పెనంలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయ ముక్కలు, బాగా శుభ్రంగా కడిగిన గోంగూర వేసి ఆకులు దగ్గర బడే వరకు వేయించాలి.
స్టవ్ కట్టేసి కాసేపు చల్లారనిచ్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో నూనె వేడి చేసి ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఎండుమిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
ఉడికించి పెట్టుకున్న కోడి గుడ్లు వేసి ఒక సారి కలిపి సన్నని సెగ మీద ౩ నుండు 5 నిమిషాలు వేయించాలి.
తర్వాత గోంగూర పేస్ట్ వేసి ఒక కప్పు నీళ్ళు కూడా పోసి బాగా కలపాలి.
కూర దగ్గర బడే వరకు లేదా నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ కట్టేసుకోవాలి.