- ఒక పాత్రలో నూనె మరియు నెయ్యి వేసి వేడి చేయాలి. 
- అందులో బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, ఏలకులు, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. 
- సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి మెత్తబడే వరకు వేయించాలి. 
- అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. 
- టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. 
- తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఏలకులు మరియు సోంపు పొడి, పలావు మసలా వేసి బాగా కలపాలి. 
- మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు, కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి 15 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.