Maatamanti

Sweet Corn Vada Telugu Recipe-స్వీట్ కార్న్ వడలు

Sweet Corn Vada Telugu Recipe with step by step instructions.English Version.

స్వీట్ కార్న్ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ వంటకాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఇంకా చలి కాలంలో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. ఇంట్లో పిల్లలు తినడానికి స్నాక్స్  కావాలని అడుగుతుంటారు.

అలాంటప్పుడు ఇవయితే వెంటనే తక్కువ శ్రమతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. పైగా స్వీట్ కార్న్ లో చాలా పోషక విలువలుంటాయి. బజ్జీలు, పునుగులు, పకోడీలు లాంటివి తినడానికి బాగున్నా అవీ రోజు చేసుకొని తినలేము కదా. పైగా వాటిని నూనె లో డీప్ ఫ్రై చేయాలి. అదే వీటినైతే డీప్ ఫ్రై చేసుకోవనసరం లేదు. కొద్దిగా నూనె తో షాలో ఫ్రై చేసుకోవచ్చు.

ఇదే వడలని కాస్త వెరైటీ గా చేసుకోవాలంటే పిండిలో కాస్త ఉడికించిన ఆలుగడ్డ వేసుకోవచ్చు. క్యారెట్ కానీ, ఉడికించిన పచ్చి బఠానీ కానీ వేసుకోవచ్చు. ఛీజ్ ను పిండి లోపల పెట్టి వడల్లా ఒత్తి కూడా ఫ్రై చేసుకోవచ్చు.వీటిని టమాటో కెచప్ కానీ లేదా మీ ఫేవరేట్ డిప్పింగ్ సాస్ తో కానీ తినవచ్చు.నోరూరించే ఈ తేలికైన స్వీట్ కార్న్ వడలను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Mirchi Bajji Recipe in Telugu
Cabbage Pakoda Recipe in Telugu
Semiya Bondalu Recipe in Telugu
KFC style Crispy Chicken Fries Recipe in Telugu
Maramarala Mixture Recipe in Telugu
Rava Vada Recipe in Telugu
Veg Manchuria Recipe in Telugu
Chicken Shawarma Recipe in Telugu
Masala Vadalu Recipe in Telugu

Click here for the English Version of the Recipe

Sweet Corn Vada Telugu Recipe
Prep Time
15 mins
Cook Time
20 mins
Total Time
35 mins
 
Course: Appetizer, Snack
Cuisine: Indian
Author: బిందు
Ingredients
  • 250 గ్రాములు స్వీట్ కార్న్
  • 4 పచ్చిమిరపకాయలు
  • 1- అంగుళం అల్లం
  • 2 లేదా ౩ tbsp మొక్కజొన్న పిండి
  • ½ tsp జీలకర్ర
  • గుప్పెడు పుదీనా ఆకులు
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • ఉప్పు తగినంత
  • ౩ లేదా 4 tbsp ఆలివ్ నూనె
Instructions
  1. స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిర్చి మరియు అల్లం లను మిక్సిలో వేసి మరీ మెత్తటి పేస్ట్ లా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, మొక్కజొన్న పిండి/కార్న్ ఫ్లోర్, జీలకర్ర, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  3. ఒక పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
  4. ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని కొద్దిగా నూనె రాయాలి.
  5. నిమ్మకాయ పరిమాణంలో పిండిని తీసుకుని ప్లాస్టిక్ షీట్ మీద వడల్లా తట్టి పెనంలో వేయాలి.
  6. రెండు వైపులా తిప్పుతూ పైన కొద్దిగా క్రిస్పీగా గట్టి పడే వరకు వేయించి తీసేయాలి.

Sweet Corn Vada Telugu Recipe Video

Related Post

Please Share this post if you like