ముందుగా బిస్కెట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి
తర్వాత వాటిని మిక్సిలో వేసి పొడి చేసుకోవాలి
ఒక మిక్సింగ్ బౌల్ లో బిస్కెట్ పొడి, పాలు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్, నెయ్యి వేసి బాగా కలపాలి.
నెయ్యి పూసి ఉంచిన కేక్ టిన్ లో కలుపుకున్న పిండిలో సగం వేసి సమానంగా పరవాలి
మీకు నచ్చిన ఏదైనా ఫ్రూట్ క్రష్ గాని జామ్ కాని ఒక లేయర్ లా వేయాలి.
1/2 కప్పు చాకో ఫిల్స్ లో కొద్దిగా పాలు పోస్తే మెత్తబడతాయి.
వాటిని కూడా లేయర్ గా పెట్టుకోవాలి.
తర్వాత మిగిలిన బాటర్ ని కూడా వేసి సమానంగా ఉండేట్లుగా పరచుకోవాలి.
పైన చిన్నగా తురిమి పెట్టుకున్న నట్స్ ముక్కల్ని ఇంకా ముసెలి ని వేయాలి.
ఓవెన్ ను 180 °C వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి
కేక్ టిన్ ను లోపల ఉంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
టూత్ పిక్ తో కేక్ మధ్య భాగంలో గుచ్చి తీసినపుడు అది క్లీన్ గా బయటకు వస్తే కేక్ చక్కగా ఉడికినట్లు అర్ధం.లేకపోతే ఇంకాసేపు బేక్ చేసుకోవాలి.