Print
bounty chocolates

బౌంటి చాకొలేట్ తయారీ విధానం

Course Appetizer, Dessert
Cuisine Global
Prep Time 10 minutes
Cook Time 10 minutes
Total Time 20 minutes
Servings 10
Author బిందు

Ingredients

  • 200 గ్రాములు ఎండు కొబ్బరి పొడి
  • 200 గ్రాములు స్వీట్ కండెన్స్ డ్ మిల్క్
  • 1 tbsp పీనట్ బటర్
  • 125 గ్రాములు కాంపౌండ్ చాకొలేట్ లేదా చాకో చిప్స్

Instructions

బౌంటి మిక్స్చర్ తయారీ కొరకు

  1. ఒక గిన్నెలో ఎండు కొబ్బరి పొడి, కండెన్స్ డ్ మిల్క్ వేసి బాగా కలపాలి.
  2. ఆ మిశ్రమాన్ని సమాన భాగాలుగా చేసి, బౌంటి బార్స్ ఆకారంలో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. కొంత మిశ్రమాన్ని పక్కన ఉంచి అందులో పీనట్ బటర్ వేసి కలుపుకుంటే ఇంకో వెరైటీ తయారు అవుతుంది.

చాకొలేట్ ను కరిగించుట

  1. చాకో బార్ ను సన్నగా తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  2. ఆ గిన్నెను కాగుతున్న నీరు ఉన్న గిన్నె మీద ఉంచి మెల్లగా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
  3. చాకొలేట్ ఉన్న గిన్నె అడుగు భాగం కింద ఉన్న నీటికి తగలకుండా జాగ్రత్త పడాలి.
  4. చాకొలేట్ ను కరిగించి పక్కన పెట్టుకోవాలి.

చాకొలేట్ తయారీ

  1. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండుకొబ్బరి, కండెన్స్ డ్ మిల్క్ మిశ్రమాన్ని ఫోర్క్ సహాయంతో కరిగించిన చాకొలేట్ లో ముంచి ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకోవాలి.
  2. ఇలా అన్నింటిని చేసిన తరువాత ఫ్రిజ్ లో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచితే చాకొలేట్ లు గట్టిబడతాయి.
  3. తరవాత కూడా ఫ్రిజ్ లోనే ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు.