Cuisine
Andhra, Hyderabadi, South Indian, Telangana
Prep Time1hour30minutes
Cook Time30minutes
Total Time2hours
Servings1
Authorబిందు
Ingredients
చికెన్ మారినేషన్ కొరకు
300గ్రాములుచికెన్
3ఏలకులు
1అంగుళం దాల్చినచెక్క
3లవంగాలు
1/8ముక్క జాజికాయ
1అనాస పువ్వు
1మరాఠీ మొగ్గ
1జాపత్రి
ఉప్పు తగినంత
½tspపసుపు
2tspకారం
1tspధనియాల పొడి
1tspబిర్యానీ మసాలా
1 ½tspఅల్లం వెల్లుల్లి పేస్ట్
½చెక్క నిమ్మ రసం
¼కప్పువేయించిన ఉల్లిపాయలు
½కప్పుపెరుగు
¼కప్పుపుదీనా
¼కప్పుకొత్తిమీర
4 నుండి 5 tbsp నూనె
రైస్ మారినేషన్ కొరకు
1 ½కప్పుబాస్మతి బియ్యం( 1 కప్పు కొలత = 250 ml)
2 నుండి 3 tbsp నూనె
3ఏలకులు
1మరాఠీ మొగ్గ
1అంగుళం దాల్చిన చెక్క
3లవంగాలు
½జాపత్రి
1అనాస పువ్వు
1/8ముక్క జాజికాయ
ఉప్పు తగినంత
½tspకారం
½tspబిర్యానీ మసాలా
½tspఅల్లం వెల్లుల్లి పేస్ట్
½పసుపు
1మీడియంఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసినవి
3పచ్చి మిరపకాయలు
¼కప్పుపుదీనా
అసెంబ్లింగ్ కొరకు
1tbspనూనె
1 ¼కప్పునీళ్ళు
కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్
పచ్చి గా ఉన్న బొంగులు
Instructions
చికెన్ ను మారినేట్ చేయుట
శుభ్రంగా కడిగిన చికెన్ ను ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
అందులో పైన చెప్పిన గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం చెక్క నిమ్మ రసం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర, నూనె వేసి బాగా కలపాలి.
కలిపిన తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టాలి.
రైస్ ను మారినేట్ చేయుట
పచ్చి బాస్మతి బియ్యాన్ని కడగకుండా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
అందులో గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, నూనె, పుదీనా ఆకులు, నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి.
తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
అసెంబ్లింగ్
బొంగులను లోపల డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా కడగాలి.
తర్వాత లోపల కొద్దిగా నూనె వేసి అంతా అంటుకునేలా తిప్పాలి.
2 గరిటెల చికెన్ వేసి తర్వాత 2 మారినేట్ చేసి పెట్టుకున్న బియ్యం వేయాలి.మళ్ళీ చికెన్ దాని పైన రైస్ వేయాలి.
1 ¼ కప్పుల నీళ్ళు పోయాలి. ఆ నీరు లోపల ఉన్న సందుల గుండా క్రిందకు జారుతుంది.
బొంగు పైన భాగాన్ని అల్యూమినియం ఫాయిల్ తో గానీ ఆకులతో గానీ కవర్ చేయాలి.
బొంగులో బిర్యానీ చేయుట
కట్టె పుల్లలతో మంట పెట్టి దాని మీద ఈ బొంగులను 30 నుండి 35 నిమిషాల పాటు ఉంచాలి.
మంట మీద నుండి తీసేసి ఒక 5 నుండి 10 నిమిషాలు వదిలేయాలి.