Print
thotakura pesara pappu fry

Thotakura Pesara Pappu fry

Course Main Course
Cuisine Andhra
Prep Time 15 minutes
Cook Time 15 minutes
Total Time 30 minutes
Servings 4

Ingredients

  • 200 గ్రాములు తోటకూర
  • ¼ కప్పు లేదా 50 గ్రాములు పెసరపప్పు
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 1 ఎండుమిరపకాయ
  • 3 వెల్లుల్లి రెబ్బలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • ½ tsp పసుపు
  • 1 ½ tsp కారం
  • ఉప్పు తగినంత
  • నీళ్ళు సరిపడా

Instructions

శుభ్రం చేయుట & నానబెట్టుట

  1. తోటకూర లో మట్టి మరియు ఇసుక పోయే వరకు నీళ్ళలో జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
  2. తోటకూరను తరిగి పక్కన పెట్టుకోవాలి.
  3. పెసరపప్పు ను కడిగి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాలి.

ఉడికించుట

  1. ఒక మందపాటి పాత్రలో ఉడికించడానికి సరిపడా నీళ్ళు పోసి పెసరపప్పు కూడా వేసి మరిగించాలి.
  2. పెసరపప్పు పూర్తిగా ఉడికాక తరిగి ఉంచుకున్న తోటకూర కూడా వేసి కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉడికించి పొయ్యి కట్టేయాలి.
  3. వెంటనే నీళ్ళు వార్చేయాలి.

వేయించుట

  1. ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి చిటపట లాడేవరకు వేయించాలి.
  2. అందులో ఉడికించిన పెసరపప్పు & తోటకూర ను వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించి పొయ్యి కట్టేయాలి.