Go Back
Print
Recipe Image
Print
Andhra Chicken Fry Recipe - ఆంధ్రా చికెన్ వేపుడు
Course
Main Course
Cuisine
Andhra
Prep Time
30
minutes
Cook Time
30
minutes
Total Time
1
hour
Author
Bindu
Ingredients
500
గ్రాములు చికెన్
2
మీడియం ఉల్లిపాయల తరుగు
2
పచ్చిమిరపకాయలు
2
tsp
అల్లం వెల్లుల్లి ముద్ద
½
tsp
పసుపు
2 ½
tbsp
కారం
2
tsp
ధనియాల పొడి
ఉప్పు తగినంత
50
గ్రాములు పెరుగు
¼
కప్ కొత్తిమీర తరుగు
5
tbsp
నూనె
¼
కప్పు
నూనెలో వేయించిన జీడిపప్పు
Instructions
మారినేషన్ కొరకు
చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి ఒక 30 నిమిషాల నుండి గంట పాటు నానబెట్టాలి.
వేపుడు తయారీ విధానం
ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమరపకాయలు వేసి మగ్గే వరకు వేయించాలి.
తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
తర్వాత నానబెట్టిన చికెన్ వేసి ఒకసారి కలిపాలి.
మూత పెట్టి మీడియం సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
చికెన్ లో ఉన్న తడి మొత్తం ఆవిరైపోయేవరకు ఉడికించాలి.
ఎప్పుడైతే నూనె కూర నుండి విడిపోయినట్లుగా కనిపిస్తుందో అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 5 నిమిషాల పాటు ఎక్కువ సెగ మీద కలుపుతూ వేయించాలి.
కొత్తిమీర తరుగు వేసి పొయ్యి కట్టేసుకోవాలి.