Site icon Maatamanti

Bendakaya Tomato Curry Telugu Recipe

bendakaya tomato curry telugu recipe

Bendakaya Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version.

బెండకాయల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. విటమిన్ A, విటమిన్ C, మెగ్నీషియం, పీచు పదార్ధం ఉంటాయి. అందుకే వారానికొకసారన్నా బెండకాయల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మా ఆయనకి, అమ్మాయికి బెండకాయ తో చేసిన కూరలంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే కానీ వాటిని కడిగి కట్ చేయాలంటేనే కాస్త బెరుకుగా ఉంటుంది.

నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ గారు మా పెరట్లో ఉన్న బెండకాయలు కోసుకుని రమ్మన్నారు. కోస్తున్నప్పుడు ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించినా కోసేశాను. తర్వాత 5 నిమిషాలకి నా చేతులంతా దద్దుర్లు వచ్చేశాయి. ఒకటే దురద.నాకు భయం వేసింది. మా అమ్మ చేతులకి నూనె రాశారు. కాసేపటికి దద్దుర్లు తగ్గాయి.అందుకే నాకు ఇప్పటికి బెండకాయలు కడగాలన్నా, కట్ చేయలన్నా కాస్త బెరుకుగా ఉంటుంది.

బెండకాయ కూర సరిగ్గా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ముందు బెండకాయల్ని శుభ్రంగా కడగాలి. వాటి మీద చాలా మురికి ఇంకా పురుగు మందులు ఉంటాయి.అందుకే చాలా శుభ్రంగా కడగాలి.కడిగిన తర్వాత వాటిని ఒక పొడి క్లాత్ తో తడి లేకుండా తుడవాలి. తడి ఉంటే కూర వండేటప్పుడు బంక ఎక్కువగా వస్తుంది.తడి తుడిచాక ముక్కలుగా కట్ చేసుకుని ఫ్యాన్ క్రింద పరచి 1 గంట నుండి 2 గంటలు ఆరబెట్టాలి.

ఒక వేళ ఎండలో అయితే అరగంట ఉంచితే సరిపోతుంది.ఈ పనంతా పొద్దున్నే చేయాలంటే చాలా టైమ్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజు రాత్రే ఇవన్నీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు చాలా టైమ్ సేవ్ అవుతుంది.

కూర వండేటప్పుడు బంక రాకుండా కొద్దిగా(1 tbsp) పెరుగు కానీ మజ్జిగ కానీ వేయాలి.బెండకాయ కూరని ఊరికే గరిటెతో కలపకూడదు.ఎక్కువగా కలిపితే ముక్కలు విడిపోయి గింజలు బయటకు వచ్చి చూడడానికి బాగోదు.ఈ బెండకాయ టమాటో కూర అన్నం తో, రోటీ తో లేదా పుల్కా లతో తింటే బాగుంటుంది.మీరు కూడా ఈ రెసిపీ ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

French beans Tomato Curry Recipe in Telugu
Methi Paneer Recipe in Telugu
Palak Paneer Recipe in Telugu
Pachi Pulusu Recipe in Telugu
Dondakaya Fry Recipe in Telugu
Chamagadda Pulusu Recipe in Telugu
Homemade Ulavacharu Recipe in Telugu
Mulakkada Tomato Curry Recipe in Telugu

Click here for the English Version of this recipe.

Bendakaya Tomato Curry Telugu Recipe
Prep Time
25 mins
Cook Time
40 mins
Total Time
1 hr 5 mins
 
Course: Main Course
Cuisine: Andhra, Indian, South Indian
Servings: 4
Author: బిందు
Ingredients
  • 500 గ్రాములు బెండకాయలు
  • 250 గ్రాములు టమాటో ముక్కలు
  • 2 మీడియం ఉల్లిపాయల తరుగు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ¼ tsp పసుపు
  • 1 ½ tbsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • ఉప్పు తగినంత
  • ¼ కప్పు కొత్తిమీర
  • 6 లేదా 7 tbsp నూనె
Instructions
  1. ఒక కడాయి లో నూనె పోసి బెండకాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. కానీ గరిటెతో మాత్రం కలపకూడదు.అలా చేస్తే ముక్కలు విడిపోతాయి.
  2. వేయించిన ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
  3. కడాయి మళ్ళీ కొద్దిగా నూనె వేసి కాగినాక అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  4. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇంకా ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం వేయించాలి.
  5. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి మగ్గే వరకు ఉడికించాలి.
  6. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి జాగ్రత్తగా కలపాలి.
  7. కూర చిక్క బడే వరకు లేదా నూనె అంచులకు టెలి వరకు ఉద్కించాలి.
  8. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయాలి.

Bendakaya Tomato Curry Telugu Recipe Video

Exit mobile version