Punugulu or Bonda recipe made with Saggubiyyam or sabudana
సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.
1/3 కప్పు పెరుగుని ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టి 3/4 కప్పు నీళ్ళు పోసి మజ్జిగలా చేసుకోవాలి
కడిగిన సగ్గుబియ్యాన్ని మజ్జిగలో పోసి 30 నిమిషాలు నాననివ్వాలి
అరగంట తర్వాత సగ్గుబియ్యం మజ్జిగని పిల్చేసుకొని ఉబ్బినట్లుగా అవుతాయి.ఒకసారి కొద్దిగా గరిటెతో కదిపి చూడండి.మజ్జిగ కనుక ఇంకా మిగిలి ఉంటే దాన్ని వంపేయాలి.
సగ్గుబియ్యంలో మైదాపిండి, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, సోడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
ఈ పిండి పునుగులు పిండి మాదిరి ఉండలుగా జారవిడవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి.ఒక వేళ పిండి కనుక జారుగా అయితే కొద్దిగా మైదా పిండి కలిపి సరిచేసుకోవచ్చు.
బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి అది కాగాక, పునుగుల పిండిని చిన్న నిమ్మకాయలంతా పరిమాణంలో నూనెలో మెల్లగా జారవిడవాలి.
చక్కటి బంగారు రంగులోకి మారేవరకు వేయించి పేపర్ టవల్ లోకి తీసుకోవాలి
వేయించేటపుడు సగ్గుబియ్యం కొద్దిగా ఉబ్బినట్లయి పేలే అవకాశం ఉంది.కొంచెం జాగ్రత్తగా ఉండాలి.