Print
chinese egg noodles telugu recipe

Chinese Egg Noodles Telugu Recipe

Course Appetizer, Breakfast, Snack
Cuisine Chinese
Prep Time 20 minutes
Cook Time 15 minutes
Total Time 35 minutes
Servings 4
Author బిందు

Ingredients

  • 250 గ్రాములు ప్లెయిన్ నూడుల్స్
  • 1 కాప్సికం
  • 3 గుడ్లు
  • 1 కప్పు క్యాబేజీ తురుము
  • 1 tbsp డార్క్ సోయా సాస్
  • 1 tbsp వినెగర్
  • ½ tsp కారం
  • ¼ or ½ tsp మిరియాల పొడి
  • 4 tbsp నూనె
  • ¼ or ½ tsp సాల్ట్

Instructions

నూడుల్స్ ను ఉడికించుట

  1. ఒక మందపాటి గిన్నెలో నీళ్ళు పోసి మరిగేవరకు కాయాలి.
  2. నీళ్ళు మరగడం మొదలవ్వగానే ఉప్పు వేయాలి.రుచి చుస్తే నీళ్ళు ఉప్పగా అనిపించాలి.
  3. నూడుల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా కొద్దిగా నూనె కూడా మరుగుతున్న నీళ్ళలో వేయాలి.
  4. తరవాత నూడుల్స్ ను వేసి 3 నుండి 4 నిమిషాలు మరిగించాలి.
  5. 3 లేదా 4 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వడకట్టేయాలి.
  6. నూడుల్స్ ను రన్నింగ్ వాటర్ టాప్ కింద ఒక నిమిషం ఉంచి తీసేయాలి.ఇలా చేయడం వల్ల నూడుల్స్ వేడికి పూర్తిగా ఉడకకుండా ఉంటాయి.

చైనీస్ నూడుల్స్ తయారీ

  1. ఒక లోతైన మందపాటి కడాయి లో 4 tbsp ల నూనె వేడి చేయాలి.
  2. నూనె కాగాక గుడ్లు పగులకొట్టి వేయాలి.
  3. అది ఆమ్లెట్ లా మారాక అట్లకాడతో కొడుతూ ముక్కలుగా చేయాలి.
  4. తర్వాత క్యాబేజీ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల్ పాటు వేయించాలి.
  5. కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలపాలి.
  6. డార్క్ సోయా సాస్, వినెగర్ కూడా వేసి పెద్ద మంట మీద వేయించాలి.
  7. ఉడికించిన నూడుల్స్ కూడా వేసి బాగా కలపాలి.
  8. అన్ని పదార్ధాలు నూడుల్స్ తో కలిసిపోయేలా చక్కగా పెద్ద మంట మీద సెగ వచ్చేలా తిప్పాలి.
  9. స్టవ్ కట్టేసి కొద్దిగా ఉల్లిపాయలు, నిమ్మచెక్క తో వేడిగా సర్వ్ చేయాలి.