Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Chicken Dosa Telugu Recipe
Course
Breakfast
Cuisine
Andhra, Hyderabadi, Indian
Prep Time
15
minutes
Cook Time
20
minutes
Total Time
35
minutes
Author
బిందు
Ingredients
చికెన్ ను ఉడికించుటకు
250
గ్రాములు
చికెన్ బోన్ లెస్
2
లీటర్లు
నీళ్ళు (చికెన్ ను ఉడికించుట కొరకు)
ఉప్పు తగినంత
4
లవంగాలు
4
ఏలకులు
2
దాల్చినచెక్కలు అంగుళం పొడవు
చికెన్ కూర కొరకు
2
మీడియం
ఉల్లిపాయల పేస్ట్
1
tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
2
పచ్చి మిరపకాయలు
¼
tsp
పసుపు
1 ½
tsp
కారం
2
మీడియం
టమాటోల గుజ్జు
1
tsp
ధనియాల పొడి
1
tsp
గరం మసాలా
½
కప్పు
నీళ్ళు
¼
tsp
పంచదార
¼
కప్పు
కొత్తిమీర తరుగు
చికెన్ దోశ కొరకు(ఒక్కో దోశ కొరకు)
2
గరిటెల
దోశెల పిండి
40
నుండి 50 గ్రాములు
చికెన్ కూర
1
గుడ్డు
30
గ్రాములు
ఛీజ్ తురుము(ఆప్షనల్)
2
రెమ్మలు
కొత్తిమీర
1
tbsp
నూనె
Instructions
చికెన్ ను ఉడికించుట
ఒక పాత్రలో రెండు లీటర్ల నీళ్ళు పోసి, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, ఉప్పు వేయాలి.
చికెన్ బ్రెస్ట్ లేదా థై ముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
స్టవ్ కట్టేసి చికెన్ ముక్కలను బయటకు తీసేయాలి.
కొద్ది సేపు ఆరనచ్చి వాటిని సన్నని స్ట్రిప్స్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
చికెన్ కూర తయారు చేయు విధానం
కడాయి లో నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
పసుపు, కారం వేసి కలపాలి.
టమాటో గుజ్జు వేసి కలిపి నూనె అంచులకు చేరే వేరే వరకు ఉడికించాలి.
ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
అర కప్పు నీళ్ళు పోసి మళ్ళీ కూర దగ్గర పడే వరకు వండాలి.
ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక సారి కలిపాలి.
౩ నుండి 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.
చికెన్ దోశె వేయుట
దోశె పెనం వేడి చేసి రెండు గరిటెల పిండి వేసి గుండ్రంగా పరవాలి.
దోశ పెనానికి కొద్దిగా అంటుకోగానే ఒక గుడ్డు పగల కొట్టి పైన వేయాలి.
చుట్టూరా నూనె వేసి గుడ్డు సొన దోశ కు అతుక్కునే వరకు ఆగాలి.
తర్వాత చికెన్ కూర, ఛీజ్, కొత్తిమీర వేసి దోశ ను మడవాలి.
ఛీజ్ కరిగే వరకు సన్నని సెగ మీద ఉంచి తీసేయాలి.