Print
dondakaya fry telugu recipe

Dondakaya Fry Recipe

Course Main Course
Cuisine Andhra, Hyderabadi
Prep Time 15 minutes
Cook Time 30 minutes
Total Time 45 minutes
Servings 4
Author బిందు

Ingredients

మసాలా కొరకు

  • 4 ఎండుమిరపకాయలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 3 రెబ్బలు వెల్లుల్లి
  • 1 tsp జీలకర్ర
  • ¼ కప్పు పల్లీలు
  • 1/8 కప్పు కొబ్బరి పొడి

వేపుడు కొరకు

  • 400 గ్రాములు దొండకాయలు
  • ¼ కప్పు జీడిపప్పు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 tsp జీలకర్ర
  • ¼ tsp పసుపు
  • 1 ఎండుమిరపకాయ
  • 4 tbsp నూనె
  • ఉప్పు తగినంత

Instructions

శుభ్రం చేయుట

  1. దొండకాయలను శుభ్రంగా కడిగి నిలువు చీలికలుగా కానీ గుండ్రంగా కానీ కట్ చేయాలి.

వేపుడు మసాలా తయారీ

  1. పల్లీలను వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పెనంలో ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర లను కరకరలాడే వరకు వేయించాలి.
  3. అలా వేయించిన వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చా గా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  4. అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 2 నుండి 3 సెకెన్లు తిప్పి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.

దొండకాయ వేపుడు తయారీ

  1. ఒక బాణలిలో 4 tbsp నూనె వేసి కాగినాక అందులో జీడిపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి వేరే ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
  3. నిలువు చీలికలుగా కోసిన దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఆలివ్ గ్రీన్ రంగులోకి మారే వరకు వేయించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
  4. తర్వాత మూత తెరచి పసుపు, ఉప్పు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కరివేపాకు లను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.