Print
karivepaku chicken curry

కరివేపాకు కోడి కూర

Course Main Course
Cuisine Andhra, Hyderabadi
Prep Time 20 minutes
Cook Time 30 minutes
Total Time 50 minutes
Author బిందు

Ingredients

కరివేపాకు పేస్ట్ కొరకు

  • 15 కరివేపాకు రెమ్మలు
  • ¼ కప్ కొత్తిమీర తరుగు
  • ¼ కప్ జీడిపప్పు
  • 1 tbsp ధనియాలు
  • 3 tsp నూనె

మసాలా కొరకు

  • 3 లవంగాలు
  • 3 యాలుకలు
  • ½ అంగుళం దాల్చినచెక్క

కూర కొరకు

  • 750 గ్రాములు చికెన్
  • 2 మీడియం ఉల్లిపాయల తరుగు
  • 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • ఉప్పు తగినంత
  • ¼ tsp పసుపు
  • 1 ½ tsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • ¼ కప్ కొబ్బరి పాలు
  • 3 tbsp నూనె
  • ¼ కొత్తిమీర తరుగు

Instructions

కరివేపాకు పేస్ట్ తయారీ విధానం

  1. కరివేపాకుని శుభ్రంగా కడిగి, ఆకులు ఒలిచి పక్కన పెట్టుకోవాలి.


  2. ఒక పెనంలో నూనె వేసి వేడి చేసి అందులో జీడిపప్పు, ధనియాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత అదే పెనంలో కరివేపాకు, కొత్తిమీర వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి.
  4. వేయించిన అన్నింటిని మిక్సీ జారులోకి తీసుకొని, కొద్దిగా నీరు పోసి పేస్టులా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.

మసాలా తయారు చేయుట

  1. ఒక పెనంలో లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క వేసి ఒక నిమిషం పాటు వేయించి తర్వాత వాటిని పొడి కొట్టుకోవాలి.

కరివేపాకు కోడి కూర తయారీ విధానం

  1. ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి మగ్గే వరకు వేయించాలి.
  2. ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి మగ్గే వరకు వేయించాలి.
  3. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  4. పసుపు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. 
  5. చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మీడియం సెగ మీద ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
  6. తరవాత మూత తెరిచి ఒకసారి కలిపి కొబ్బరి పాలు, కరివేపాకు పేస్ట్ వేసి మళ్ళీ కలపాలి.
  7. 250 ml నీళ్ళు పోసి కలిపి కూర చిక్కబడేవరకు సన్నని సెగ మీద ఉడికించాలి.
  8. తరిగిన కొత్తిమీర వేసి కూర దించేసుకోవాలి.