Print
nellore chepala pulusu recipe

నెల్లూరు చేపల పులుసు-Nellore Chepala Pulusu Recipe

Ingredients

చేపలను మారినేట్ చేయుట కొరకు

  • 700 గ్రాములు చేప ముక్కలు
  • 1 tbsp ఉప్పు
  • 1 tsp పసుపు
  • 3 tsp కారం
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp ధనియాల పొడి

చింతపండు రసం కొరకు

  • 30 గ్రాములు చింతపండు
  • 200 ml నీళ్ళు

మసాలా కొరకు

  • ¼ tsp మెంతులు
  • ½ జీలకర్ర
  • ½ ఆవాలు

కావాల్సిన కూరగాయలు

  • 1 పచ్చి మామిడికాయ పుల్లనిది
  • 2 మీడియం ఉల్లిపాయలు
  • 3 పచ్చిమిరపకాయలు
  • 2 రెమ్మలు కరివేపాకు
  • 1 మీడియం టమాటో

కూర కొరకు

  • ½ tsp పసుపు
  • 2 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ¼ కప్పు ఉల్లి కాడ తరుగు
  • ¼ కప్పు కొత్తిమీర
  • 1/3 కప్పు నూనె

Instructions

చింతపండు నానబెట్టుట.

  1. ఒక గిన్నెలో 30 లేదా 35 గ్రాముల చింతపండు తీసుకొని అందులో 200 ml నీళ్ళు పోసి ఒక పావుగంట పాటు నానబెట్టాలి.

చేప ముక్కలను మారినేట్ చేయుట.

  1. శుభ్రంగా కడిగిన చేప ముక్కలలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి పావుగంట నానబెట్టాలి.

కూరగాయలను తరుగుట.

  1. మామిడి కాయను శుభ్రంగా కడిగి అంగుళం వెడల్పు క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ, టమాటాలను తరిగి పక్కన పెట్టుకోవాలి.పచ్చిమిర్చిని నిలువు చీలికలుగా కట్ చేసుకోవాలి.

మసాలా తయారీ.

  1. ఒక చిన్న పెనంలో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి చక్కని సువాసన వచ్చే వరకు వేపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

చేపల కూర తయారీ.

  1. చేపల చెట్టి లో నూనె పోసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  2. అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. పసుపు, కారం, ధనియాల పొడి, మెంతులు&జీలకర్ర&ఆవాలు పొడి వేసి కలపాలి.
  4. మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  5. మూత తెరచి, చింతపండు పులుసు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి.
  6. అందులో 500 ml నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  7. పులుసు మరగడం మొదలవ గానే అందులో చేప ముక్కలు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
  8. ఉల్లికాడ తరుగు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి.