Print
chicken biryani telugu recipe

Chicken Biryani Telugu Recipe

Course Main Course
Cuisine Hyderabadi, Telangana
Prep Time 2 hours
Cook Time 30 minutes
Total Time 2 hours 30 minutes
Servings 4
Author బిందు

Ingredients

బిర్యానీ మసాలా కొరకు

  • 1 అంగుళాల దాల్చిన చెక్కలను , 2 ముక్కలు
  • 6 లేదా 7 లవంగాలు
  • 5 నుండి 6 యాలుకలు
  • 1 tsp షాజీరా
  • 1/4 ముక్క జాజికాయ
  • 1 అనాస పువ్వు
  • 3 గ్రాముల బిర్యానీ కా ఫూల్
  • 3 మరాఠీ మొగ్గు చిన్నవి
  • 1 ముక్క జాపత్రి

మారినేషన్ కొరకు

  • 750 గ్రాములు చికెన్ , బిర్యానీ కట్
  • 1/2 tsp పసుపు పొడి
  • ఉప్పు రుచికి సరిపడా
  • 2 నుండి 3 tsp కారం
  • 1 tbsp పచ్చిమిర్చి ముద్ద
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • పుదీనా ఆకులు , గుప్పెడు
  • 3 మీడియం ఉల్లిపాయలు , చాలా సన్నగా నిలువుగా తరిగిన ముక్కలు
  • 200 గ్రాముల గడ్డ పెరుగు
  • 1 నిమ్మకాయ
  • 6 tbsp నూనె , కాచినది
  • 2 లేదా 3 tbsp నెయ్యి

అన్నం కొరకు

  • 800 గ్రాముల బాస్మతి బియ్యం
  • నీళ్ళు
  • అన్ని మసాలా దినుసులు నేను పైన చెప్పినవన్నీ

Instructions

బియ్యం నానబెట్టుట

  1. బాస్మతి బియ్యంలో నీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టాలి.
  2. వందే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.

బిర్యానీ మసాలా తయారీ విధానం

  1. దాల్చినచెక్క, లవంగాలు, యాలుకలు, షాజీరా, జాజికాయ, అనాసపువ్వు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గలు, జాపత్రి, అనాస పువ్వు అన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. 750 గ్రాముల చికెన్ కొరకు 1 ½ నుండి 2 tsp ల బిర్యానీ మసాలా వాడితే సరిపోతుంది.

ఉల్లిపాయలను వేయించుట

  1. ఉల్లిపాయలను చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి.
  2. డీప్ ఫ్రై కి సరిపడా నూనె కాచి, ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి లేత గోధుమరంగు లోకి మారేవరకు వేయించాలి.
  3. బయటకు తీసేటప్పుడు గరిటెతో నూనె ను గట్టిగా వత్తేసి పక్కన పెట్టుకోవాలి.అలా చేస్తే వేయించిన ఉల్లిపాయలు కర కర లాడతాయి.

మారినేషన్ చేయు విధానం

  1. శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, 2 tsp బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మ రసం, పెరుగు, పచ్చి మిర్చి పేస్ట్, పుదీనా ఆకులు వేసి బాగా ముక్కలకు పట్టేలా కలపాలి.
  2. చికెన్ ముక్కలను కనీసం 1 నుండి 2 గంటల పాటు నాననివ్వాలి.

అన్నం వండుట

  1. ఒక మందపాటి గిన్నెలో నీళ్ళు పోసి, అందులో తగినంత ఉప్పు, అన్ని మసాలా దినుసులు, కొద్దిగా పుదీనా ఆకులు, బిర్యానీ ఆకు వేసి మరిగించాలి.
  2. నీళ్ళు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.అప్పుడు మళ్ళీ మరిగించాలి.
  3. మళ్ళీ మరగడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వార్చేయాలి.

బిర్యానీ వండుట

  1. బిర్యానీ పాత్ర అంచులకు నూనె రాసి, 5 నుండి 6 tbsp ల కాచిన నూనె, 2 tbsp ల నెయ్యి వేయాలి.
  2. అందులో నానబెట్టిన చికెన్ వేసి పైన సగం ఉడికించిన అన్నం వేయాలి.అన్నం పైన కొన్ని పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
  3. అల్ల్యుమినియం ఫాయిల్ లేదా తడి బట్ట తో బిర్యానీ పాత్రని సరిగ్గా కవర్ చేయాలి.పైన మూత పెట్టి, ఏదైనా బరువు పెట్టాలి.
  4. 12 నుండి 15 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించి 5 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించాలి.
  5. పొయ్యి కట్టేసి కాసేపు మూత తెరవకుండా వదిలేసి తర్వాత సర్వ్ చేయాలి.