Print
semiya bonda telugu recipe

Semiya Bonda Telugu Recipe


Course Breakfast, Snack
Cuisine Andhra, Hyderabadi, South Indian, Telangana
Prep Time 20 minutes
Cook Time 19 minutes
Total Time 39 minutes
Servings 4
Author BINDU

Ingredients

  • ½ కప్పు లేదా 50 గ్రాములు సేమియా
  • ¼ కప్పు లేదా 25 గ్రాములు మైదా పిండి
  • ¼ కప్పు పెరుగు
  • ఉప్పు తగినంత
  • ¼ కప్పు ఉల్లిపాయ తరుగు
  • 1 పచ్చి మిరపకాయ తరుగు
  • 1 tsp జీలకర్ర
  • ½ tsp మిరియాల పొడి
  • 1 tsp అల్లం తరుగు
  • ¼ కప్పు కొత్తిమీర
  • 1 tbsp కొబ్బరి పొడి
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

Instructions

ఉడికించుట

  1. మరుగుతున్న నీళ్ళలో సేమియా వేసి ఒక ౩ నిమిషాల పాటు ఉడికించాలి.
  2. తర్వాత వెంటనే ఒక జల్లెడతో నీటిని వడ కట్టేసి సేమియా పక్కన పెట్టుకోవాలి.

పిండి మిశ్రమాన్ని తయారు చేయుట

  1. ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన సేమియా, మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, కొబ్బరి పొడి, జీలకర్ర, అల్లం తరుగు, పెరుగు, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
  2. ఆ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాలు వదిలేయాలి.

డీప్ ఫ్రైయింగ్

  1. ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి.
  2. నూనె కాగ గానే మంటను మీడియం ఫ్లేమ్ కు తగ్గించాలి.
  3. చిన్న నిమ్మకాయంత పరిమాణంలో పిండిని తీసుకుంటూ నూనెలో వేయాలి.
  4. వేసిన వెంటనే కదప కుండా ఒక అర నిమిషం ఆగి తర్వాత కలుపుతూ చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.