Print
onion murukulu recipe

Onion Murukulu Recipe లేదా ఉల్లిపాయ మురుకులు

Course Snack
Cuisine Andhra, Hyderabadi, Italian, Telangana
Prep Time 20 minutes
Cook Time 30 minutes
Total Time 50 minutes
Author బిందు

Ingredients

  • 2 కప్పులు బియ్యం పిండి
  • ½ కప్పు పొట్టు లేని మినుములు
  • 250 గ్రాములు ఉల్లిపాయ పేస్ట్
  • 40 గ్రాములు వెన్న
  • 2 tsp ఉప్పు
  • 1 tbsp కారం
  • 1 tbsp వాము
  • సరిపడా నీళ్ళు
  • డీప్ ఫ్రై కి సరిపడా నూనె

Instructions

  1. మినుముల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయల్ని కూడా మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి.
  3. ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం పిండి, మినప పిండి, తగినంత ఉప్పు, సోడా ఉప్పు, కారం, వాము, వెన్న వేసి కలపాలి.
  4. తరవాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలిపాలి.అవసరమైతే కొద్దిగా నీళ్ళు జల్లి కలపొచ్చు.కానీ పిండి మాత్రం గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి.
  5. పిండిలో తేమ పోకుండా ఉండడానికి పైన కొద్దిగా నూనె రాసి మూత పెట్టి ఉంచాలి.
  6. ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  7. నూనె కాగాక ఒక చిన్న పిండి ముద్ద వేసి చూడాలి.అది వెంటనే నూనె పైకి తేలితే నూనె సరిగ్గా కాగినట్లు లెక్క.
  8. మురుకుల గిద్దను పిండితో నింపి, గుండ్రంగా తిప్పుతూ నూనెలో ఒత్తుకోవాలి.
  9. రెండు వైపులా తిప్పుతూ చక్కని బంగారు వర్ణం లోకి వచ్చేవరకు వేయించుకొని పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.