Print
ulli karam dosa telugu recipe

Ulli Karam Dosa Telugu Recipe

Course Breakfast, Snack
Cuisine Andhra, Hyderabadi, South Indian, Telangana
Prep Time 15 minutes
Cook Time 5 minutes
Total Time 20 minutes
Author బిందు

Ingredients

ఉల్లి కారం కోసం

  • 3 మీడియం సైజు ఉల్లిపాయలు
  • 7 లేదా 8 ఎండు మిరపకాయలు
  • 1 tsp జీలకర్ర
  • 10 గ్రాములు చింతపండు
  • 4 వెల్లుల్లి రెబ్బలు
  • ఉప్పు తగినంత
  • 3 tsp నూనె

దోశ కొరకు

  • అవసరమైనంత దోశ పిండి
  • 2 tsp నూనె ఒక్కో దోసెకు
  • ¼ కప్పు కొత్తిమీర
  • 100 గ్రాములు ఛీజ్ తురుము

Instructions

ఉల్లి కారం తయారీ

  1. పెనంలో 3 tsp ల నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఎండు మిర్చి వేసి 1 నిమిషం వేయించాలి.
  2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
  3. పొయ్యి కట్టేసి వాటిని చల్లారనివ్వాలి.
  4. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

దోశ తయారీ

  1. పెనం మీద రెండు చుక్కలు నూనె వేసి పేపర్ నాప్‌కిన్ తో రుద్దాలి. ఇలా సీజనింగ్ చేయడం వల్ల దోసెలు పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తాయి.
  2. మంట హై ఫ్లేమ్ లో ఉంచి రెండు గరిటెల దోసెల పిండి వేసి గుండ్రంగా పెనం అంతా పరుచుకునేలా తిప్పాలి.
  3. ఒక 10 సెకన్లు ఆగి అప్పుడు సుమారు 2 tsp ల నూనె దోసె మీద ఇంకా చుట్టూరా వేయాలి.
  4. ఉల్లి కారం కూడా వేసి దోసె మీద రాయాలి.
  5. ఛీజ్ తురుము వేసి కరికే వరకు ఆగాలి.
  6. తరిగిన కొత్తిమీర వేసి దోసె ను మడిచి వేడి వేడి గా పల్లీ చట్నీ తో గానీ కొబ్బరి చట్నీ తో గానీ వడ్డించాలి.