Print
Chicken Liver Fry Recipe

Chicken Liver fry Recipe -చికెన్ లివర్ ఫ్రై

Course Main Course
Cuisine Andhra, Indian
Prep Time 15 minutes
Cook Time 25 minutes
Total Time 40 minutes
Servings 4

Ingredients

  • 200 గ్రాములు చికెన్ లివర్
  • 2 మీడియం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
  • 4 పచ్చిమిరపకాయలు
  • ¼ tsp పసుపు
  • 3 tsp కారం
  • 3 tsp ధనియాల పొడి
  • 1 tsp గరం మసాలా
  • 2 ½ tsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • 1 tsp ఉప్పు తగినంత
  • 3 రెమ్మలు కరివేపాకు
  • 6 tsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర

Instructions

  1. లివర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
  2. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మగ్గేవరకు వేయించాలి.
  3. పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.
  4. నానబెట్టిన లివర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.లేకపోతే అడుగంటుతుంది.
  5. మూత తెరచి అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా వేసి 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి.
  6. కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి దించేసుకోవాలి.