Maatamanti

Mutton Dalcha Telugu Recipe-హైదరాబాదీ మటన్ దాల్చా తయారీ

Mutton Dalcha Telugu recipe with step by step instructions.English Version

నేను ఆంధ్రా ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల మటన్ దాల్చా recipe గురించి అసలెప్పుడూ వినలేదు.మా అమ్మ కూడా ఈ వంటకాన్ని ఎప్పుడూ చేయలేదు.మా అత్తగారింటికొచ్చాకే మొదటిసారిగా ఈ పేరు విన్నాను.మా అత్తగారిది చాలా పెద్ద కుటుంబం.పైగా అందరూ దగ్గర దగ్గర ఊర్లలో ఉండడం వల్ల రెండు నెలలకి ఒకసారైనా మా అత్తగారింట్లో gather అయ్యేవారు.అంతమందికి వంట చేస్తూ కూర్చుంటే ఉన్న ఒక్క రోజు టైం వేస్ట్ అవుతుందని మా అత్తగారు క్యాటరర్ ని పిలిపించి ఇంట్లోనే వెనక వంట చేయించేవారు.నేనేమో వాళ్ళు ఎలా చేస్తారా అని ఆసక్తిగా గమనించేదాన్ని.అప్పుడే నేను ఫస్ట్ టైం మటన్ బిర్యానీ, మటన్ దాల్చా వండడం చూసాను.కానీ కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపించింది.

రుచి చూడగానే నాకు చాలా నచ్చింది.అప్పటి నుండి ఈ recipe కి నేను పెద్ద ఫ్యాన్ ని అయిపోయాను.మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు ఈ వంటకాన్ని తయారు చేస్తుంటాను.అసలైన మటన్ దాల్చా ఎలా తయారు చేస్తారో నాకు సరిగ్గా  తెలీదు కానీ నేను మాత్రం ఇలానే చేస్తాను.కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.మటన్ దాల్చా ని బగారా అన్నం తో గానీ, హైదరాబాదీ బిర్యానీ తో గానీ, రోటీలతో గానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.మీరు కుడా ఒక సారి ట్రై చేసి చూడండి.మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Nellore Fish Curry Recipe in Telugu
Mamidikaya Chicken fry in Telugu
Karivepaaku kodi Fry in Telugu
Natukodi Pulusu recipe in Telugu
Chicken Liver Vepudu Recipe in Telugu

Click here for the English Version of this recipe.

Mutton Dalcha Telugu Recipe -హైదరాబాదీ మటన్ దాల్చా
Prep Time
20 mins
Cook Time
1 hr
Total Time
1 hr 20 mins
 
Course: Main Course
Cuisine: Hyderabadi, Indian
Servings: 6
Author: బిందు
Ingredients
చింతపండు రసం కొరకు
  • 15 గ్రాములు చింతపండు
  • 500 ml నీళ్ళు
పప్పు కొరకు
  • ½ కప్పు పచ్చిశనగపప్పు
  • 4 అర కప్పులు నీళ్ళు
మటన్ కూర కొరకు
  • 250 గ్రాములు మటన్
  • 2 మీడియం ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1/8 tsp షాజీరా
  • 1 రెమ్మ పుదీనా ఆకులు
  • ¼ tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • తగినంత ఉప్పు
  • 1 tsp కారం
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 3 tbsp నూనె
  • 3 లవంగాలు
  • 2 యాలుకలు
  • ½ అంగుళం దాల్చిన చెక్క
దాల్చా కొరకు
  • 8 నుండి 10 చిన్న ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 మునక్కాడ
  • 8 సొరకాయ ముక్కలు పెద్దగా తరిగినవి
  • 1 టమాటో తరుగు
  • 1 క్యారెట్
  • 1 రెమ్మ పుదినా
  • ¼ కప్పు కొత్తిమీర
  • ¼ tsp పసుపు
  • 1 tsp కారం
  • తగినంత ఉప్పు
  • ½ tsp ధనియాల పొడి
  • 1/8 tsp షాజీరా
  • 1/8 tsp సోంపు
  • 3 tbsp నూనె
Instructions
చింతపండు రసం తయారీ విధానం
  1. చింతపండును ఒకసారి కడిగి అందులో 500 ml నీళ్ళు పోసి ఒక పావుగంట పాటు నానబెట్టాలి.
  2. తర్వాత ఒక జల్లెడ సహాయంతో రసం నుండి పిప్పిని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
పప్పు తయారు చేయుట
  1. పచ్చిశనగపప్పును ఒకటి రెండు సార్లు కడిగి ప్రెషర్ కుకర్ లో వేసి అంతకు పప్పు పరిమాణానికి నాలుగింతలు నీళ్ళు పోసి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి.
  2. ఆవిరి పూర్తిగా పోయే వరకు మూత తెరవకూడదు.
  3. తర్వాత మూత తెరచి పప్పును మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
మటన్ కర్రీ వండు విధానం
  1. ఒక ప్రెషర్ పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
  2. నూనె కాగాక, 3 లవంగాలు, 2 యాలుకలు, ½ అంగుళం దాల్చిన చెక్క వేయాలి.
  3. తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  4. శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను వేసి కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
  5. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు ఉడికించాలి.
  6. పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాలు మీడియం సెగ మీద వేయించాలి.
  7. తర్వాత 2 కప్పులు నీళ్ళు పోసి, షాజీరా ఇంకా పుదినా వేసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  8. ఆవిరంతా పోయే వరకు వదిలేసి తర్వాత మూత తెరవాలి.
మటన్ దాల్చా వండే విధానం
  1. ఒక గిన్నెలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, క్యారెట్ ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
  2. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.తరిగిన టమాటో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
  3. చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న పప్పు, పుదీనా, షాజీరా, సోంపు వేసి మరిగించాలి.
  4. మరగడం మొదలవగానే ముందే వండిన మటన్ కూర వేసి కలిపి నూనె అంచులకు తేలేవరకు ఉడికించాలి.
  5. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవాలి.

Mutton Dalcha Telugu Recipe Video

Related Post

Please Share this post if you like