Print
pandu mirapakaya pachadi recipe

Pandu Mirapakaya Pachadi Recipe -పండు మిరపకాయ పచ్చడి

Course Side Dish
Cuisine Andhra
Author బిందు

Ingredients

పచ్చడి కొరకు

  • 500 గ్రాములు పండుమిరపకాయలు
  • 150 గ్రాములు చింతపండు
  • ఉప్పు రుచికి సరిపడినంత
  • 1 tbsp పసుపు
  • 1 tsp వేయించిన మెంతులు
  • 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు

తాలింపు కొరకు

  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 1 tsp పచ్చిశనగపప్పు
  • 1 tsp మినపపప్పు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 4 tsp నూనె

Instructions

పండుమిరపకాయల్ని శుభ్రం చేయుట

  1. ముందుగా మిర్చిలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తుడవాలి.

  2. తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో పెట్టాలి.ఎండ లేకపోతే సీలింగ్ ఫ్యాన్ కింద అయినా పెట్టి ఆరనివ్వాలి.

  3. ఆరాక తొడిమలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి.

చింతపండును సిద్దం చేయుట

  1. కొత్త చింతపండు తీసుకొని, అందులో గింజలు, పెంకులు, పీచు లాంటివి లేకుండా శుభ్రం చేయాలి.

  2. తర్వాత దానిని ఒక పొడిగా ఉన్న డబ్బాలో పెట్టాలి(స్టీలు డబ్బా వాడకూడదు).

మిర్చిలను గ్రైండ్ చేయుట

  1. మిరపకాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో ఉప్పు, పసుపులతో పాటు వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలి(మెత్తగా రుబ్బకూడదు).

  2. ఆ రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు మీద ఉంచి, డబ్బా మూత పెట్టి 2 నుండి 3 రోజుల పాటు నాననివ్వాలి.

  3. paపచ్చి మిర్చి గుజ్జులోని తడి వల్ల కింద ఉన్న చింతపండు నానుతుంది.

పచ్చడి తయారీ

  1. మూడు రోజుల తర్వాత మూత తెరిచి, పైన ఉన్న మిర్చి గుజ్జు తీసి పక్కన పెట్టేసి, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

  2. అందులో పక్కన ఉంచుకున్న మిర్చి గుజ్జును, మెంతి పిండిని, అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసి ఒక 2 నుండి 3 సెకన్ల పాటు మిక్సీ తిప్పాలి.

  3. తయారైన పచ్చడిని జాడీ లో ఉంచి భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు పెట్టుకోవాలి.

పోపు పెట్టుట

  1. ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

    అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగలు, మిమునులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాదేవరకు వేయించి పచ్చట్లో వేసి బాగా కలపాలి.