Print
creamy tomato soup telugu recipe

Creamy Tomato Soup Telugu Recipe

Course Appetizer
Cuisine Global
Prep Time 10 minutes
Cook Time 30 minutes
Total Time 40 minutes
Servings 4
Author బిందు

Ingredients

  • 350 గ్రాములు టమాటాలు
  • 1 మీడియం ఉల్లిపాయ
  • ¼ కప్పు క్రీమ్
  • 1 tbsp కార్న్ ఫ్లోర్
  • 4 స్లైసులు బ్రెడ్
  • 50 గ్రాములు వెన్న
  • 1 tbsp వెల్లుల్లి తరుగు
  • 1 బిర్యానీ ఆకు
  • ఉప్పు తగినంత
  • మిరియాల పొడి రుచికి సరిపడా
  • 300 ml నీళ్ళు

Instructions

బ్లాన్చింగ్

  1. టమాటో లను శుభ్రంగా కడిగి పైన క్రాస్ గా నాలుగు గాట్లు పెట్టాలి.(ఎక్కువ లోతుగా పెట్టకూడదు).
  2. మరుగుతున్న నీటిలో టమాటాలు, తోలు తీసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి 2 నుండి 3 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ కట్టేయాలి.
  3. టమాటా ఇంకా ఉల్లిపాయ లను వెంటనే చల్లని నీళ్ళలో వేయాలి.

బ్లెండింగ్

  1. టమాటో మీద తొక్క తీసేసి ఉల్లిపాయ ఇంకా టమాటాలను తరిగి పక్కన పెట్టుకోవాలి.
  2. వాటిని మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి.

ఫ్రయింగ్

  1. బ్రెడ్ ను సన్నని స్లైసెస్ గా కట్ చేసి బటర్ లో కర కరలాడే వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

సూప్ తయారు చేయుట

  1. ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో 100 ml నీళ్ళు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. సాస్ పాన్ లో వెన్న కరిగించి అందులో బిర్యానీ ఆకు, వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి కలపాలి.
  4. 300 ml నీళ్ళు పోసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు మరగనివ్వాలి.
  5. మూత తెరిచి ఒక సారి కలిపి, కార్న్ స్టార్చ్ ఇంకా క్రీమ్ వేసి బాగా కలపాలి.
  6. తగినంత ఉప్పు, పంచదార, రుచి కి సరిపడా మిరియాల పొడి వేసి కలిపి 2 నుండి 3 నిమిషాలు సిమ్ లో ఉంచి ఆ తరవాత స్టవ్ కట్టేయాలి.

సర్వింగ్

  1. సూప్ ని సూప్ బౌల్ లోకి తీసుకుని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లాలి.
  2. 1 tbsp క్రీమ్ వేసి వేడి వేడిగా బ్రెడ్ తో సర్వ్ చేయాలి.