Print
Veg Haleem

Hyderabadi veg haleem recipe

Course Appetizer, Snack
Cuisine Hyderabadi, Indian
Prep Time 30 minutes
Cook Time 30 minutes
Total Time 1 hour

Ingredients

హలీం మిక్స్ కోసం

  • 1/3 కప్పు సన్న గోధుమ రవ్వ
  • ¼ కప్పు ఓట్స్
  • ½ tbsp కందిపప్పు
  • ½ tbsp పచ్చిశనగపప్పు
  • 6 బాదం పప్పులు
  • 6 జీడి పప్పులు
  • 6 పిస్తా పప్పులు
  • ¼ కప్పు ఎండు గులాబీ రెక్కలు
  • 6 లవంగాలు
  • 6 యాలుకలు
  • 1 tbsp మిరియాలు
  • 2 inch దాల్చినచెక్క
  • ½ tsp షాజీరా
  • ½ tsp జీలకర్ర
  • 500 ml నీళ్ళు

సోయా గ్రాన్యూల్స్ ని మరిగించుటకు

  • ½ కప్పు సోయా గ్రాన్యూల్స్
  • 1 ½ కప్పు నీళ్ళు
  • ఉప్పు తగినంత

హలీం తయారీ కొరకు

  • ½ కప్పు కొత్తిమీర తరుగు
  • ½ కప్పు పుదీనా
  • 1/3 కప్పు వేయించిన ఉల్లిపాయలు
  • 5 పచ్చిమిరపకాయలు
  • 1 tbsp అల్లంవెల్లుల్లి ముద్ద
  • ½ కప్పు నెయ్యి
  • 1 tbsp కిస్‌మిస్
  • 1 tbsp గరమ్ మసాలా దినుసులు అన్నీ కలిపి
  • ఉప్పు సరిపడా

సర్వింగ్ కొరకు

  • 1 tbsp నెయ్యి
  • ¼ కప్పు వేయించిన జీడిపప్పు
  • ¼ కప్పు వేయించిన ఉల్లిపాయలు
  • ¼ కప్పు పుదీనా
  • ¼ కప్పు కొత్తిమీర
  • 1 నిమ్మకాయ

Instructions

హలీం మిక్స్ తయారీ కొరకు.

  1. గోధుమ రవ్వ, ఓట్స్, కందిపప్పు, పచ్చిశనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, మిరియాలు, షాజీరా, జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.
  2. ఆ పొడిలో అర లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి.
  3. సోయా గ్రాన్యూల్స్ ని ఉడికించుట.
  4. ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్ వేసి రెండు మూడు సార్లు కడగాలి.తర్వాత అందులో నీళ్ళు పోసి 3 నిమిషాల పాటు మరిగించాలి.
  5. తర్వాత నీళ్ళు ఓంపేసి రన్నింగ్ టాప్ కింద పెట్టి సోయా గ్రాన్యుల్స్ ని బాగా కడగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.

హలీమ్ తయారు చేయుట.

  1. ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి కరిగించాలి.
  2. అందులో 4 లవంగాలు, యాలుకలు, కిస్‌మిస్, దాల్చినచెక్క, మిరియాలు వేసి ఒక నిమిషం వేయించాలి.
  3. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి.
  4. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న హలీం మిక్స్ ను అందులో పోయాలి.
  5. ½ లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి ఉప్పు సరిచూసుకోవాలి.
  6. పుదీనా మరియు కొత్తిమీర వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ కట్టేసుకోవాలి.

సర్వింగ్.

  1. ఒక ప్లేటులో 2 నుండి 3 గరిటెల హలీమ్ వేసి అందులో 1 tbsp నెయ్యి వేయాలి.
  2. పైన వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, నిమ్మ చెక్క ఉంచి వేడిగా సర్వ్ చేయాలి.