Print
chicken majestic telugu recipe

Chicken majestic Telugu Recipe

Course Starter
Cuisine Hyderabadi
Prep Time 2 hours
Cook Time 30 minutes
Total Time 2 hours 30 minutes
Author బిందు

Ingredients

చికెన్ ను నానబెట్టుటకు

  • 400 గ్రాములు చికెన్ బోన్ లెస్ సన్నని స్ట్రిప్స్ గా కట్ చేసినది
  • 400 ml మజ్జిగ
  • తగినంత ఉప్పు
  • 1 నిమ్మకాయ

డీప్ ఫ్రై కొరకు

  • ¼ కప్పు కార్న్ ఫ్లోర్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

చికెన్ మెజెస్టిక్ కొరకు

  • 2 tbsp వెల్లుల్లి తరుగు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 3 పచ్చి మిరపకాయలు
  • ½ tsp పసుపు
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • ¼ tsp గరం మసాలా
  • 1 tsp సోయా సాస్
  • 1 tsp వెనిగర్
  • 1/3 కప్పు పెరుగు
  • ¼ కప్పు ఉల్లి కాడ తరుగు
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • 1 నిమ్మకాయ
  • 3 tbsp నూనె

Instructions

చికెన్ ను మారినేట్ చేయుట

  1. బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి సన్నని స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి.
  2. మజ్జిగలో తగినంత ఉప్పు, నిమ్మ రసం, చికెన్ ముక్కలు వేసి కలిపి గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.

డీప్ ఫ్రయింగ్

  1. చికెన్ ముక్కలను ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మజ్జిగ వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
  2. ముక్కలకు కొద్దిగా కార్న్ ఫ్లోర్ పట్టించాలి. ఉప్పు వేయక్కరలేదు. మజ్జిగలోని ఉప్పు పీల్చుకున్నాయి కాబట్టి.
  3. కడాయిలో లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసి చికెన్ ముక్కలను 2 నిమిషాల పాటు వేయించాలి.
  4. వేయించిన ముక్కలను పేపర్ నాప్ కిన్ లోకి తీసుకోవాలి.

చికెన్ మెజెస్టిక్ తయారీ

  1. ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడి చేయాలి.
  2. వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, పసుపు, కారం ధనియాల పొడి, గరం మసాలా అన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపి వేయించాలి.
  4. తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి 3 నుండి 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద కలుపుతూ వేయించాలి.
  5. సగం చెక్క నిమ్మ రసం, ఉల్లి కాడల తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలిపి వేడిగా సర్వ్ చేయాలి.