Print
grape soda telugu recipe

Grape Soda Telugu Recipe

Course Drinks
Cuisine Global
Prep Time 5 minutes
Cook Time 20 minutes
Total Time 25 minutes
Author బిందు

Ingredients

ద్రాక్ష రసం కొరకు

  • 300 గ్రాములు ద్రాక్ష గింజలు లేనివి
  • 400 ml నీళ్ళు
  • ¼ కప్పు పంచదార
  • ½ చెక్క నిమ్మకాయ

గ్రేప్ సోడా కొరకు

  • 250 ml సోడా వాటర్
  • 6 నుండి 7 ఐస్ క్యూబ్స్
  • 1 రెమ్మ పుదీనా ఆకులు
  • 1 నిమ్మకాయ చక్రంలా కట్ చేసినది

Instructions

గ్రేప్ జ్యూస్ తయారీ

  1. సాస్ పాన్ లో నీళ్ళు పోసి, ద్రాక్ష పళ్ళు కూడా వేయాలి.
  2. మరిగే వరకు ఉడికించాలి.
  3. మరగడం మొదలవగానే పంచదార వేసి బాగా కలపాలి.
  4. పంచదార గడ్డ కట్ట కుండా ఉండేందుకు కొద్దిగా నిమ్మ రసం పిండాలి.
  5. 15 నుండి 20 నిమిషాలు ఉడికించాక పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లబడనివ్వాలి.
  6. తర్వాత ఆ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ చేసి ఒక తడిలేని శుభ్రమైన జార్ లో పోసి ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా తీసి ఉపయోగించవచ్చు.

గ్రేప్ సోడా తయారీ

  1. ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి అందులో కొద్దిగా లేదా మీ రుచికి తగ్గట్టుగా గ్రేప్ జ్యూస్ వేసుకోవాలి.
  2. సోడా నీళ్ళు పోసి నిమ్మ చెక్క కూడా వేయాలి.
  3. పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.