PrintChamagadda Fry Telugu Recipe
 Prep Time 30 minutes
 Cook Time 10 minutes
 Total Time 40 minutes
ఉడికించుట కొరకు
-  250 గ్రాములు చేమగడ్డలు
-  నీళ్ళు తగినంత ఉడికించుటకు
మారినేషన్ కొరకు
-  ఉప్పు తగినంత
-  ½ tsp పసుపు
-  2 tsp కారం
-  2 tsp ధనియాల పొడి
-  1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
వేపుడు కొరకు
-  3 tbsp నూనె
-  ½ tsp ఆవాలు
-  ½ tsp జీలకర్ర
-  ½ tsp మినప పప్పు
-  1 ఎండు మిర్చి
-  1 రెమ్మ  కరివేపాకు
ఉడికించుట
- చేమగడ్డ లను మట్టి పోయే వరకు బాగా కడిగి ప్రెషర్ లోకి తీసుకోవాలి. 
- మునిగే వరకు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 
- సగం ఆవిరి పోయాక కుక్కర్ మూత తెరచి వేడి నీళ్ళు వంపేసి మామూలు నీళ్ళు పోయాలి. 
- చేమగడ్డ ల మీద పొట్టు తీసేసి గుండ్రని చక్రాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 
మారినేట్ చేయుట
- ఒక ప్లేట్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ బాగా కలపాలి. 
- తరవాత ఆ మసాలా మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలకు పట్టించి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 
వేయించుట
- ఒక బాణలిలో నూనె వేసి కాగి నాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి వేసి చిటపట లాడనివ్వాలి. 
- కరివేపాకు, పచ్చి మిరపకాయలు కూడా వేసి వేయించాలి. 
- తరవాత మసాలా పట్టించి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలను వేసి బాగా కలపాలి. 
- 5 నుండి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి పొయ్యి కట్టేయాలి.