Print
mango chicken fry recipe

Mango Chicken Fry Recipe - పచ్చి మామిడికాయ చికెన్ ఫ్రై

Course Main Course
Cuisine Andhra, Hyderabadi, Telangana
Prep Time 20 minutes
Cook Time 35 minutes
Total Time 55 minutes
Author బిందు

Ingredients

మసాలా కొరకు

  • 1 tbsp ధనియాలు
  • 3 లవంగాలు
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 3 యాలుకలు
  • 1/2 tsp సోంపు
  • 1 tsp గసగసాలు
  • 5 జీడిపప్పులు

కూర కొరకు

  • 300 గ్రాములు చికెన్
  • 100 గ్రాములు పచ్చ్చి మామిడి తురుము (పుల్లని మామిడికాయ తీసుకోవాలి)
  • 1 మీడియం ఉల్లిపాయ
  • 7 పచ్చిమిరపకాయలు
  • ఉప్పు తగినంత
  • ½ tsp పసుపు
  • 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • 2 రెమ్మలు కరివేపాకు
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • 6 tbsp నూనె
  • 1 tsp గరం మసాలా దినుసులు

Instructions

మసాలా తయారీ

  1. ఒక చిన్న పెనంలో ధనియాలు, లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, సోంపు  వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

  2. తర్వాత అందులోనే గసగసాలు, జీడిపప్పు కూడా వేసి ఒక 15 సెకెన్ల పాటు వేపాలి.
  3. కాస్త చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.

కూర తయారీ విధానం

  1. ఉల్లిపాయ మరియు పచ్చిమరపకాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.
  2. ఒక పాత్రలో నూనె వేడిచేసి అందులో గరం మసాలా దినుసులు(లవంగాలు, చెక్క, యాలుకలు) వేసి కొద్దిగా వేగాగానే, ఉల్లిపాయ&పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.
  3. నూనె పేస్టు నుండి విడివడేవరకు వేయించి తరవాత పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  4. చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్యలో కూర అడుగంటకుండా కలుపుతుండాలి.
  5. 15 నిమిషాల తరవాత పచ్చి మామిడికాయ తురుము వేసి సరిగ్గా కలిపి సన్నని సెగ మీద 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి.
  6. తరవాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న మాసాలా పొడి వేసి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  7. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కూర దించేసుకోవాలి.