్టెల పొయ్యి మీద ఉడికిస్తారు.తర్వాత నీటి నుండి ఉలవలని  వేరు చేసి వాటిని కుడితిలో కలిపి పశువులకి పెడతారు.ఉలవ నీళ్ళని తమకి కావలసినంత ఉంచుకొని తక్కినవి ఇరుగు పొరుగు వారికి ఇస్తుంటారు.

ఈ మధ్య అన్ని హోటళ్ళలో ఉలవచారుతో తయారుచేసే వంటకాలు బాగా పాపులర్ అయ్యాయి.చికెన్,మటన్,రొయ్యలు,కీమా ఇలా అన్నింటిలో ఉలవచారు కలిపి వండేస్తున్నారు.ఉలవచారు బిర్యానీ అయితే బాగా పాపులర్.దాని రుచి మాటల్లో వర్ణించలేనిది.ఆంధ్రా వైపు అయితే ఉలవచారు వడ్డించని పెళ్లుండదు.

ఉలవచారులో ఉడకబెట్టిన గుడ్లు వేసి కూడా వండుకోవచ్చు.వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఉలవచారుని వడ్డిస్తే బాగుంటుంది.మీగడతో కలిపి వడ్డిస్తే ఆ రుచే వేరు.నేను దీన్ని తయారు చేయడం ఇదే మొదటి సారి.చాలా బాగా కుదిరింది.అసలయితే ఎప్పుడు స్వీట్ షాప్ లో కొంటూ ఉంటాను.నా Youtube subscribers లో ఒకరు అడగడం వల్ల దీన్ని తయారు చేశాను.

నేను దీన్ని తయారు చేయాలనుకున్నపుడు ఎలా చేయాలో తెలుసుకోవడానికి కొన్ని Youtube videos చూసాను.కానీ నాకు ఒక్కటి కూడా సరిగా అనిపించలేదు.కొందరైతే ఉలవలని పేస్టు చేసి నీళ్ళలో కలిపి చేసారు. ఉలవచారులో అలా ఉలవలని గుజ్జు చేసి కలపకూడదు.అలా చేస్తే అసలైన ఉలవచారు టేస్టుని మిస్సవుతారు.పైగా అది తొందరగా చద్ది వాసన వచ్చేస్తుంది.విజయవాడలో ఉండే మా పిన్నిని అడిగి ఉలవచారు recipe ఎలా చేయాలో తెలుసుకున్నాను.

దీని కోసం నేను 1 kg ఉలవలని తీసుకున్నాను.వాటిని శుభ్రంగా కడిగి, సుమారు ౩.2 లీటర్ల నీళ్ళలో రాత్రంతా నానబెట్టాను.తర్వాత నానబెట్టిన నీటితోనే వాటిని ఉడికిస్తే 800ml ఉలవ నీళ్ళు వచ్చాయి.వాటితో  సుమారు 400ml ఉలవచారు తయారయింది.

ఉలవలలో చాలా పోషక విలువలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకునేవారు ఉలవ కట్టు చేసుకుని తినవచ్చు.ఇది మూత్ర నాళాల్లో , కిడ్నిల్లో  ఏర్పడే రాళ్ళను నివారించడంలో సహకరిస్తుంది.ఉలవలని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి.

సమయం దొరికినపుడు మీరు కూడా ఈ ఉలవచారు recipe ని ట్రై చేసి చూడండి.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Udikinchina Kodigudla Vepudu Recipe in Telugu
schezwan Fried Rice Recipe in Telugu
Hyderabadi Mutton Dalcha recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Mamidikaya chicken vepudu Recipe in Telugu

Click here for the English Version of this Recipe.

5 from 1 vote
Ulavacharu Recipe
Prep Time
9 hrs
Cook Time
1 hr 30 mins
Total Time
10 hrs 30 mins
 

Authentic Andhra style Ulavacharu Recipe made with Horse gram.It goes well hot rice and fresh cream.

Course: Main Course
Cuisine: Andhra
Author: BINDU
Ingredients
  • 1 kg ఉలవలు
  • ౩.2 litres నీళ్ళు
  • ౩ లేదా 4 tsp చింతపండు గుజ్జు
  • తగినంత ఉప్పు
  • 1/2 tsp పసుపు
  • 1 1/2 tsp కారం
  • 1 మీడియం ఉల్లిపాయ
  • 2 పచ్చిమిరపకాయలు
  • 3 రెమ్మలు కరివేపాకు
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 3 tbsp నూనె
Instructions
ఉలవ నీళ్ల కోసం
  1. 1 kg ఉలవలని తీసుకొని రెండు మూడు సార్లు కడిగి తరువాత ౩.2 లీటర్ల నీటిలో వేసి  రాత్రంతా నానబెట్టాలి.

  2. మళ్ళి నీళ్ళు కలపకుండా నానబెట్టిన నీటిని అలాగే ఉంచి, ఉలవలని ప్రెషర్ కుకర్ లో ఒక గంట పాటు ఉడికించాలి.

  3. ఒక విజిల్ వచ్చేవరకు high flame మీద ఉడికించి,తరవాత సిమ్ లో పెట్టి ఉడికించాలి.మొత్తం ఒక గంటలో మొదటి విజిల్ రావడానికి పట్టిన టైముని తేసేయగా మిగిలిన టైముని సిమ్ మీద ఉడికించాలి.

  4. సిమ్ మీద ఉడుకుతున్నపుడు విజిల్స్ వచ్చినా రాకపోయినా పరవాలేదు.మీరు వాటి గురించి పట్టించుకోనవసరం లేదు.

  5. స్టవ్ కట్టేసాక ఆవిరి అంటా దానంతట అది పోయే వరకు కుక్కర్ లిడ్ తెరవకండి.

  6. కుక్కర్ మూత తెరిచి ఉలవలని జల్లెడ లో వేసి నీళ్లను వడకట్టండి.మీకు సుమారుగా 800 ml ఉలవ నీరు వస్తుంది.

ఉలవచారు తయారీ విధానం
  1. స్టవ్ మీద గిన్నె ఉంచి ౩ లేదా 4 tbsp నూనె వేసి వేడిచేయాలి.

  2. అందులో ఆవాలు,జీలకర్ర వేసి చిటపట లాడే వరకు వేయించాలి.

  3. తర్వాత ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి నిముషం పాటు వేయించాలి.

  4. ఉలవనీళ్ళు పోసి కలిపి,10 నుండి 15 నిముషాల పాటు high flame లో మరిగించాలి.

  5. తర్వాత చింతపండు గుజ్జు,ఉప్పు,కారం,పసుపు వేసి సన్నని సెగ మీద 10 నిమిషాలు కాయాలి.

  6. చారు చిక్కబడగానే స్టవ్ కట్టేయాలి.

Ulavacharu Recipe Video

Related Post

Please Share this post if you like