క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఉప్పు వేసిన వేడి నీళ్ళలో వేసి 15 నిమిషాల పాటు ఉంచాలి.
తర్వాత ఆ నీటిని వంపేసి మళ్ళీ ఒకసారి కడగాలి.
ముక్కల్ని శుభ్రమైన బట్టతో తడి లేకుండా తుడిచి ఒక 30 నిమిషాల పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టి ఆరనివ్వాలి.
ఒక గిన్నెలో క్యాలిఫ్లవరు ముక్కల్ని వేసి అందులో కారం, పసుపు, ఉప్పు, మెంతి పిండి, వెల్లుల్లి ముద్ద, నిమ్మ రసం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి.
తర్వాత చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి నాలుగు సెకెన్ల పాటు వేయించి తీసేయాలి.
తాలింపులో పచ్చడిని కలిపి ఒక 2 నుండి 3 గంటల పాటు ఊరనివ్వాలి.