Print
bamboo chicken biryani telugu recipe

Bamboo Chicken Biryani Telugu Recipe

Course Main Course
Cuisine Andhra, Hyderabadi, South Indian, Telangana
Prep Time 1 hour 30 minutes
Cook Time 30 minutes
Total Time 2 hours
Servings 1
Author బిందు

Ingredients

చికెన్ మారినేషన్ కొరకు

  • 300 గ్రాములు చికెన్
  • 3 ఏలకులు
  • 1 అంగుళం దాల్చినచెక్క
  • 3 లవంగాలు
  • 1/8 ముక్క జాజికాయ
  • 1 అనాస పువ్వు
  • 1 మరాఠీ మొగ్గ
  • 1 జాపత్రి
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 2 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp బిర్యానీ మసాలా
  • 1 ½ tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ½ చెక్క నిమ్మ రసం
  • ¼ కప్పు వేయించిన ఉల్లిపాయలు
  • ½ కప్పు పెరుగు
  • ¼ కప్పు పుదీనా
  • ¼ కప్పు కొత్తిమీర
  • 4 నుండి 5 tbsp నూనె

రైస్ మారినేషన్ కొరకు

  • 1 ½ కప్పు బాస్మతి బియ్యం( 1 కప్పు కొలత = 250 ml)
  • 2 నుండి 3 tbsp నూనె
  • 3 ఏలకులు
  • 1 మరాఠీ మొగ్గ
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 3 లవంగాలు
  • ½ జాపత్రి
  • 1 అనాస పువ్వు
  • 1/8 ముక్క జాజికాయ
  • ఉప్పు తగినంత
  • ½ tsp కారం
  • ½ tsp బిర్యానీ మసాలా
  • ½ tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ½ పసుపు
  • 1 మీడియం ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసినవి
  • 3 పచ్చి మిరపకాయలు
  • ¼ కప్పు పుదీనా

అసెంబ్లింగ్ కొరకు

  • 1 tbsp నూనె
  • 1 ¼ కప్పు నీళ్ళు
  • కవర్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్
  • పచ్చి గా ఉన్న బొంగులు

Instructions

చికెన్ ను మారినేట్ చేయుట

  1. శుభ్రంగా కడిగిన చికెన్ ను ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
  2. అందులో పైన చెప్పిన గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం చెక్క నిమ్మ రసం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర, నూనె వేసి బాగా కలపాలి.
  3. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టాలి.

రైస్ ను మారినేట్ చేయుట

  1. పచ్చి బాస్మతి బియ్యాన్ని కడగకుండా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
  2. అందులో గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, నూనె, పుదీనా ఆకులు, నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి.
  3. తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

అసెంబ్లింగ్

  1. బొంగులను లోపల డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా కడగాలి.
  2. తర్వాత లోపల కొద్దిగా నూనె వేసి అంతా అంటుకునేలా తిప్పాలి.
  3. 2 గరిటెల చికెన్ వేసి తర్వాత 2 మారినేట్ చేసి పెట్టుకున్న బియ్యం వేయాలి.మళ్ళీ చికెన్ దాని పైన రైస్ వేయాలి.
  4. 1 ¼ కప్పుల నీళ్ళు పోయాలి. ఆ నీరు లోపల ఉన్న సందుల గుండా క్రిందకు జారుతుంది.
  5. బొంగు పైన భాగాన్ని అల్యూమినియం ఫాయిల్ తో గానీ ఆకులతో గానీ కవర్ చేయాలి.

బొంగులో బిర్యానీ చేయుట

  1. కట్టె పుల్లలతో మంట పెట్టి దాని మీద ఈ బొంగులను 30 నుండి 35 నిమిషాల పాటు ఉంచాలి.
  2. మంట మీద నుండి తీసేసి ఒక 5 నుండి 10 నిమిషాలు వదిలేయాలి.
  3. తర్వాత వేడి వేడిగా అరిటాకులో వడ్డించాలి.