Print
masala vadalu

మసాలా వడలు

Course Appetizer, Snack
Cuisine Andhra, Hyderabadi, Telangana
Prep Time 4 hours 30 minutes
Cook Time 30 minutes
Total Time 5 hours
Author బిందు

Ingredients

నానబెట్టుట కొరకు

  • 200 గ్రాములు పచ్చిశనగ పప్పు
  • 1 litre నీళ్ళు

మసాలా కొరకు

  • 1 tsp సోంపు
  • 1 tsp జీలకర్ర
  • 1 అంగుళం దాల్చినచెక్క
  • 2 ఎండుమిరపకాయలు

పిండి తయారీ కొరకు

  • 1 చిన్న ఉల్లిపాయ
  • 1 రెమ్మ కరివేపాకు
  • 2 పచ్చిమిరపకాయలు
  • ½ tsp అల్లం తరుగు
  • ¼ కొత్తిమీర తరుగు
  • 3 రెమ్మలు పుదీనా
  • 1 tsp ఉప్పు

వేయించుట కొరకు

  • 5 tbsp నూనె

Instructions

పప్పు నానబెట్టుట

  1. పచ్చిశనగ పప్పు ను 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి.
  2. తరువాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.

వడ మసాలా తయారీ విధానం

  1. సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాల్చినచెక్క లను మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

వడ పిండి తయారీ విధానం

  1. నానబెట్టిన పప్పును మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  2. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, జీలకర్ర, ఉప్పు, వడ మసాలా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

మసాలా వడ తయారీ విధానం

  1. ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
  2. కొద్దిగా నూనెను అరచేతికి రాసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద నిమ్మకాయ పరిమాణంలో పిండిని తీసుకొని గుండ్రంగా వడలా తట్టి నూనెలో జారవిడవాలి.
  3. మరీ పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వడలు చక్కని బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించాలి.
  4. వేయించిన వడలను పేపర్ టవల్ మీదకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.ఇలాగే పిండి అంతా అయిపోయే వరకు వేయించుకోవాలి.