Print
white sauce pasta telugu recipe

White sauce pasta Telugu recipe

Course Breakfast, Snack
Cuisine Italian
Servings 3
Author BINDU

Ingredients

బాయిలింగ్ కొరకు

  • 1 కప్పు లేదా 100 గ్రాములు పెన్నే పాస్తా
  • 1 ½ లీటర్లు నీళ్ళు
  • ఉప్పు తగినంత
  • 1 tbsp నూనె

వేయించుట కొరకు

  • 2 లేదా 3 tsp నూనె
  • ¼ కప్పు స్వీట్ కార్న్
  • 50 గ్రాములు బ్రోకలి
  • ¼ కప్పు క్యారెట్ తురుము
  • ¼ కప్పు క్యాప్సికం

వైట్ సాస్ కొరకు

  • 50 గ్రాములు బటర్
  • 1 tbsp వెల్లుల్లి తురుము
  • 2 tbsp మైదా
  • 1 బిర్యానీ ఆకు
  • ½ ముక్క ఉల్లి
  • 3 లవంగాలు
  • 500 లేదా 600 ml పాలు
  • ఉప్పు తగినంత

పాస్తా కొరకు

  • ¼ tsp చిల్లీ ఫ్లేక్స్
  • ½ లేదా 1 tsp మిరియాల పొడి
  • ½ లేదా 1 tsp పాస్తా మిక్స్(seasoning)
  • 50 గ్రాములు ఛీజ్ తురుము(షెడార్/మోజ్జరెల్లా)

Instructions

పాస్తా ను బాయిల్ చేయుట

  1. ఒక గిన్నెలో సుమారు 1 ½ లీటర్ల నీళ్ళు పోసి మరిగించాలి.
  2. నీళ్ళు మరగడం మొదలవగానే అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఒకసారి కలపాలి.
  3. అందులో పెన్నే పాస్తా వేసి మరిగించాలి.
  4. పాస్తా సరిగ్గా ఉడకడానికి 10 నుండి 15 నిమిషాలు పడుతుంది.ఉడికాక సైజులో డబుల్ అవుతుంది.
  5. పాస్తా ఉడకగానే నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

కూరగాయలను వేయించుట

  1. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పైన చెప్పిన కూరగాయలన్నింటిని వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి.

వైట్ సాస్ తయారు చేయుట

  1. ఒక సాస్ పాన్ లో బటర్ వేసి కరిగించాలి.
  2. అందులో వెల్లుల్లి తురుము వేసి అర నిమిషం పాటు వేయించాలి.
  3. తర్వాత మైదా పిండి వేసి కలుపుతూ లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
  4. పాలు కొద్ది కొద్దిగా పోస్తూ మైదా పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
  5. ఉల్లిపాయ ముక్క పైన బిర్యానీ ఆకు ఉంచి దానిని లవంగాలతో గుచ్చి సాస్ పాన్ లో వేయాలి.
  6. సాస్ కొద్దిగా చిక్కబడే వరకు మెల్లగా గరిటెతో తిప్పుతుండాలి.
  7. సాస్ చిక్కబడగానే ఉల్లిపాయ తీసి పక్కన పెట్టేయాలి.
  8. తగినంత ఉప్పు వేస్తే వైట్ సాస్ రెడీ.

పాస్తా తయారీ

  1. తయారు చేసి పెట్టుకున్న సాస్ లో మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పాస్తా mix వేసి కలపాలి.
  2. ఛీజ్ తురుము వేసి కరికే వరకు కలపాలి.
  3. వేయించి పెట్టుకున్న కూరగాయలు, ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసి రెండు నిమిషాల పాటు సన్నని సెగ మీద అన్ని బాగా కలిసేలా కలపాలి.
  4. స్టవ్ కట్టేసి, పాస్తా ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా పాస్తా mix, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి.