1 tbsp కార్న్ ఫ్లోర్ లో పావు లీటరు నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లి కాడ మొదలు తరుగు, క్యాప్సికం తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, వెనిగర్, డార్క్ సోయా సాస్ వేసి కలపాలి.
కార్న్ స్టార్చ్ కూడా వేసి బుడగలు వచ్చే వరకు ఉడికించాలి.
అందులో వేయించి పెట్టుకున్న వెజ్ బాల్స్ వేసి 3 నుండి 5 నిమిషాల పాటు లేదా మంచూరియన్ గ్రేవీ డ్రై అయ్యే వరకు వేయించాలి.
ఉల్లి కాడల తరుగు పైన చల్లి స్టవ్ కట్టేసి వేడిగా సర్వ్ చేయాలి.