Print
nalla senaga guggillu

Senaga Guggillu Telugu Recipe

Course Appetizer, Snack
Cuisine Andhra, South Indian
Cook Time 35 minutes
Author బిందు

Ingredients

ఉడికించుట కొరకు

  • ½ కప్పు నల్ల సెనగలు
  • 750 ml నీళ్ళు సుమారుగా
  • ఉప్పు తగినంత

తాలింపు కొరకు

  • 1 tbsp నూనె
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 1 ఎండు మిరపకాయ
  • 1 రెమ్మ కరివేపాకు
  • ¼ tsp పసుపు
  • ½ tsp కారం
  • 1 tbsp అల్లం తరుగు
  • 2 tbsp కొబ్బరి తురుము
  • 2 కాడలు కొత్తిమీర
  • 1 పచ్చిమిర్చి తరుగు

Instructions

సెనగలను ఉడికించుట

  1. నల్ల సెనగలను రాత్రంతా నానబెట్టాలి.
  2. పొద్దున్నే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకోవాలి.
  3. కుక్కర్లో పప్పు మునిగే వరకు నీళ్ళు పోయాలి.
  4. నీళ్ళు ఉప్పగా అనిపించేంత ఉప్పు వేయాలి.
  5. కుక్కర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

తాలింపు పెట్టుట

  1. ఒక పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
  2. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
  3. అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, కారం, కొబ్బరి తురుము వేసి కలిపి ఓ నిమిషం పాటు తిప్పాలి.
  4. కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేసుకోవాలి.