విత్తులేని ఖర్జురాలను, ఎండు అంజీర ను చిన్నగా తరిగి వేరేగా పక్కన పెట్టుకోవాలి.
బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు లను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి.
ఏలకులు మరియు జాజికాయను కలిపి పొడి కొట్టాలి.
తర్వాత తరిగి పెట్టుకున్న ఖర్జూర మరియు అంజీర ముక్కలను మిక్సీలో వేసి కచ్చాపచ్చా గ రుబ్బాలి.
ఒక బాణలిలో నెయ్యి వేసి అది కరిగాక అందులో జీడి పప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు, ఎండు ద్రాక్షలను వేసి దోరగా వేయించాలి.
ఖర్జూర & అంజీర పేస్ట్ మరియు జాజికాయ & ఏలకుల పొడిని కూడా వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి.
ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచి కాసేపు ఆరనిచ్చి సమన భాగాలుగా చేయాలి.
చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టాలి.